25, నవంబర్ 2023, శనివారం

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌లోహైబ్రిడ్‌ సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌ | Hybrid Certificate Program in Indian Institute of Foreign Trade

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌లోహైబ్రిడ్‌ సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌
ఢిల్లీలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌(ఐఐఎఫ్‌టీ)కి చెందిన మేనేజ్‌మెంట్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ డివిజన్‌(ఎండీపీ)– ‘సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ ఎక్స్‌పోర్ట్‌ ఇంపోర్ట్‌ మేనేజ్‌మెంట్‌’లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ప్రోగ్రామ్‌ వ్యవధి నాలుగు నెలలు. దీనిని హైబ్రిడ్‌ మోడ్‌లో నిర్వహిస్తారు. గుర్తింపు పొందిన కళాశాల నుంచి గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇండస్ట్రీ లీడర్లు, మిడిల్‌ లెవెల్‌ ఎగ్జిక్యూటివ్‌లు, ఆంత్రప్రెన్యూర్స్‌, ఫ్రెషర్స్‌కు ఈ ప్రోగ్రామ్‌ ఉపయోగకరంగా ఉంటుంది. అకడమిక్‌ మెరిట్‌, అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులకు అడ్మిషన్స్‌ ఇస్తారు. అడ్మిషన్‌ పొందిన అభ్యర్థులకు లెర్నింగ్‌ వెబ్‌ పోర్టల్‌కు సంబంధించి లైఫ్‌ టైం యాక్సెస్‌ ఇస్తారు. నిబంధనల మేరకు రిజర్వ్‌డ్‌ వర్గాల అభ్యర్థులకు 50 శాతం ఫీజు రాయితీ లభిస్తుంది.

కోర్సు వివరాలు

ఇందులో ఇంటర్నేషనల్‌ బిజినెస్‌, ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ ఆపరేషన్స్‌, రెగ్యులేటరీ గైడ్‌లైన్స్‌, డాక్యుమెంటరీ ఫార్మాలిటీస్‌, షిప్పింగ్‌ డాక్యుమెంట్స్‌, ప్యాకేజింగ్‌, సెక్యూరిటీ ఇన్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌, ట్రాన్సాక్షన్‌ కాస్ట్‌, ఫ్రైట్‌ ఫార్వర్డింగ్‌, లాజిస్టిక్స్‌ తదితర అంశాలు బోధిస్తారు. ప్రోగ్రామ్‌లో భాగంగా ఇండివిడ్యువల్‌/గ్రూప్‌ అసైన్‌మెంట్స్‌, అసెస్‌మెంట్స్‌, లెక్చర్‌ ప్రజంటేషన్స్‌, కేస్‌ స్టడీస్‌, గ్రూప్‌ వర్క్‌, జనరల్‌ డిస్కషన్స్‌, క్విజ్‌లు ఉంటాయి.

ఇంటర్నేషనల్‌ మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి 20 గంటలు, ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ ఆపరేషన్స్‌ అండ్‌ ఎక్స్‌పోర్ట్‌ ఇంపోర్ట్‌ డాక్యుమెంటేషన్‌కు సంబంధించి 30 గంటలు, ఇండియాస్‌ ఫారిన్‌ ట్రేడ్‌ పాలసీకి సంబంధించి 20 గంటలు, ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ట్రేడ్‌ ఫైనాన్స్‌కు సంబంధించి 30 గంటలు, కస్టమ్‌ రెగ్యులేషన్స్‌ అండ్‌ ఇంపోర్ట్‌ ప్రొసీజర్స్‌ ఆఫ్‌ ఇండియాకు సంబంధించి 20 గంటలు, ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ లాజిస్టిక్స్‌కు సంబంధించి 30 గంటలు బోధన ఉంటుంది.

ప్రోగ్రామ్‌ ప్రారంభమైన మొదటి ఆరు రోజులు క్యాంప్‌స్‌ను విజిట్‌ చేయవచ్చు. శనివారాల్లో ఉదయం పదిగంటల నుంచి సాయంత్రం ఆరున్నర వరకు; ఆదివారాల్లో ఉదయం పదిగంటల నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు ఆన్‌లైన్‌ లైవ్‌ సెషన్స్‌ ఉంటాయి. కనీసం 75 శాతం అటెండెన్స్‌ తప్పనిసరి. ఫైనల్‌ ఎగ్జామ్‌లో కనీసం 50 శాతం మార్కులు సాధిస్తేనే సర్టిఫికెట్‌ ప్రదానం చేస్తారు.

ముఖ్య సమాచారం

• ప్రోగ్రామ్‌ ఫీజు: రూ.75,000+18 శాతం జీఎస్‌టీ

• ఈ–మెయిల్‌ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 30

• ఈ–మెయిల్‌: mdpmarketing@iift.edu

• వెబ్‌సైట్‌: iift.ac.in

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు లేవు: