23 నుంచి జర్నలిస్టుల దరఖాస్తుల స్వీకరణ | ఇళ్ల స్థలాలకు దరఖాస్తు కోసం జనవరి 6 వరకు గడువు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించిన దరఖాస్తులను ఆన్లైన్
ద్వారా ఈ నెల 23 నుంచి స్వీకరించనున్నట్టు సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. మీడియా సంస్థల్లో పని చేస్తున్న అక్రిడిటేడెట్ జర్నలిస్టులకు మూడు సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అర్హులైన జర్నలిస్టులు ఇళ్ల స్థలాల కోసం http://ipr.ap.gov.in వెబ్సైట్లో వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. గురువారం నుంచి వెబ్సైట్ అందుబాటులోకి వస్తుందని. అప్పటి నుంచి 45 రోజుల్లోగా (జనవరి 6వ తేదీ) ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలన్నారు. జర్నలిస్టులకు కేటాయిస్తున్న ఇళ్ల స్థలం విలువలో 60 శాతం ప్రభుత్వం, 40 శాతం జర్నలిస్టులు చెల్లించాలన్నారు. ఇప్పటికే సరైన స్థలాలను గుర్తించేం దుకు వీలుగా వారంలోగా జిల్లా కమిటీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్లను కోరినట్టు తెలిపారు.
కామెంట్‌లు