24, అక్టోబర్ 2023, మంగళవారం

SSC : ఎస్‌ఎస్‌సీ- సీజీఎల్‌ఈ 2023 టైర్‌-2 అడ్మిట్‌ కార్డులు * అక్టోబర్‌ 25, 26, 27 తేదీల్లో పరీక్షలు

SSC : ఎస్‌ఎస్‌సీ- సీజీఎల్‌ఈ 2023 టైర్‌-2 అడ్మిట్‌ కార్డులు

* అక్టోబర్‌ 25, 26, 27 తేదీల్లో పరీక్షలు

కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్(సీజీఎల్‌) పరీక్ష-2023కు సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) తాజాగా అడ్మిట్‌ కార్డులను విడుదల చేసింది. టైర్‌-2 పరీక్షలు అక్టోబర్‌ 25, 26, 27 తేదీల్లో జరగనున్నాయి. జులైలో నిర్వహించిన టైర్‌-1లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు టైర్‌-2 పరీక్షలు రాయనున్నారు. ఈ పరీక్ష ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లో 7,500 ఖాళీలను భర్తీ చేయనున్నారు. గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్, ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, ఆడిటర్, అకౌంటెంట్, పోస్టల్ అసిస్టెంట్ తదితర పోస్టులు ఉన్నాయి. టైర్‌-1, టైర్‌-2 ఎగ్జామినేషన్‌, డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్, ఫిజికల్/ మెడికల్ టెస్టులు, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆయా పోస్టులను బట్టి వేతనం నెలకు రూ.25,500 నుంచి రూ.1,51,100 ఉంటుంది. 




సీజీఎల్‌ఈ టైర్‌-2 సదరన్‌ రీజియన్‌ అడ్మిట్‌ కార్డుల కోసం క్లిక్‌ చేయండి

 

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | -

కామెంట్‌లు లేవు: