25, నవంబర్ 2023, శనివారం

PGCIL: పీజీసీఐఎల్‌లో 203 జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ పోస్టులు | అర్హత: గుర్తింపు పొందిన టెక్నికల్ బోర్డు/ఇన్‌స్టిట్యూట్ నుంచి ఎలక్ట్రీషియన్ ట్రేడులో ఐటీఐ (ఎలక్ట్రికల్) ఉత్తీర్ణత | PGCIL: 203 Junior Technician Trainee Posts in PGCIL | Eligibility: ITI (Electrical) Pass in Electrician Trade from a recognized Technical Board/Institute.

PGCIL: పీజీసీఐఎల్‌లో 203 జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ పోస్టులు 

న్యూదిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్- దేశ వ్యాప్తంగా పీజీసీఐఎల్‌ రీజియన్/ కార్యాలయాల్లో రీజినల్‌ రిక్రూట్‌మెంట్ స్కీం కింద జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ ఖాళీల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. రాత పరీక్ష ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ఏడాది శిక్షణ కింద రూ.18,500 స్టైపెండ్‌ అందుతుంది. శిక్షణ అనంతరం జూనియర్‌ టెక్నీషియన్‌ డబ్ల్యూ-3 హోదాలో నియమితులవుతారు. నెలకు రూ.21,500 నుంచి రూ.74,000 వేతనం ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్‌ 12వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

రీజియన్‌: నార్తెర్న్‌, ఈస్ట్రన్‌, నార్త్‌- ఈస్ట్రన్‌, సదరన్‌, వెస్ట్రన్‌.

ఖాళీల వివరాలు:

* జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ: 203 పోస్టులు (యూఆర్‌- 89, ఓబీసీ- 47, ఎస్సీ- 39, ఎస్టీ- 10, ఈడబ్ల్యూఎస్‌- 18, పీహెచ్‌- 08, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌- 19, డీఎక్స్‌ ఎస్‌ఎం- 5)

విభాగం: ఎలక్ట్రీషియన్‌.

అర్హత: గుర్తింపు పొందిన టెక్నికల్ బోర్డు/ఇన్‌స్టిట్యూట్ నుంచి ఎలక్ట్రీషియన్ ట్రేడులో ఐటీఐ (ఎలక్ట్రికల్) ఉత్తీర్ణత.

వయోపరిమితి: 12.12.2023 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు. 

పే స్కేల్: నెలకు రూ.21,500- రూ.74,000.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు రుసుము: రూ.200. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 

ముఖ్య తేదీలు… 

ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 12-12-2023

రాత పరీక్ష తేదీ: జనవరి-2024.



Important Links

Posted Date: 24-11-2023

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు లేవు: