SBI Recruitment: త్వరలో ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్ * ఏదైనా డిగ్రీతో దరఖాస్తుకు అవకాశం * ప్రిలిమ్స్, మెయిన్స్ ఆధారంగా ఎంపిక
SBI Recruitment: త్వరలో ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్
* ఏదైనా డిగ్రీతో దరఖాస్తుకు అవకాశం
* ప్రిలిమ్స్, మెయిన్స్ ఆధారంగా ఎంపిక
ఈనాడు ప్రతిభ డెస్క్: దేశంలోని
అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)
నుంచి త్వరలో క్లర్క్ జాబ్ నోటిఫికేషన్ రాబోతోంది. అర్హత, ఆసక్తిగల
అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఏదైనా విభాగంలో
గ్రాడ్యుయేషన్/ తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. డిగ్రీ ఫైనల్/ చివరి
సెమిస్టర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 20 ఏళ్ల నుంచి 28
ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు,
పీడీబ్ల్యూడీ(జనరల్/ ఈడబ్ల్యూఎస్) అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠ
వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. బేసిక్ పే నెలకు రూ.19,900 అందుతుంది.
ఆన్లైన్ టెస్ట్(ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్), స్థానిక భాష పరీక్ష
ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. గతేడాది 5008 జూనియర్
అసోసియేట్స్(కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) పోస్టులకు ప్రకటన విడుదల
కాగా నియామక ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే.
- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్తో జెమిని ఇంటర్నెట్ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | -
కామెంట్లు