19, నవంబర్ 2023, ఆదివారం

Counselling: స్పెషల్‌ కేటగిరి విద్యార్థులకు మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ | ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని కళాశాలల్లో బీఎస్సీ(హ్యాన్స్‌) అగ్రికల్చర్‌ కోర్సుల్లో సీట్ల భర్తీ కోసం

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- 

Counselling: స్పెషల్‌ కేటగిరి విద్యార్థులకు మాన్యువల్‌ కౌన్సెలింగ్‌

Acharya NG Ranga Agricultural University

గుంటూరు రూరల్‌: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని కళాశాలల్లో బీఎస్సీ(హ్యాన్స్‌) అగ్రికల్చర్‌ కోర్సుల్లో సీట్ల భర్తీ కోసం స్పెషల్‌ కేటగిరి విద్యార్థులకు ఏపీ అగ్రిసెట్‌– 2023 ర్యాంకుల ఆధారంగా డిప్లొమో హోల్డర్స్‌కు మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ డాక్టర్‌ జి.రామారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 20వ తేదీన ఏపీజీసీ సెమినార్‌ హాలు లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానం గుంటూరులో ఈ మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించటం జరుగుతుందన్నారు. స్పెషల్‌ కేటగిరి పీహెచ్‌, ఎన్‌సీసీ, సీఏపీ, స్పోర్ట్స్‌, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌లో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ చేసుకున్న ప్రయారిటీలో ఉన్న విద్యార్థులకు సీట్లను భర్తీ చేయటం జరుగుతుందని చెప్పారు. మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏఎన్‌జీఆర్‌ఏయూ.ఏసీ.ఇన్‌ వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.

 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు లేవు: