ఆపరేటివ్ ట్రైనీలకు ఆహ్వానం | హైదరాబాద్‌లోని మినీరత్న సంస్థ ‘మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్’ (మిధానీ) 54 జూనియర్, సీనియర్ ఆపరేటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు
హైదరాబాద్‌లోని మినీరత్న సంస్థ ‘మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్’ (మిధానీ) 54 జూనియర్, సీనియర్ ఆపరేటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. https://midhani-india.in
హైదరాబాద్‌లోని మినీరత్న సంస్థ ‘మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్’ (మిధానీ) 54 జూనియర్, సీనియర్ ఆపరేటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్/ ప్రాక్టికల్ టెస్ట్‌ల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులందరికీ రాత పరీక్ష ఉంటుంది. దీంట్లో అర్హత పొందిన, అవసరమైన అభ్యర్థులకు స్కిల్/ ప్రాక్టికల్ టెస్ట్‌ను నిర్వహిస్తారు.
మొత్తం 54 ఉద్యోగాల్లో.. జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ-ఫిట్టర్-13, జేవోటీ-వెల్డర్-02, జేవోటీ-ఎలక్ట్రీషియన్-06.. సీనియర్ ఆపరేటివ్ ట్రైనీ-మెటలర్జీ-20, ఎస్‌వోటీ-మెకానికల్-10, ఎస్‌వోటీ-ఎలక్ట్రికల్-03 ఉన్నాయి. జేవోటీలో 5, ఎస్‌వోటీలో 5 పోస్టులను ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు రిజర్వు చేశారు.
జేవోటీ పోస్టులకు.. ఎస్‌ఎస్‌సీ, ఐటీఐ ఫిట్టర్/వెల్డర్/ఎలక్ట్రీషియన్ పాసవడంతోపాటు.. నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికెట్ ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30 సంవత్సరాలు. ఎస్‌వోటీ పోస్టులకు.. మెటలర్టికల్ ఇంజినీరింగ్/ మెకానికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిప్లొమా 60 శాతం మార్కులతో పాసవ్వాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఇంజినీరింగ్ డిప్లొమా 45 శాతం మార్కులతో పాసైతే సరిపోతుంది. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35 సంవత్సరాలు. ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్థులకు గరిష్ఠ వయసులో మినహాయింపులు వర్తిస్తాయి. దరఖాస్తు ఫీజు రూ.100. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ/ ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు లేదు. జేవోటీ పోస్టులకు వేతనం నెలకు రూ.20,000, ఎస్‌వోటీలకు వేతనం రూ.21,900 ఉంటుంది. మూలవేతనంతోపాటుగా డీఏ, హెచ్‌ఆర్‌ఏ, పెర్క్స్, ఈపీఎఫ్, గ్రాట్యుటీ, ఇతర పోత్సాహకాలూ ఉంటాయి.
ఎంపిక ఎలా?
- రాత పరీక్ష, స్కిల్/ ట్రేడ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- వచ్చిన దరఖాస్తుల నుంచి.. విద్యార్హతల ఆధారంగా కొంతమంది అభ్యర్థులను ఎంపికచేసి... రాత పరీక్ష నిర్వహిస్తారు. దీంట్లో అర్హత సాధించినవారిని స్కిల్/ ట్రేడ్‌టెస్ట్‌కు ఎంపికచేస్తారు.
- రాత పరీక్ష 100 మార్కులకు ఇంగ్లిష్‌లో ఉంటుంది. వ్యవధి 90 నిమిషాలు. విద్యార్హతలకు 10 మార్కులు.. అదనపు విద్యార్హతలకు 2 మార్కుల చొప్పున గరిష్ఠంగా 15 మార్కుల వరకూ కేటాయిస్తారు.
- రాత పరీక్షతోపాటుగా ప్రాక్టికల్/ ట్రేడ్ టెస్టులను కూడా ఇంగ్లిష్‌లోనే నిర్వహిస్తారు.
- నెగెటివ్ మార్కులు లేవు. బాగా తెలిసిన ప్రశ్నలకు ముందుగా సమాధానాలను రాయాలి. తర్వాత కాస్త సమయం తీసుకుని ఆలోచించి.. మిగతా ప్రశ్నలకు జవాబులు రాయాలి.
- ఎంపిక ప్రక్రియను ఏ తేదీన, ఎక్కడ నిర్వహించేదీ అభ్యర్థుల ఈమెయిల్‌కు తెలియజేస్తారు. లేదా సంస్థ వెబ్‌సైట్ ద్వారా సమాచారాన్ని అందుబాటులో ఉంచుతారు.
- సెలెక్షన్‌కు అభ్యర్థులు.. విద్యార్హతలు, వయసు, కేటగిరీ, ఎంప్లాయ్‌మెంట్ రిజిస్ట్రేషన్ కార్డ్.. ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలి.
గుర్తుంచుకోవాల్సినవి
- 18.10.2023 నాటికి తగిన వయసు, విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి.
- ప్రకటనలోని పూర్తి వివరాలను చదివిన తర్వాతే ఆన్‌లైన్ దరఖాస్తును నింపాలి. ప్రస్తుతం ఉపయోగిస్తోన్న మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీలను మాత్రమే దరఖాస్తులో రాయాలి.
- దరఖాస్తు ప్రింటవుట్ తీసుకుని భద్రపరుచుకోవాలి. హార్డ్‌కాపీలను పంపనవసరం లేదు.
దరఖాస్తుకు చివరి తేదీ: 01.11.2023
వెబ్‌సైట్: https://midhani-india.in
- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html
కామెంట్‌లు