22, నవంబర్ 2023, బుధవారం

Dr YSR వర్సిటీలో Nursing డిగ్రీ ఫైనల్‌ కౌన్సెలింగ్‌ | • వెబ్‌ ఆప్షన్స్‌కు చివరి తేదీ..... | • వెబ్‌ ఆప్షన్స్‌ లింక్‌ .....

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- 
వైఎస్సార్‌ వర్సిటీలో నర్సింగ్‌ డిగ్రీ ఫైనల్‌ కౌన్సెలింగ్‌

విజయవాడలోని డా.వైఎస్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌(డా.వైఎస్సార్‌యూహెచ్‌ఎస్‌)– బీఎస్సీ నర్సింగ్‌ ప్రోగ్రామ్‌లో మిగిలిన కాంపిటెంట్‌ అథారిటీ కోటా సీట్ల భర్తీకి ఫైనల్‌(థర్డ్‌ ఫేజ్‌) వెబ్‌ కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సెకండ్‌ ఫేజ్‌ కౌన్సెలింగ్‌ తరవాత మిగిలిన సీట్లతోపాటు నూతనంగా అనుమతించిన కళాశాలల్లోని సీట్లను కూడా ఈ నోటిఫికేషన్‌ ద్వారా అలాట్‌ చేస్తారు. బీఎస్సీ నర్సింగ్‌ ప్రోగ్రామ్‌ వ్యవధి నాలుగేళ్లు. ఎనిమిది సెమిస్టర్లు ఉంటాయి. ఆసక్తిగల తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

నూతన కళాశాలలు–సీట్లు

• ఆదినారాయణ కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌, గవరపాలెం, అనకాపల్లి, విశాఖపట్నం – 30 సీట్లు

• కేర్‌ వాల్తేర్‌ కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌, విశాఖపట్నం – 24 సీట్లు

• జేఎంజే కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌, కర్నూలు – 36 సీట్లు

• ప్రేమ్‌సాగరి కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌, విశాఖపట్నం – 30 సీట్లు

• ఎస్‌ఏవీఈ కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌, తిరుపతి – 30 సీట్లు

• శ్రీ రామ ఆదిత్య కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌, రామచంద్రాపురం, తూర్పుగోదావరి జిల్లా – 36 సీట్లు

• శ్రీ విజ్ఞాన్‌ నర్సింగ్‌ అకాడమీ కాలేజ్‌, కదిరి, అనంతపురం – 24 సీట్లు

• శృతి కాలేజ్‌ ఆఫ్‌ బీఎస్సీ నర్సింగ్‌, గుంటూరు – 30 సీట్లు

• వాగ్దేవి కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌, జగ్గయ్యపేట, కృష్ణా జిల్లా – 30 సీట్లు

అర్హత: ఏపీఈఏపీసెట్‌ 2023 ర్యాంక్‌ ఆధారంగా అడ్మిషన్స్‌ ఇస్తారు. ఇప్పటి వరకూ నిర్వహించిన కౌన్సెలింగ్‌లలో వెబ్‌ ఆప్షన్స్‌ ఇవ్వని వారు, ఏ కళాశాలలో కూడా సీటు రాని వారు, సీటు వచ్చినప్పటికీ కాలేజ్‌లో జాయిన్‌ కానివారు/కాలేజ్‌ మారాలనుకునేవారు ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు.

• వెబ్‌ ఆప్షన్స్‌కు చివరి తేదీ: నవంబరు 23న సాయంత్రం 4 గంటల వరకు

• వెబ్‌ ఆప్షన్స్‌ లింక్‌:

https://ugnursing.ysruhs.com

• వెబ్‌సైట్‌: drysruhs.edu.in

 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

నేటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ తుది విడత కౌన్సెలింగ్ 
బైపీసీ స్ట్రీమ్ ఫార్మా, బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలు గుంటూరు ఎడ్యుకేషన్: ఏపీ ఈఏపీసెట్- 2028 బైపీసీ స్ట్రీమ్ తుది విడత ప్రవేశాల ప్రక్రియ బుధవారం ప్రారంభం కానుంది.  మొదటి విడతలో భర్తీ కాగా మిగిలిన సీట్లను భర్తీ చేసేందుకు తుది విడత వెబ్ బేస్డ్ కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఏపీ ఉన్నత విద్యా మండలి షెడ్యూల్ విడుదల చేసింది. బీ-ఫార్మసీ, ఫార్మాడీ, ఫార్మాస్యూటికల్ ఇంజి నీరింగ్, బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశానికి మొదటి విడతలో నిర్వహించిన కౌన్సెలింగ్ు హాజరు కాని విద్యార్థులు బుధ, గురువారాల్లో జరిగే కౌన్సెలింగ్కు హాజరు కావాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకుని, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపుతో పాటు ఆన్లైన్లోనే సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాల్సి ఉంది. విద్యార్థులు ప్రైవేటు ఇంటర్నెట్ కేంద్రాలతో పాటు వివిధ ఫార్మసీ కళాశాలల్లో ఏర్పాటు చేసిన సేవా కేంద్రాల ద్వారా రిజిస్ట్రేషన్, ఆప్షన్ల నమోదు నిర్వహించుకోవచ్చు. కాగా విద్యార్థులు అప్లోడ్ చేసిన సర్టిఫికెట్లను ఎంపిక చేసిన హెల్ప్ లైన్ కేంద్రాల్లో ఆన్లైన్ లోనే పరిశీలన చేయనున్నారు. సర్టిఫికెట్ల పరిశీలన విజయవంతంగా పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈనెల 22, 23, 24వ తేదీల్లో కళాశాలలను ఎంపిక చేసుకునేందుకు వెబ్ బేస్డ్ కౌన్సెలింగ్లో పాల్గొని ఆప్షన్లు నమోదు చేసుకోవాలి.ఈనెల 25న ఆప్షన్లు మార్చుకునేందుకు అవకాశాన్ని కల్పించిన ఉన్నత ద్యామండలి 27న సీట్ల కేటాయింపు జరపనుంది. సీట్లు పొందిన
విద్యార్థులు ఈనెల 28, 29, 30వ తేదీల్లో కళాశాలల్లో చేరాల్సి ఉంది. బైపీసీ స్ట్రీమ్ తుది విడత కౌన్సెలింగ్కు సహాయకంగా గుంటూరు శివారు నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ హెల్ప్ లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఏపీ ఉన్నత విద్యామండలి సైట్లో సమగ్రమైన వివరాలతో కూడిన నోటిఫికేష నను సందర్శించాలి.

కామెంట్‌లు లేవు: