24, జనవరి 2024, బుధవారం

RFCL: రామగుండం ఫెర్టిలైజర్స్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్‌ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్‌), రామగుండం ప్లాంట్… రెగ్యులర్‌ ప్రాతిపదికన నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఫిబ్రవరి 22వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఖాళీల వివరాలు:

1. అటెండెంట్ గ్రేడ్-1 (మెకానికల్): 15 పోస్టులు

2. అటెండెంట్ గ్రేడ్-1 (ఎలక్ట్రికల్): 15 పోస్టులు

3. అటెండెంట్ గ్రేడ్-1 (ఇన్‌స్ట్రుమెంటేషన్): 09 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 39.

ట్రేడులలు: ఫిట్టర్, డీజిల్ మెకానిక్, మెకానిక్- హెవీ వెహికల్ రిపేర్ అండ్‌ మెయింటెనెన్స్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంటేషన్ మెకానిక్.

అర్హత: మెట్రిక్యులేషన్, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత. ఐటీఐలో జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు కనీసం 60% మార్కులు; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు 55% మార్కులు సాధించి ఉండాలి.

వయోపరిమితి (31.01.2024 నాటికి): 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు; ఎస్సీ, ఎస్టీ, అభ్యర్థులకు అయిదేళ్లు; దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

బేసిక్ పే: నెలకు రూ.21,500-రూ.52,000.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ (ట్రేడ్) టెస్ట్, మెడికల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము: రూ.200. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.  

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, కర్నూలు, నాగ్‌పుర్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్.

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 24.01.2024.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22.02.2024.

Important Links

Posted Date: 24-01-2024

 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు లేవు: