ఎయిమ్స్‌లో 142 ఉద్యోగాలు | 142 Jobs in AIIMS
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, గోరఖ్‌పుర్ 142 గ్రూప్ ఏ, బీ, సీ నాన్-ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, గోరఖ్‌పుర్ 142 గ్రూప్ ఏ, బీ, సీ నాన్-ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ), ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
ఉద్యోగాలు: ట్యూటర్/ క్లినికల్ ఇన్‌స్ట్రక్టర్, స్టాఫ్ నర్స్ గ్రేడ్-1, మెడికల్ సోషల్ వర్కర్, లైబ్రెరియన్ గ్రేడ్-2, టెక్నికల్ అసిస్టెంట్/ టెక్నీషియన్, ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్-2, హాస్టల్ వార్డెన్, పీఏ టు ప్రిన్సిపల్, ల్యాబ్ టెక్నీషియన్, క్యాషియర్, లోయర్ డివిజన్ క్లర్క్ మొదలైన 142 ఉద్యోగాలు ఉన్నాయి.
- ట్యూటర్/ క్లినికల్ ఇన్‌స్ట్రక్టర్.. 15 ఖాళీలు ఉన్నాయి. బీఎస్సీ నర్సింగ్ డిగ్రీ పాసవ్వాలి. టీచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో మూడేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. నర్సింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసి మూడేళ్ల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు. గరిష్ఠ వయసు 50 సంవత్సరాలు.
- స్టాఫ్‌నర్స్ గ్రేడ్-1.. 57 ఉద్యోగాలు ఉన్నాయి. బీఎస్సీ నర్సింగ్ లేదా బీఎస్సీ (పోస్ట్-సర్టిఫికెట్)/ బీఎస్సీ నర్సింగ్ (పోస్ట్ బేసిక్) పాసవ్వాలి. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్/ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌లో పేరు రిజిస్టర్ చేసుకోవాలి. 100 పడకల హాస్పిటల్‌లో స్టాఫ్ నర్స్‌గా మూడేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు. వయసు 21-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
- హాస్పిటల్ అటెండెంట్ గ్రేడ్-3 (నర్సింగ్ ఆర్డర్లీ).. 40 ఖాళీలు ఉన్నాయి. మెట్రిక్యులేషన్ పాసై, హాస్పిటల్ సర్వీసెస్ సర్టిఫికెట్ కోర్సు (సెయింట్ జాన్స్ అంబులెన్స్) చేయాలి. హాస్పిటల్‌లో పనిచేసినవారికి ప్రాధాన్యమిస్తారు. వయసు 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి.
- ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్-2.. 8 ఖాళీలు ఉన్నాయి. సైన్స్ సబ్జెక్టుతో 10+2, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ డిప్లొమా పాసవ్వాలి. రెండేళ్ల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. వయసు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
పోస్టును బట్టి గరిష్ఠ వయసులో తేడాలు ఉంటాయి. 21.11.2023 నాటికి కొన్ని పోస్టులకు 27, 30, మరికొన్నింటికి 35 ఏళ్లు మించకూడదు.
- ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పది నుంచి పదిహేనేళ్ల సడలింపు ఉంటుంది.
- ఎక్స్ సర్వీస్‌మెన్‌కు కేటగిరీని బట్టి మూడు నుంచి ఎనిమిదేళ్ల మినహాయింపు ఉంటుంది.
- కేంద్ర ప్రభుత్వ గ్రూప్-బి అభ్యర్థులకు ఐదు నుంచి పదేళ్ల సడలింపు ఉంటుంది.
- అన్ రిజర్వుడ్/ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.1770. ఎస్సీ/ ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1416. దివ్యాంగులకు ఫీజులేదు. పరీక్ష ఫలితాలను ప్రకటించిన తర్వాత ఎస్సీ/ఎస్టీ అభ్యర్థుల ఫీజును రిఫండ్ చేస్తారు.
- ఎంపిక: అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) ద్వారా ఎంపికచేస్తారు.
- ప్రశ్నకు 1 మార్కు. ప్రతి తప్పు సమాధానానికీ 1/4 మార్కు తగ్గిస్తారు.
- పోస్టును బట్టి అవసరమైన వాటికి స్కిల్ టెస్ట్‌ను నిర్వహిస్తారు.
- సీబీటీ ఫలితాలను వెల్లడించిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీని ప్రకటిస్తారు.
- ట్యూటర్ పోస్ట్‌కు అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఇతర పోస్టులకు సీబీటీలో పొందిన మార్కుల ఆధారంగా 1:5 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు పిలుస్తారు.
- గమనించాల్సినవి: ఆన్‌లైన్ టెస్ట్‌కు ముందు కాల్ లెటర్లను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. సంబంధిత సమాచారాన్ని అభ్యర్థి ఈమెయిల్/ ఎస్‌ఎంఎస్‌కు తెలియజేస్తారు.
- గోరఖ్‌పుర్, లఖ్‌నవూ, ఎన్‌సీఆర్-దిల్లీల్లో ఆన్‌లైన్ పరీక్షను నిర్వహిస్తారు. ఈ మూడు కేంద్రాల్లో నుంచి ఒకదాన్ని అభ్యర్థి ఎంచుకోవాలి. తర్వాత దీన్ని మార్చే అవకాశం ఉండదు.
- దరఖాస్తుకు చివరి తేదీ: 21.11.2023
- వెబ్‌సైట్: https://aiimsgorakhpur.edu.in/
కామెంట్‌లు