25, జనవరి 2024, గురువారం

APPSC: ఏపీలో 290 డిగ్రీ లెక్చరర్ పోస్టులు

 APPSC: ఏపీలో 290 డిగ్రీ లెక్చరర్ పోస్టులు 

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్… ఏపీ- కాలేజియేట్ ఎడ్యుకేషన్ సర్వీసుకు సంబంధించి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో డిగ్రీ లెక్చరర్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు జనవరి 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 13వ తేదీ లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఖాళీల వివరాలు:

* డిగ్రీ లెక్చరర్: 290 పోస్టులు

సబ్జెక్టుల వారీ ఖాళీలు:

1. బయోటెక్నాలజీ- 04

2. బోటనీ- 20

3. కెమిస్ట్రీ- 23

4. కామర్స్‌- 40

5. కంప్యూటర్ అప్లికేషన్స్- 49

6. కంప్యూటర్ సైన్స్- 48

7. ఎకనామిక్స్‌- 15

8. ఇంగ్లిష్- 05

9. హిస్టరీ- 15

10. మ్యాథమెటిక్స్‌- 25

11. మైక్రోబయాలజీ- 4

12. పొలిటికల్‌ సైన్స్‌- 15

13. తెలుగు- 7

14. జువాలజీ- 20

జోన్ వారీ ఖాళీలు: జోన్ 1- 68; జోన్ 2- 95; జోన్ 3- 50; జోన్ 4- 77.

మొత్తం ఖాళీల సంఖ్య: 240.

అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ, నెట్‌/ స్లెట్‌/ సెట్‌ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 01/07/2023 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్: రూ.57,700 - రూ.1,82,400.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. 

ప్రశ్నపత్రం: పేపర్‌-1 జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ (డిగ్రీ స్టాండర్డ్‌) నుంచి 150 ప్రశ్నలు(150 మార్కులు), సంబంధిత సబ్జెక్టు(పీజీ స్టాండర్డ్‌) నుంచి 150 ప్రశ్నలు (300 మార్కులు) అడుగుతారు. ప్రతి పేపర్‌కు 150 నిమిషాల వ్యవధి ఉంటుంది.

దరఖాస్తు రుసుము: రూ.370. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ.250.

ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: 24/01/2024 నుంచి 13/02/2024 వరకు.

రాత పరీక్ష తేదీ: ఏప్రిల్/ మే, 2024.

 

Important Links

Posted Date: 24-01-2024

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు లేవు: