RBI: రిజర్వ్ బ్యాంకులో 450 అసిస్టెంట్ పోస్టులు
ముంబయిలోని
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్ బోర్డు… దేశవ్యాప్తంగా ఆర్‌బీఐ
శాఖల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా 450 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. డిగ్రీ
ఉత్తీర్ణులైన అభ్యర్థులు అక్టోబర్ 10వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు
చేసుకోవాలి. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ
టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా
ఉన్న ఆర్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
ఖాళీల వివరాలు:
అసిస్టెంట్: 450 పోస్టులు
శాఖల వారీగా ఖాళీలు:
అహ్మదాబాద్- 13
బెంగళూరు- 58
భోపాల్- 12
భువనేశ్వర్- 19
చండీగఢ్- 21
చెన్నై- 1
గువాహటి- 26
హైదరాబాద్- 14
జైపుర్- 5
జమ్మూ- 18
కాన్పుర్, లఖ్‌నవూ- 55
కోల్‌కతా- 22
ముంబయి- 101
నాగ్‌పుర్ - 19
న్యూదిల్లీ - 28
పట్నా - 1
తిరువనంతపురం, కొచ్చి - 16
మొత్తం ఖాళీల సంఖ్య: 450.
అర్హత: కనీసం 50% మార్కులతో ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణులైతే సరిపోతుంది. పీసీ వర్డ్ ప్రాసెసింగ్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. అలాగే సంబంధిత రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంత భాషలో ప్రావీణ్యం తప్పనిసరి.
వయస్సు: 01-09-2023 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు; ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు; దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల(జనరల్) సడలింపు ఉంటుంది.
పే స్కేల్: నెలకు రూ.20,700 నుంచి రూ.55700.
ఎంపిక ప్రక్రియ: ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం: ప్రాథమిక పరీక్ష(ఆబ్జెక్టివ్)లో ఇంగ్లిష్ లాంగ్వేజ్(30 ప్రశ్నలు- 30 మార్కులు), న్యూమరికల్ ఎబిలిటీ(35 ప్రశ్నలు- 35 మార్కులు), రీజనింగ్ ఎబిలిటీ(35 ప్రశ్నలు- 35 మార్కులు) అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 100 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. ప్రధాన పరీక్ష(ఆబ్జెక్టివ్)లో రీజనింగ్(40 ప్రశ్నలు- 40 మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్(40 ప్రశ్నలు- 40 మార్కులు), న్యూమరికల్ ఎబిలిటీ(40 ప్రశ్నలు- 40 మార్కులు), జనరల్ అవేర్‌నెస్(40 ప్రశ్నలు- 40 మార్కులు), కంప్యూటర్ నాలెడ్జ్(40 ప్రశ్నలు- 40 మార్కులు) అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 200 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి 135 నిమిషాలు. మెయిన్స్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (ఎల్‌పీటీ) రాయాల్సి ఉంటుంది. పరీక్ష సంబంధిత రాష్ట్రంలోని అధికారిక భాషలో నిర్వహిస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.450. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ.50.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు...
ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: 13-09-2023 నుంచి 04-10-2023 వరకు.
ఆన్‌లైన్‌లో పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలు: 13-09-2023 నుంచి 04-10-2023 వరకు.
ఆన్‌లైన్ ప్రిలిమినరీ టెస్ట్ తేదీలు: 21-10-2023, 23-10-2023.
ఆన్‌లైన్ మెయిన్ ఎగ్జామ్ తేదీ: 02-12-2023.
నోటిఫికేషన్ సమాచారం
పోస్ట్ చేసిన తేదీ: 13-09-2023
ఆర్‌బీఐ పిలుస్తోంది..
భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) 450 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలచేసింది. డిగ్రీ అర్హతతో వీటికి పోటీ పడవచ్చు. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్లో చూపిన ప్రతిభతో నియామకాలు చేపడతారు.
భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) 450 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలచేసింది. డిగ్రీ అర్హతతో వీటికి పోటీ పడవచ్చు. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్లో చూపిన ప్రతిభతో నియామకాలు చేపడతారు. ఎంపికైనవారు మొదటి నెల నుంచే సుమారు రూ.48 వేల వేతనం అందుకోవచ్చు. అనుభవం, శాఖాపరమైన పరీక్షల ద్వారా భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు.
వారానికి ఐదు పని దినాలు, తక్కువ పనివేళలు, ఒత్తిడి లేని విధులు ఆర్‌బీఐ ప్రత్యేకత. అసిస్టెంట్లుగా చేరినవారు బ్యాంకుల లావాదేవీలను పరిశీలిస్తారు. వీరు మూడేళ్ల ఉద్యోగ అనుభవం తర్వాత శాఖాపరమైన పరీక్షల ద్వారా గ్రేడ్ ఎ, అనంతరం గ్రేడ్ బి స్థాయిని అందుకోవచ్చు. అసిస్టెంట్ ఉద్యోగాలకు ముందుగా ప్రాథమిక పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించినవారికి ప్రధాన పరీక్ష ఉంటుంది. ఈ దశను దాటిన వారు భాషా నైపుణ్య పరీక్షలో అర్హత సాధించడం తప్పనిసరి. ఈ మార్కులను తుది నియామకాల్లో పరిగణనలోకి తీసుకోరు. ప్రధాన పరీక్ష స్కోరుతో మెరిట్, రిజర్వేషన్లు అనుసరించి ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. అసిస్టెంట్‌గా చేరిన వారికి రూ.20,700 మూలవేతనం చెల్లిస్తారు. విధుల్లో చేరినవారు మొదటి నెల నుంచే రూ.47,849 వేతనం పొందవచ్చు. దీనికి హెచ్‌ఆర్‌ఏ అదనంగా లభిస్తుంది. హైదరాబాద్ లాంటిచోట్ల విధులు నిర్వర్తించినవారికి ఆర్‌బీఐ వసతి గృహాల్లో అవకాశం లభించకపోతే ప్రారంభం నుంచే సుమారు రూ.పది వేల హెచ్‌ఆర్‌ఏ అందుతుంది.
ప్రాథమిక పరీక్ష
దీన్ని వంద మార్కులకు నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున వంద ప్రశ్నలు వస్తాయి. వీటిని 3 విభాగాల నుంచి అడుగుతారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30, న్యూమరికల్ ఎబిలిటీ 35, రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి ఒక గంట. ఒక్కో విభాగానికి 20 నిమిషాల సమయాన్ని కేటాయించారు. ఇందులో అర్హత సాధించినవారి జాబితా నుంచి మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం ఒక్కో పోస్టుకు పది మందిని చొప్పున ప్రధాన పరీక్ష రాసే అవకాశం కల్పిస్తారు.
ప్రధాన పరీక్ష
200 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 200 ప్రశ్నలు వస్తాయి. ఒక్కో విభాగం నుంచి 40 చొప్పున.. రీజనింగ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్‌ల్లో ప్రశ్నలు అడుగుతారు. విభాగాలవారీ కేటాయించిన సమయాల్లో వీటిని పూర్తిచేయాలి. జనరల్ అవేర్‌నెస్ విభాగానికి 25 నిమిషాలు, కంప్యూటర్ నాలెడ్జ్‌కు 20 నిమిషాల వ్యవధి ఉంది. మిగిలిన ఒక్కో విభాగాన్నీ 30 నిమిషాల్లో పూర్తిచేయాలి. మొత్తం పరీక్ష వ్యవధి 135 నిమిషాలు. ఇందులో సాధించిన మార్కుల మెరిట్ ప్రకారం విభాగాల వారీ ఒక్కో పోస్టుకు ఇద్దరిని చొప్పున లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ పరీక్షకు ఎంపిక చేస్తారు.
ప్రాథమిక, ప్రధాన.. రెండు పరీక్షల్లోనూ రుణాత్మక మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికీ పావు మార్కు తగ్గిస్తారు. ప్రశ్నలు ఆంగ్లం, హిందీ మాధ్యమాల్లో అడుగుతారు. రెండు పరీక్షల్లోనూ విభాగాలవారీ అర్హత మార్కులు పొందడం తప్పనిసరి.
లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ
మెయిన్స్‌లో అర్హత సాధించినవారికి భాషా నైపుణ్య పరీక్ష (ఎల్‌పీటీ) నిర్వహిస్తారు. అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న కార్యాలయానికి కేటాయించిన భాషలో ఈ పరీక్ష రాయాలి. హైదరాబాద్‌లోని 14 ఖాళీలకు మాత్రమే తెలుగు భాష పరీక్ష రాసే అవకాశం ఉంది. ముంబయి కార్యాలయంలో 101 ఖాళీలు ఉన్నాయి. అయితే వీటికి పోటీ పడటానికి మారాఠీ లేదా కొంకణి భాషలో ఉత్తీర్ణత తప్పనిసరి. హిందీ భాష వచ్చినవారు చండీగఢ్ 21/ కాన్పూర్ అండ్ లఖ్‌నవూ 55/ నాగ్‌పూర్ 19/ న్యూదిల్లీ 28 ఖాళీల్లో ఏదో ఒక ప్రాంతాన్ని ఎంపికచేసుకుని పోటీ పడవచ్చు. బెంగళూరులో 58 ఖాళీలకు కన్నడ వచ్చిన వారికి అవకాశం దక్కుతుంది.
సన్నద్ధత
ఇప్పటి నుంచి ప్రిలిమినరీకి సరిగా 37 రోజుల వ్యవధే ఉంది. ఈ తక్కువ వ్యవధిని గరిష్ఠంగా సద్వినియోగం చేసుకున్నవారే విజయం సాధించగలరు. అయితే ఇప్పటికే బ్యాంకు పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ఆర్‌బీఐ కోసం ప్రత్యేకంగా సన్నద్ధం కానవసరం లేదు. రెండు పరీక్షలూ ఒకే తరహాలో ఉండటమే దీనికి కారణం.
- కొత్తగా సన్నద్ధమయ్యేవారు మొదటి 20 రోజులు ప్రాథమికాంశాలు చదివి, విభాగాల వారీ మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి. చివరి 15 రోజులు వీలైనన్ని మాక్ టెస్టులు రాయాలి.
- ప్రతి విభాగాన్నీ నిర్ణీత సమయంలోనే పూర్తిచేయాలి. అలాగే అన్ని విభాగాల్లోనూ కనీస మార్కులు పొందడం తప్పనిసరి. కాబట్టి అన్నింటికీ ప్రాధాన్యమివ్వాలి.
- రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఉన్న వ్యవధిలో ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడానికి వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయడమే మార్గం.
- ఇంగ్లిష్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ ఈ మూడు అంశాలూ ప్రాథమిక, ప్రధాన పరీక్ష రెండింటిలోనూ ఉన్నాయి కాబట్టి ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటికీ ఒకే సన్నద్ధత సరిపోతుంది. జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ విభాగాలను ప్రాథమిక పరీక్ష అనంతరం చదువుకోవాలి.
- న్యూమరికల్ ఎబిలిటీ ప్రశ్నలు సులువుగా ఉన్నప్పటికీ సమాధానం రాబట్టడానికి ఎక్కువ సమయం అవసరమవుతుంది. అందువల్ల తక్కువ వ్యవధిలో సమాధానం గుర్తించడానికి అవకాశం ఉన్న ప్రశ్నలపైనే ముందు దృష్టి పెట్టాలి. సమయం మిగిలితేనే మిగిలినవి ప్రయత్నించాలి.
- కూడికలు, తీసివేతలు, భాగహారం, గుణింతాలపై పట్టు సాధించాలి. అంకెలు, సూక్ష్మీకరణలపై ప్రావీణ్యం పొందితే ఎక్కువ మార్కులు సొంతం చేసుకోవచ్చు.
- రుణాత్మక మార్కులు ఉన్న కారణంగా తెలియని ప్రశ్నలను వదిలేయడమే మేలు చేస్తుంది.
- పరీక్షకు పదిహేను రోజుల ముందు నుంచి కనీసం రోజుకొక మాక్ టెస్టు రాయాలి. సమయానికీ ప్రాధాన్యమివ్వాలి. ఫలితాలు విశ్లేషించుకుని, సన్నద్ధత మెరుగుపరచుకోవాలి. వెనుకబడిన విభాగాల్లో వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేస్తే, తప్పులు పునరావృతం కావు.
ముఖ్య సమాచారం
అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఉత్తీర్ణులైతే చాలు.
వయసు: సెప్టెంబరు 1, 2023 నాటికి 20 - 28 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే సెప్టెంబరు 2, 1995 - సెప్టెంబరు 1, 2003 మధ్య జన్మించినవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబరు 4
దరఖాస్తు రుసుం: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్‌కు రూ.50. మిగిలిన అందరికీ రూ.450. (జీఎస్‌టీ అదనం)
ప్రిలిమినరీ పరీక్షలు: అక్టోబరు 21, 23 తేదీల్లో నిర్వహిస్తారు.
మెయిన్ పరీక్ష తేదీ: డిసెంబరు 2
ప్రాథమిక పరీక్ష కేంద్రాలు: ఏపీలో విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతి, కాకినాడ, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, చీరాల, విజయనగరం. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.
వెబ్‌సైట్: https://www.rbi.org.in/
For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి