● తొలి, తుది దశ స్పాట్ అడ్మిషన్లలో
సీట్లు దక్కని విద్యార్థులకు మాత్రమే!
అమరావతి, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): ఇంజినీరింగ్‌లో ప్రత్యేక అడ్మిషన్ల
ప్రక్రియ ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని సాంకేతిక విద్యాశాఖ
కమిషనర్, ఏపీఈఏపీ సెట్ కన్వీనర్ నాగరాణి తెలిపారు. ఏపీఈఏపీ
సెట్–2023లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇప్పటికే రెండు దశల్లో స్పాట్
అడ్మిషన్లు ముగిశాయని, ఇప్పుడు కేవలం ఈ సంవత్సరానికి మాత్రమే వర్తించేలా ఈ
ప్రత్యేక కౌన్సెలింగ్‌ను చేపడుతున్నామని ఆమె వివరించారు. ఇప్పటికే ఆప్షన్లు
నమోదు చేసుకుని, తొలి, తుది దశ స్పాట్ అడ్మిషన్లలో సీట్లు పొందలేని
విద్యార్థులు మాత్రమే ఈ ప్రత్యేక కౌన్సెలింగ్‌కు అర్హులని శనివారం ఒక
ప్రకటనలో పేర్కొన్నారు. కొత్తగా రిజిస్ట్రేషన్లకు అవకాశం లేదని స్పష్టం
చేశారు. ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లోని బీఈ/బీటెక్ కోర్సుల్లో
ఖాళీలను అనుసరించి నిబంధనల మేరకు ప్రవేశాలు కల్పిస్తామని తెలిపారు. శనివారం
నోటిఫికేషన్ జారీ కాగా, 6, 7 తేదదీల్లో రెండు రోజులపాటు ఆప్షన్ల నమోదు,
8న ఆప్షన్ల మార్పుకు అవకాశం, 10వ తేదీన సీట్ల కేటాయింపు జరుగుతుందని
తెలిపారు. ఈనెల 11 నుంచి 13 లోపు అభ్యర్థులు తమకు కేటాయించిన కాలేజీల్లో
వ్యక్తిగతంగా రిపోర్టు చేయాల్సి ఉంటుందని వివరించారు. ఇందులో ప్రవేశాలు
పొందినవారు కూడా కన్వీనర్ కోటాతో సమానంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ సహా
అన్ని రకాల ప్రభుత్వ పథకాలకూ అర్హులవుతారని నాగరాణి తెలిపారు.
- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | -
https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి