రిమోట్ కొలువుకు ఆన్‌లైన్ వేదికలు!
రెండు మూడు బస్సులు మారో.. రైల్లో ప్రయాణించో చాలామంది కార్యాలయాలకు వెళ్తుంటారు. అనుకోని పరిస్థితుల్లో ఒక్కోసారి కాస్త ఆలస్యమైనా.. సమస్యే.
రెండు మూడు బస్సులు మారో.. రైల్లో ప్రయాణించో చాలామంది కార్యాలయాలకు వెళ్తుంటారు. అనుకోని పరిస్థితుల్లో ఒక్కోసారి కాస్త ఆలస్యమైనా.. సమస్యే. రాస్తారోకోలూ, ట్రాఫిక్ జామ్‌లూ లాంటి చిక్కులు అదనం. ఇలా ఇంటి నుంచి ఎంతో దూరంగా ఉండే ఆఫీసుకు ప్రయాణించడానికి ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ఆధునిక సాంకేతికత మూలంగా ఆవిర్భవించి ప్రాచుర్యం పొందిన ‘రిమోట్ వర్క్’ విధానం ఈ సమస్యల నుంచి తప్పిస్తుంది. అయితే విశ్వసనీయమైన రిమోట్ ఉద్యోగాలను అన్వేషించటం తప్పనిసరి.
లాక్‌డౌన్ సమయంలోనే కాకుండా ఆ తర్వాత కూడా చాలా కంపెనీలు రిమోట్ వర్క్‌కే ప్రాధాన్యమిస్తున్నాయి. కొన్ని సంస్థలైతే తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసే అవకాశాన్నీ ఇస్తున్నాయి. దీంట్లో భాగంగా.. ఇంటి నుంచి పనిచేయొచ్చు లేదా ప్రయాణాలు చేస్తూనో, పార్కులో కూర్చునో లేదా ఇద్దరు ముగ్గురు కలిసి ఒకచోట కూర్చునో హాయిగా పనిచేసుకోవచ్చు.
- రిమోట్ వర్క్‌తో సమయం, ప్రయాణ ఛార్జీల ఆదాతోపాటు మరెన్నో ప్రయోజనాలున్నాయి.
- నిర్ణీత సమయంలో పనులు పూర్తిచేసి మిగిలిన సమయాన్ని విద్యార్హతలు పెంచుకోవడానికి వినియోగించొచ్చు. ఆసక్తులను అనుసరించి ఉదయం లేదా సాయంత్రం సమయాల్లో ఏదైనా కోర్సులో చేరొచ్చు.
- ప్రయాణంలో వృథా అయ్యే సమయాన్ని సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవడానికి వినియోగించుకోవచ్చు.
- ఆసక్తి ఉంటే ఆన్‌లైన్ క్లాసుల్లో చేరొచ్చు. నైపుణ్యాల శిక్షణా తీసుకోవచ్చు.
- అభిరుచులకు అనుగుణంగా ఏవైనా క్రీడలను సాధన చేయొచ్చు. సంగీతం, చిత్రలేఖనం, యోగా, ధ్యానం నేర్చుకోవచ్చు.
- రిమోట్ వర్కింగ్ పద్ధతిలో పనిచేయడం మహిళలకు ఎక్కువ సౌలభ్యం. ఒకపక్క పెద్దవాళ్లు లేదా చిన్నారుల సంరక్షణ బాధ్యతలను చూసుకుంటూనే పనిచేసుకునే అవకాశం ఉంటుంది.
- ఒక్కోసారి సమావేశాల నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. వర్చువల్ సమావేశాల వల్ల దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరమూ ఉండదు.
- నగరంలోనో, పట్టణంలోనో ఉండి పనిచేయాల్సిన అవసరమూ ఉండదు. ఇంటర్నెట్ సదుపాయం ఉంటే చాలు.. ఎక్కడి నుంచైనా పనిచేసుకోవచ్చు.
- కుటుంబంతో కలిసి సొంతూరులోనే ఉంటూ పనిచేసుకోవచ్చు.
- ఇష్టమైతే సముద్ర తీరంలోనో., తోటలోనో కూర్చుని కూడా విధులు నిర్వర్తించవచ్చు.
- ఉద్యోగ, వ్యక్తిగత జీవితాల మధ్య సమన్వయం సాధించడానికి అవకాశం ఉంటుంది.
- కొన్ని కార్యాలయాల్లో అనవసర రాజకీయాలు చోటుచేసుకుంటాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నా... కొన్ని అనవసర విషయాల్లోకి లాగే ప్రయత్నాలు జరుగుతుంటాయి. రిమోట్ వర్కింగ్‌లో ఇలాంటివాటికి దూరంగా ప్రశాంతంగా ఎవరి పని వారు చేసుకుపోవచ్చు.
- ఇన్ని ప్రయోజనాలను అందించే రిమోట్ వర్కింగ్ సదుపాయాన్ని అందించే కొలువులను ప్రముఖ ఆన్‌లైన్ వేదికల ద్వారా అందిపుచ్చుకోవచ్చు.
https://www.flexjobs.com/: సుమారు యాభై రంగాలకు చెందిన ఉద్యోగ వివరాలు దీంట్లో ఉంటాయి. ఫైనాన్స్, ఈవెంట్ ప్లానింగ్, హ్యూమన్ సర్వీసెస్, ఇన్సూరెన్స్... మొదలైన రంగాలకు చెందిన పార్ట్‌టైమ్, ఫుల్‌టైమ్ కొలువులూ ఉంటాయి. తక్కువ, ఉన్నత విద్యార్హతలు ఉన్నవారు ఇద్దరూ ప్రయోజనం పొందే విధంగా ప్రవేశ స్థాయి నుంచి ఎగ్జిక్యూటివ్ హోదా వరకూ ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి.
https://remote.co/: బుక్ కీపింగ్, ట్రాన్స్‌లేషన్, డేటా ఎంట్రీ, హెల్త్‌కేర్, అడ్మినిస్ట్రేషన్ రంగాలకు చెందిన ఉద్యోగాలను అందిస్తుంది. అదనంగా బ్లాగ్‌ను కూడా నిర్వహిస్తుంది. దీంట్లో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న అంశాల మీద చర్చలు కూడా జరుగుతాయి. వివిధ రంగాల వ్యక్తులు అడిగే సందేహాలకు సమాధానాలనూ అందిస్తుంది. దీంట్లోని రిమోట్ వర్క్ స్టాటిస్టిక్స్ ట్యాబ్‌ను ఉపయోగించి.. ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతోన్న రంగాల సమాచారాన్నీ తెలుసుకోవచ్చు.
https://remoteok.com/: సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, కస్టమర్ సపోర్ట్, మార్కెటింగ్, డిజైన్.. ఇతర రంగాలకు చెందిన ఉద్యోగాలు ఉంటాయి. ఎక్కువ నుంచి తక్కువ వేతనాలు అందించే ఉద్యోగాలు, కంపెనీల వివరాలు దీంట్లో ఉంటాయి.
https://www.upwork.com/: డెవలప్‌మెంట్, ఐటీ, ఏఐ సర్వీసెస్, ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, రైటింగ్, ట్రాన్స్‌లేషన్, డిజైన్, క్రియేటివ్, సేల్స్, మార్కెటింగ్, అడ్మిన్, కస్టమర్ సపోర్ట్, ఫైనాన్స్, అకౌంటింగ్, లీగల్, హెచ్ అండ్ ట్రెయినింగ్ మొదలైన రంగాలకు చెందిన ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి. వ్యక్తిగత నైపుణ్యాల అభివృద్ధికి తోడ్పడుతుంది. ఫ్రీలాన్సర్, షార్ట్‌టర్మ్ ఉద్యోగాలూ ఉంటాయి.
https://weworkremotely.com/: ప్రతినెలా సుమారు నలభైఅయిదు లక్షలమంది దీన్ని సందర్శిస్తారు. ప్రోగ్రామింగ్, డిజైన్, కాపీరైటింగ్, సేల్స్, మార్కెటింగ్ రంగాల్లో ఫుల్‌టైమ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉంటాయి. దీంట్లో రిమోట్ వర్కింగ్ ఉద్యోగావకాశాలు, వంద సంస్థల వివరాలూ అందుబాటులో ఉన్నాయి.
https://in.indeed.com/: ఇది నౌకరి.కామ్ లాంటిదే అయినప్పటికీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్‌లకు ప్రత్యేక సెక్షన్‌ను నిర్వహిస్తుంది. ఉద్యోగ అన్వేషణలో ఉన్నవాళ్లు.. ఏ ఉద్యోగం కావాలి?, ఎంత వేతనం ఆశిస్తున్నారు, అనుభవం.. మొదలైన వివరాలను ఇక్కడ తెలియజేయాలి. వారి విద్యార్హతలు, తెలిపిన వివరాలకు అనుగుణంగా ఉద్యోగాన్ని అందిస్తారు.
https://jobspresso.co/: టెక్నాలజీ, మార్కెటింగ్, కస్టమర్ సపోర్ట్, డిజైన్, యూఎక్స్, డెవోప్స్, రైటింగ్, ఎడిటింగ్ అండ్ డెవలప్‌మెంట్ రోల్స్.. మొదలైన రంగాల్లో ఉద్యోగాలను అందిస్తుంది. ఈ వేదిక ద్వారా ఇంగ్లిష్ ట్యూటర్‌గానూ అవకాశాన్ని అందిపుచ్చుకోవచ్చు. విద్యార్హతల సర్టిఫికెట్లు, అనుభవంలేకపోయినా నైపుణ్యాల ఆధారంగానూ అవకాశాలు కల్పిస్తారు.
https://powertofly.com/:ఈ వేదిక ద్వారా మహిళా ఉద్యోగితకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. కెరియర్ ఎంపికలో మహిళలకు సలహాలూ, సూచనలు అందిస్తారు. వివిధ అంశాలపైన ఏడాది పొడవునా సమావేశాలను నిర్వహిస్తారు.
https://www.virtualvocations.com/: వివిధ రంగాల్లో టెలికమ్యూటింగ్ కొలువులకు ప్రత్యేకించింది. మార్కెటింగ్, అకౌంటింగ్ రంగాలకు చెందిన ఉద్యోగాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఫ్రీలాన్సింగ్ ఉద్యోగాలనూ అందిస్తుంది.
https://remotive.com/: ఉద్యోగాన్వేషకులకు అవసరమైన వెబినార్‌లు, తాజా సమాచారాన్ని అందిస్తుంది. నైపుణ్యాలు, ప్రదేశం, సంస్థ ఆధారంగా ఉద్యోగాల అన్వేషణకు తోడ్పడుతుంది.
For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం ఈరోజు నుండి వాట్స్అప్ ఛానల్లో జాయిన్ అయ్యి రోజు వారి సమాచారం పొందవచ్చు గమనించగలరు Follow the Gemini Internet Hindupur Updates channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Va5XoCJ3LdQWarryRy2D రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి