ప్రభుత్వ ఉద్యోగాలు | ప్రసార భారతి, ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ - అసైన్‌మెంట్ ప్రాతిపదికన 6 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది | ఏలూరులోని రెవెన్యూ డిపార్ట్‌మెంట్- ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 12 టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. |గుంటూరులోని జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం- ఒప్పంద ప్రాతిపదికన గుంటూరు జిల్లాలో 8 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ప్రభుత్వ ఉద్యోగాలు
ప్రసార భారతి, ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ - అసైన్‌మెంట్ ప్రాతిపదికన 6 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ప్రసార భారతి, ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ - అసైన్‌మెంట్ ప్రాతిపదికన 6 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
1. క్యాజువల్ ఎడిటర్: 01
2. క్యాజువల్ న్యూస్ రీడర్ కమ్ ట్రాన్స్‌లేటర్ (తెలుగు): 02
3. క్యాజువల్ బ్రాడ్‌కాస్ట్ అసిస్టెంట్ (ప్రొడక్షన్): 03
అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ, పీజీ డిప్లొమా (జర్నలిజం), డిప్లొమా (రేడియో ప్రొడక్షన్), తెలుగు/ఇంగ్లిష్ భాషల్లో ప్రావీణ్యంతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 21 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు రుసుము: రూ.354. ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీలకు రూ.266.
దరఖాస్తు: నోటిఫికేషన్‌లో సూచించిన దరఖాస్తు నమూనా పూర్తిచేసి, అవసరమైన ధ్రువపత్రాల నకళ్లను ‘హెడ్ ఆఫ్ ఆఫీస్, ఆకాశవాణి, ఎంజీ రోడ్డు, విజయవాడ’ చిరునామాకు పంపాలి.
ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 28-11-2023.
వెబ్‌సైట్: https://prasarbharati.gov.in/
టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు
ఏలూరులోని రెవెన్యూ డిపార్ట్‌మెంట్- ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 12 టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: డిగ్రీతో కంప్యూటర్స్ లేదా బీఈ, బీటెక్/ బీసీఏ/ ఎంసీఏ లేదా డిగ్రీతో పీజీడీసీఏ, హయ్యర్ గ్రేడ్ టైప్ రైటింగ్ సర్టిఫికెట్.
వయసు: 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: డిగ్రీ అకడమిక్ మార్కులు, తదితరాల ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30-11-2023
ఆన్‌లైన్ దరఖాస్తు: http://117.216.209.136/revcorect/
డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, బ్లాక్ కోఆర్డినేటర్‌లు
గుంటూరులోని జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం- ఒప్పంద ప్రాతిపదికన గుంటూరు జిల్లాలో 8 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
- జిల్లా కోఆర్డినేటర్: 01
- జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్: 01
- బ్లాక్ కోఆర్డినేటర్: 06
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీతో పాటు అనుభవం.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ‘జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, కలెక్టర్ బంగ్లా రోడ్డు, గుంటూరు’ చిరునామాకు పంపించాలి.
ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 27-11-2023. వెబ్‌సైట్: https://guntur.ap.gov.in/notice_category/recruitment/
అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html
కామెంట్‌లు