PM విశ్వకర్మ పథకం పూర్తి వివరాలు [About PM Vishwakarma ] | ఏ ఏ కుల వృత్తుల పై శిక్షణ ఉంటుంది.. అర్హతలు..వయసు.. తదితర వివరాలు

పలు దఫాలుగా విశ్వకర్మ శిక్షణ, శిక్షణ అనంతరం లోన్ పొందే అవకాశం. online లో అప్లై చేసుకోవడానికి సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మిరోడ్, హిందూపురం-9640006015 |

కుల వృత్తులను పాటించే వారు ఏ మతానికి సంబంధించిన వారైనా సరే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. గతంలో బ్యాంకులో లోన్ సరిగాకట్టని వారికి అర్హత లేదు. 

అప్లై చేసుకోవడానికి కావలసినవి:-

1) ఆధార్ 

2) ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబరు 

3) రేషన్ కార్డు 

4) బ్యాంకు పాసు పుస్తకము. 

శిక్షణ విజయవంతంగా పూర్తి చేస్తుకున్న వారికి శిక్షణ సమయంలో రోజుకు రూ.500లతో అనంతరం రూ.15 వేల ఆర్థిక సాయం. 

శిక్షణ పూర్తయిన తరువాత అవసరమయిన వారికి రూ.2 లక్షల లోన్ కు ప్రభుత్వంచే రికమెండ్ చేయడం జరుగుతుంది.

PM విశ్వకర్మ పథకం పూర్తి వివరాలు [About PM Vishwakarma ]

దేశంలో సంప్రదాయ హస్తకళలను నమ్ముకొని శతాబ్దాలుగా భారతదేశానికి గుర్తింపు తెచ్చిన వారి సంక్షేమమే లక్ష్యంగా పథకాన్ని రూపొందించడం జరిగింది. చేతులతో సంప్రదాయబద్ధంగా పని చేసేవారి ని విశ్వకర్మ అని పిలుస్తారు.

వీరి కోసం తొలిసారి సహాయ ప్యాకేజీని ప్రత్యేకంగా ప్రకటించారు. సహాయ ప్యాకేజీని PM విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ అనే పథకం రూపంలో అమలు చేస్తారు. కొత్త పథకం ద్వారా సంపద్రాయ వృత్తులపై ఆధారపడే విశ్వకర్మ వర్గాల వారిని MSME వాల్యూ చైన్తో అనుసంధానం చేస్తారు.

మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పథకాన్ని అయిదు సంవత్సరాల కాలం పాటు , అనగా 2023-24 ఆర్థిక సంవత్సరం మొదలుకొని 2027-28 ఆర్థిక సంవత్సరం వరకు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 13 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది.

Benefits: అర్హులైన వారికి విశ్వకర్మ సర్టిఫికెట్, గుర్తింపు కార్డు మరియు ఆర్థిక సహాయం

పిఎం విశ్వకర్మ పథకం లో భాగంగా, చేతివృత్తుల వారికి మరియు హస్తకళల నిపుణులకు కింది ప్రయోజనాలు ఉంటాయి.

పిఎమ్ విశ్వకర్మ సర్టిఫికెటు ను, గుర్తింపు కార్డు ను ఇస్తారు

ఒక లక్ష రూపాయల వరకు (ఒకటో దఫా లో) మరియు 2 లక్షల రూపాయల వరకు (రెండో దఫా లో) రుణాన్ని 5 శాతం సబ్సిడీ వడ్డీ తో ఇస్తారు.

పథకం లో భాగం గా నైపుణ్య శిక్షణ, పనిముట్టులకు సంబంధించి ప్రోత్సాహకాలు, డిజిటల్ ట్రాన్సాక్శన్స్ మరియు మార్కెటింగ్ సంబంధించి సహాయ సహకారాలను కూడా అందజేయడం జరుగుతుంది.

పీఎం విశ్వకర్మ లో రెండు రకాల నైపుణ్య శిక్షణలో ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది. బేసిక్ నైపుణ్య అభివృద్ధి శిక్షణ మరియు అడ్వాన్స్డ్ నైపుణ్య అభివృద్ధి శిక్షణ ఉంటాయని తెలిపింది. లబ్ధిదారులకు శిక్షణ కాలంలో రోజుకి రూ.500 చొప్పున స్టైపెండ్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

అలాగే ఆధునిక యంత్రాలు, కొనుక్కోవడానికి
పరికరాలు రూ.15,000 వరకూ ఆర్థిక సాయం అందజేయనున్నారు. మొదటి ఏడాది 5లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం తెలిపింది. వచ్చే ఐదేళ్లలో మొత్తం 30 లక్షల కుటుంబాలు పథకం ద్వారా లబ్ధి పొందనున్నాయి. గురు-శిష్య పరంపరను, కుటుంబ ఆధారిత సంప్రదాయ నైపుణ్యాలను బలోపేతం చేయడమే పథకం ఉద్దేశమని కేంద్రం తెలిపింది. తొలుత 18 రకాల సం
ప్రదాయ నైపుణ్యాలకు పథకాన్ని వర్తింప చేస్తున్నారు.

కులాల వారికి పథకం వర్తిస్తుంది?

పిఎమ్ విశ్వకర్మ లో భాగం గా తొలి విడత లో 18 సాంప్రదాయిక చేతివృతులు చేసుకునే వారిని పరిగణలోకి తీసుకోవడం జరిగింది. పూర్తి జాబితా ఇదే

(1) వడ్రంగులు;

(2) పడవల తయారీదారులు;

(3) ఆయుధ /కవచ తయారీదారులు;

(4) కమ్మరులు;

(5) సుత్తి, ఇంకా పరికరాల తయారీదారులు;

(6) తాళాల తయారీదారులు;

(7) బంగారం పని ని చేసే వారు;

(8) కుమ్మరులు;

(9) శిల్పులు (ప్రతిమలు, రాతి చెక్కడం పని చేసేటటువంటి వారు), రాళ్ళను పగులగొట్టే వృత్తి లో ఉండే వారు;

(10) చర్మకారులు /పాదరక్షల తయారీ దారులు;

(11) తాపీ పనివారు;

(12) గంపలు/చాపలు/చీపురులను తయారు చేసేవారు;

(13) కొబ్బరి నారతో తయారు అయ్యే వస్తువుల ను చేసే వారు, (సాంప్రదాయిక ఆటబొమ్మల రూపకర్తలు);

(14) నాయి బ్రాహ్మణులు;

(15) మాలలు అల్లే వారు;

(16) రజకులు;

(17) దర్జీలు మరియు;

(18) చేపల ను పట్టేందుకు ఉపయోగించే వలల ను తయారు చేసేవారు

2) Pm Viswa karma Yojana Official Website 

PM విశ్వకర్మ యోజన అధికారిక వెబ్సైటు

          CLICK HERE  


-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.