స్కిల్ హబ్లో కోర్సులకు అవకాశం
పెనుకొండ, సోమందేపల్లి, న్యూస్టుడే: ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పెనుకొండ పరిటాల శ్రీరాములు డిగ్రీ కళాశాలలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిల్క్ హబ్ డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సులో చేరడానికి ఆసక్తి ఉన్న నిరుద్యోగులు తమ పేరును నమోదు చేయించు కోవాలని పెనుకొండ, సోమందేపల్లి ఎంపీడీవోలు శివశంకరప్ప, వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. మూడు నెలల పాటు ఉచితంగా ఈ కోర్సు శిక్షణ ఉంటుందన్నారు. శిక్షణ పొందడానికి పది, ఇంటర్, డిగ్రీ ఆపై చదివిన 18 ఏళ్ల నుంచి 29 లోపు వయసు కలిగిన నిరుద్యోగ యువతీ యువకులు అర్హులు. ఈనెల 30 లోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని, పూర్తి వివరాలకు సమన్వయకర్త శివప్రసాద్ (96767 06976) సంప్రదించాలని కోరారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి