BSc Nursing: 5 నుంచి బీఎస్సీ నర్సింగ్ ఐచ్ఛికాల నమోదు
విజయవాడ (ఆరోగ్య విశ్వవిద్యాలయం), న్యూస్‌టుడే: ఏపీలో నర్సింగ్ కళాశాలల్లో నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్ కోర్సు రెండో విడత కౌన్సెలింగ్‌కు సంబంధించి ఐచ్ఛికాల ఎంపికకు వైఎస్‌ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటన జారీ చేసింది. మొదటి విడత కౌన్సెలింగ్‌లో భర్తీ కాని 987 సీట్లు, సీటు కేటాయించినా నిండని 2,578 సీట్లు, కొత్తగా అనుమతులు వచ్చిన 14 నర్సింగ్ కళాశాలల్లోని 390 సీట్లు కలిపి మొత్తం 3955 సీట్లకు రెండో విడత వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. రెండేళ్ల పోస్టు బేసిక్ బీఎస్సీ నర్సింగ్ కోర్సుకు సంబంధించి మూడో విడత కౌన్సెలింగ్‌లో.. ఇప్పటి వరకు భర్తీ కాని 220 సీట్లు, సీటు కేటాయించినా నిండని 184 సీట్లు, కొత్తగా అనుమతులు వచ్చిన మూడు కళాశాలల్లో 84 సీట్లు కలిపి, మొత్తం 488 సీట్లు భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 5వ తేదీ (ఆదివారం) ఉదయం 10 గంటల నుంచి 8వ తేదీ రాత్రి 10 గంటల్లోగా ఐచ్ఛికాలు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ ఏడాది అక్టోబరులో జరిగిన ద్వితీయ సంవత్సరం ఎంబీబీఎస్ ఫలితాలను ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం (నవంబర్ 5) విడుదల చేసింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి