22, నవంబర్ 2023, బుధవారం

Lawcet: లాసెట్‌ కౌన్సెలింగ్‌ దరఖాస్తు గడువు పొడిగింపు * నవంబర్‌ 30న సీట్లు కేటాయింపు

Lawcet: లాసెట్‌ కౌన్సెలింగ్‌ దరఖాస్తు గడువు పొడిగింపు

* నవంబర్‌ 30న సీట్లు కేటాయింపు


లాసెట్‌ తొలి విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనే అభ్యర్థులకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, ధ్రువపత్రాల పరిశీలనకు దరఖాస్తు గడువును నవంబర్‌ 23వ తేదీ వరకు పొడిగించారు. ముందుగా ప్రకటించిన గడువు మంగళవారం(నవంబర్‌ 21)తో ముగిసింది. కాకతీయ విశ్వవిద్యాలయంలో డిగ్రీ విద్యార్థుల బ్యాక్‌లాగ్‌ సబ్జెక్టుల ఫలితాలు వెలువడకపోవడంతో అభ్యర్థుల వినతి మేరకు రెండు రోజులు పెంచినట్లు అధికార వర్గాలు తెలిపాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నవంబర్‌ 30న సీట్లు కేటాయిస్తారు. డిసెంబరు 4 నుంచి తరగతులు మొదలవుతాయని లాసెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ ఆచార్య పి.రమేష్‌బాబు తెలిపారు. మంగళవారం వరకు ఎల్‌ఎల్‌బీ 3, 5 సంవత్సరాలతోపాటు ఎల్‌ఎల్‌ఎం కోర్సుకు సుమారు 13 వేల మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్లు ఆయన చెప్పారు. ఆ మూడు కోర్సుల్లో సుమారు 8 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి.

ఎంఈడీ, ఎంపీఈడీ చివరి విడత కౌన్సెలింగ్‌ గడువు 23

ఎంఈడీ, ఎంపీఈడీ (ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌) సీట్ల భర్తీకి సీపీగెట్‌ చివరి విడత కౌన్సెలింగ్‌ కాలపట్టికను కన్వీనర్‌ ఆచార్య ఐ.పాండురంగారెడ్డి మంగళవారం(నవంబర్‌ 21) ప్రకటించారు. నవంబర్‌ 23వ తేదీ వరకు సీపీగెట్‌లో ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవచ్చని, వారికి నవంబర్‌ 26న సీట్లు కేటాయిస్తామని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.

  


\-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు లేవు: