27, అక్టోబర్ 2023, శుక్రవారం

SSC GD Constable: ఫిబ్రవరి 20 నుంచి జీడీ కానిస్టేబుల్ రాత పరీక్షలు * నవంబర్‌ 24న ఉద్యోగ ప్రకటన విడుదల * భారీ సంఖ్యలో కొత్త ఖాళీలు

SSC GD Constable: ఫిబ్రవరి 20 నుంచి జీడీ కానిస్టేబుల్ రాత పరీక్షలు  

* నవంబర్‌ 24న ఉద్యోగ ప్రకటన విడుదల


* భారీ సంఖ్యలో కొత్త ఖాళీలు
 


ఈనాడు ప్రతిభ డెస్క్‌: కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్ రాత పరీక్ష తేదీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) వెల్లడించింది. ఈ మేరకు పరీక్ష షెడ్యూల్‌ను విడుదల చేసింది. కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్‌) రాత పరీక్షలు నవంబర్‌ 14, 15, 16, 17, 20, 21, 22, 23, 24, 28, 29, 30; డిసెంబర్‌ 1, 2, 3వ తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపింది. కానిస్టేబుల్(గ్రౌండ్‌ డ్యూటీ) రాత పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 20, 21, 22, 23, 24, 26, 27, 28, 29; మార్చి 1, 5, 6, 7, 11, 12వ తేదీల్లో దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో జరుగుతుందని పేర్కొంది.



గతేడాది 50,187 ఖాళీల భర్తీ


భారీ సంఖ్యలో కానిస్టేబుల్(గ్రౌండ్‌ డ్యూటీ) నియామకాల ప్రక్రియకు సైతం ఎస్‌ఎస్‌సీ సన్నద్ధమవుతోంది. వార్షిక క్యాలెండర్‌ ప్రకారం నవంబర్‌ 24న నోటిఫికేషన్‌ వెలువడనుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్‌ 28 పూర్తి కానుంది. గతేడాది నవంబర్‌లో భారీ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రకటనను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ ద్వారా వివిధ సాయుధ బలగాల్లో 50,187 కానిస్టేబుల్(జీడీ)/ రైఫిల్‌మ్యాన్/ సిపాయి పోస్టులు భర్తీ అయ్యాయి. ఈ ఏడాది సైతం అంత కంటే ఎక్కువ సంఖ్యలోనే పోస్టులు భర్తీ కానున్నాయి. పదో తరగతి విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ, ఎస్‌ఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు; అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌మ్యాన్ (జనరల్ డ్యూటీ); ఎన్‌సీబీలో సిపాయి పోస్టులు భర్తీ కానున్నాయి. రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, రిజర్వేషన్‌ అనుసరించి వివిధ సాయుధ బలగాల్లో అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపిక అవుతారు


 

       ఎస్‌ఎస్‌సీ అధికారిక ప్రకటన వివరాలు       

 

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు లేవు: