ఈ అర్హతలుంటే ఆలస్యం చేయకుండా అప్లై చేసుకోండి | Google: నెలకు రూ. 83 వేలు స్టైఫండ్ | ఇంటర్న్‌షిప్‌కి ఎంపికైన వ్యక్తి ఆరు నెలలు లేదా 22 నుంచి 24 నెలలు హైదరాబాద్ లేదా బెంగళూరులో పనిచేయాల్సి ఉంటుంది.| ఈ సమయంలో స్టైఫండ్‌గా నెలకు రూ. 83,947 కంపెనీ అందిస్తుంది.
Google Winter Internship 2024: ప్రస్తుతం ఎక్కువ శాలరీలు ఇస్తున్న కంపెనీలలో ప్రముఖ టెక్ దిగ్గజం 'గూగుల్' ఒకటని అందరికి తెలుసు. ఈ సంస్థలో ఉద్యోగం కోసం చాలామంది విశ్వప్రయత్నం చేస్తారు. అందులో అందరికి జాబ్ వస్తుందని ఖచ్చితంగా చెప్పలేము. కానీ ఇప్పుడు ఈ సంస్థ 'వింటర్ ఇంటర్న్‌షిప్-2024' పేరుతో ఒక ప్రత్యేక ప్రోగ్రామ్ నిర్వహిస్తోంది. దీనికి ఎలా అప్లై చేసుకోవాలి? స్టైఫండ్ ఎంత ఇస్తారనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
గూగుల్ కంపెనీ ప్రవేశపెట్టిన ఈ ఇంటర్న్‌షిప్ కోసం అప్లై చేసుకోవాలంటే కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత రంగాలలో బ్యాచిలర్, మాస్టర్స్ లేదా డ్యూయల్-డిగ్రీ ప్రోగ్రామ్‌లో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులై ఉండాలి. టెక్ దిగ్గజంతో మీ కెరీర్‌ని ప్రారంభించాలని చూస్తున్నట్లయితే, ఫ్రెషర్లకు ఈ ఇంటర్న్‌షిప్ సువర్ణావకాశం అనే చెప్పాలి.
అప్లై చేయడం ఎలా?
- అప్లై చేయడానికి ముందు ఒక రెజ్యూమ్ క్రియేట్ చేసుకోవాలి. అందులో తప్పకుండా కోడింగ్ ల్యాంగ్వేజ్ మీద మీకు నైపుణ్యం ఉన్నట్లు నిర్దారించాలి.
- https://cse.noticebard.com/internships/google-winter-internship-2024/ఈ లింకులోకి వెళ్లి రెజ్యూమ్ సెక్షన్లో రెజ్యూమ్ అప్లోడ్ చేయాలి.
- హయ్యర్ స్టడీస్ విభాగంలో అవసరమైన విషయాలు ఫిల్ చేయాలి. ఆ తరువాత డిగ్రీ స్టేటస్ కింద 'నౌ అటెండింగ్' ఆప్షన్ ఎంచుకోవాలి.
- తరువాత ఇంగ్లీష్ ట్రాన్స్క్రిప్ట్ను అప్లోడ్ చేసి, అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
- దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్ డేట్ 2023 అక్టోబర్ 01. ఇందులో ఎంపికైన వారు హైదరాబాద్, బెంగళూరులో పనిచేయాల్సి ఉంటుంది.
కనీస అర్హతలు..
- ఇంటర్న్‌షిప్ కోసం అప్లై చేసుకోవాలంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లేదా సంబంధిత సాంకేతిక రంగంపై దృష్టి సారించే అసోసియేట్, బ్యాచిలర్ లేదా మాస్టర్స్ డిగ్రీ ఉండాలి.
- సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో అనుభవం.
- ఒకటి లేదా అంతకంటే ఎక్కువ భాషలలో కోడింగ్ ప్రావీణ్యం (Ex: C, C++, Java, JavaScript, Python).
ఎంపికైన వారు ఇంటర్న్‌షిప్ సమయంలో గూగుల్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ ఇంటర్న్‌గా పనిచేయాల్సి ఉంటుంది. ఇందులో గూగుల్ టెక్నాలజీ సవాళ్ళను ఎదుర్కొంటూ సేవలందించాల్సి ఉంటుంది. సెర్చ్ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచడం, కంప్యూటింగ్ ప్లాట్‌ఫామ్, నెట్వర్కింగ్ టెక్నాలజీలను అభివృద్ధి చేయడం, వీడియో ఇండెక్సింగ్‌ను ఆటోమేట్ చేయడం వంటివి ఉండవచ్చు. మొత్తం మీద సంక్లిష్టమైన సాంకేతిక సమస్యలకు వినూత్న పరిష్కారాలను రూపొందించడమే మీ పని.
స్టైఫండ్ ఎలా?
ఇంటర్న్‌షిప్‌కి ఎంపికైన వ్యక్తి ఆరు నెలలు లేదా 22 నుంచి 24 నెలలు
హైదరాబాద్ లేదా బెంగళూరులో పనిచేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో స్టైఫండ్‌గా
నెలకు రూ. 83,947 కంపెనీ అందిస్తుంది. ఈ ప్రోగ్రామ్ 2024 జనవరి నుంచి
ప్రారంభమవుతుంది.
For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
కామెంట్లు