EMRS: 10,391 ఉద్యోగాల పరీక్ష తేదీలు వెల్లడి * నెస్ట్స్ కీలక ప్రకటన
EMRS: 10,391 ఉద్యోగాల పరీక్ష తేదీలు వెల్లడి
* నెస్ట్స్ కీలక ప్రకటన
దేశవ్యాప్తంగా
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ల(EMRS)లో ఖాళీగా ఉన్న 10,391 బోధన,
బోధనేతర పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్ష తేదీలు వెల్లడయ్యాయి.
డిసెంబర్ 16, 17, 23, 24 తేదీల్లో ఈఎంఆర్ఎస్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్
జరగనుంది. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ నేతృత్వంలోని స్వయంప్రతిపత్తి
సంస్థ- నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (నెస్ట్స్)
నియామక చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ప్రిన్సిపల్/ పీజీటీ/ జూనియర్
సెక్రెటేరియట్ అసిస్టెంట్/ ల్యాబ్ అసిస్టెంట్/ టీజీటీ/ హాస్టల్ వార్డెన్
పోస్టులు భర్తీ కానున్నాయి. డిగ్రీ, డిప్లొమా, పీజీ, డీఈడీ, బీఈడీ,
సీటెట్ తదితర విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు.
ఈఎంఆర్ఎస్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్-2023, డాక్యుమెంట్ వెరిఫికేషన్,
మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఈఎంఆర్ఎస్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ ద్వారా భర్తీకానున్న ఖాళీల వివరాలు...
ఉద్యోగం | ఖాళీలు |
ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) | 5,660 |
హాస్టల్ వార్డెన్ (పురుషులు) | 335 |
హాస్టల్ వార్డెన్ (మహిళలు) | 334 |
ప్రిన్సిపల్ | 303 |
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) | 2,266 |
అకౌంటెంట్ | 361 |
జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్ | 759 |
ల్యాబ్ అసిస్టెంట్ | 373 |
మొత్తం ఖాళీలు | 10,391 |
కామెంట్లు