అరుణాచలానికి ప్రత్యేక బస్సు
అరుణాచలానికి ప్రత్యేక బస్సు
హిందూపురం అర్బన్, నవంబరు 21: కార్తీకమాసాన్ని పురస్కరించుకొని తమిళనాడులోని అరుణాచం పుణ్యక్షేత్రం సందర్శనకు ఆర్టీసీ హిందూపురం డిపో నుంచి ప్రత్యేక లగ్జరీ బస్సులను ఏర్పాటు చేసి
నట్లు డీఎం శ్రీకాంత్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి ఆదివారం ప్రత్యేక బస్సు హిందూపురం ఆర్టీసీ బస్టాండ్లో సాయంత్రం 5 గంటలకు బయలు దేరి సోమవారం ఉదయం 3 గంటలకు ఆరుణాచలం చేరుతుందన్నారు. భక్తులు తిరిగి అదేరోజు సాయంత్రం బయలుదేరి మంగళవారం ఉదయం 6 గంటలకు హిందూపురం చేరవచ్చన్నారు. ఇందుకు బస్సు చార్జి రూ. 1320గా ఉంటుందన్నారు. ఈ సదవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. ప్రతి ఆదివారం
ఉదయం 5 గంటలకు హిందూపురం నుంచి కోటి లింగాలు దర్శనానికి బస్సులు చేర్పాటు చేశామన్నారు. కోటి లింగాలు దర్శించుకొని అదే రోజు చిక్కబళాపురం వద్ద ఉన్న ఈషా శివాలయం దర్శించుకుని రాత్రి హిందూపురం చేరవచ్చని తెలిపారు. రానుపోను చార్జి రూ.620గా ఉంటుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
కామెంట్‌లు