ప్రైవేటు స్కూళ్లకు ఆఫ్లైన్లో అనుమతులు
సాక్షి, అమరావతి: ప్రైవేటు స్కూళ్ల గుర్తింపు, అదనపు విభాగాల మంజూరుకు యాజమాన్యాలు
ఆఫ్లైన్ దరఖాస్తు చేసుకునేందుకు పాఠశాల విద్యా శాఖ అవకాశం కల్పించింది. ఇది 2024-25 విద్యా సంవత్సరానికి మాత్రమే వర్తిస్తుంది. అలాగే ప్రభుత్వ గుర్తింపును మూడేళ్ల కాలపరిమితి నుంచి ఎనిమిదేళ్లకు పెంచింది. ప్రైవేటు విద్యాసంస్థలు ప్రభుత్వ అనుమతుల కోసం డిసెంబర్ 31లోగా దరఖాస్తు చేసుకోవాలని విద్యా శాఖ కమిషనర్ ఎస్.సురేశ్కు మార్ సూచించారు. గతంలో పాఠశాల ఏర్పాటు చేయాలన్నా, ఉన్నవి నడపాలన్నా అగ్నిమాపకశాఖ, మున్సిపల్, పంచాయతీరాజ్, వైద్య శాఖ, రోడ్లు-భవనాల శాఖ, రిజిస్ట్రేషన్ శాఖ, రవాణా శాఖల నిరభ్యంతర పత్రాలు తప్పనిసరి. ఈ నేపథ్యం లో పాఠశాల విద్యా శాఖ సింగిల్ విండో ఆన్లైన్ పోర్టల్ https://cse.ap.gov.in PSIS అందు బాటులోకి తెచ్చింది. యాజమాన్యాలు ఈ వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకుంటే.. ప్రభుత్వ విభాగాలు పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తాయి.
కామెంట్‌లు