ప్రభుత్వ ఉద్యోగాలు | ఎయిమ్స్ మంగళగిరిలో ఫ్యాకల్టీ పోస్టులు | శ్రీకాకుళంలో పారామెడికల్ ఖాళీలు | ఏపీ జ్యుడీషియల్ సర్వీసులో సివిల్ జడ్జిలు | అప్రెంటిస్‌షిప్ - నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్‌లో.. | ప్రవేశాలు | హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో ఎంబీఏ
ప్రభుత్వ ఉద్యోగాలు
ఎయిమ్స్ మంగళగిరిలో ఫ్యాకల్టీ పోస్టులు
మంగళగిరిలోని ఎయిమ్స్ ఒప్పంద ప్రాతిపదికన 125 ఫ్యాకల్టీ గ్రూప్-ఎ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ప్రొఫెసర్: 20,
అసిస్టెంట్ ప్రొఫెసర్: 73,
అడిషనల్ ప్రొఫెసర్: 10
అసోసియేట్ ప్రొఫెసర్: 22
విభాగాలు: అనస్థీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, బయోస్టాటిస్టిక్స్, బర్న్స్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ, కార్డియాలజీ, డెంటిస్ట్రీ, డెర్మటాలజీ, ఎండోక్రైనాలజీ, ఈఎన్‌టీ, ఫోరెన్సిక్ మెడిసిన్, గ్యాస్ట్రోఎంటరాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, సైకియాట్రీ.
అర్హత: సంబంధిత విభాగంలో మెడికల్ పీజీ, ఎండీ/ ఎంఎస్/ ఎంసీహెచ్/ డీఎంతో పాటు పని అనుభవం.
వయసు: ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్ ఖాళీలకు 58 ఏళ్లు; ఇతర పోస్టులకు 50 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ‘ఫ్యాకల్టీ ఇన్‌ఛార్జ్, రిక్రూట్‌మెంట్ సెల్, రూం నంబర్ 216, 2వ అంతస్తు, లైబ్రరీ అండ్ అడ్మిన్ బిల్డింగ్, ఎయిమ్స్, మంగళగిరి, గుంటూరు’ చిరునామాకు పంపాలి.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 29.01.2024.
హార్డ్ కాపీ స్వీకరణకు చివరి తేదీ: 08.02.2024.
వెబ్‌సైట్: https://www.aiimsmangalagiri.edu.in/
శ్రీకాకుళంలో పారామెడికల్ ఖాళీలు
శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళంలోని వైద్య సంస్థల్లో కాంట్రాక్ట్/ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన 40 వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.
వైద్య సంస్థలు: ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల.
ఖాళీలు: బుక్ బేరర్, డీఈవో/ కంప్యూటర్ ఆపరేటర్, ఎలక్ట్రీషియన్, స్పీచ్ థెరపిస్ట్, పర్సనల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ లైబ్రేరియన్, ల్యాబ్ అటెండెంట్.
అర్హత: పోస్టును బట్టి ఎస్‌ఎస్‌సీ, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ డిప్లొమా.
వయసు: 42 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ‘ప్రిన్సిపల్ కార్యాలయం, ప్రభుత్వ వైద్య కళాశాల, శ్రీకాకుళం’లోని నిర్దిష్ట కౌంటర్లలో అందజేయాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 20-01-2024.
వెబ్‌సైట్: https://srikakulam.ap.gov.in/
ఏపీ జ్యుడీషియల్ సర్వీసులో సివిల్ జడ్జిలు
ఏపీ స్టేట్ జ్యుడీషియల్ సర్వీసులో 39 సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) ఉద్యోగాల భర్తీకి (32 ఖాళీలు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్; 7 ఖాళీలు ట్రాన్స్‌ఫర్ ద్వారా) అమరావతిలోని ఏపీ స్టేట్ హైకోర్టు ఆఫ్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ (లా).
వయసు: 35 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌లకు అయిదేళ్లు; దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక: స్క్రీనింగ్ టెస్ట్, రాత పరీక్ష, వైవా-వాయిస్ టెస్ట్ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.1500 (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.750).
స్క్రీనింగ్ టెస్ట్ కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 31-01-2024.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 01-03-2024.
స్క్రీనింగ్ టెస్ట్ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష): 13-04-2024.
వెబ్‌సైట్: https://aphc.gov.in/recruitment.html
అప్రెంటిస్‌షిప్
నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్‌లో...
తమిళనాడు రాష్ట్రం నైవేలిలోని ప్రభుత్వ రంగ సంస్థ- నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్) ఏడాది అప్రెంటిస్ శిక్షణలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 314
టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్: 318
మొత్తం ఖాళీలు: 632.
విభాగాలు: మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, సివిల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కెమికల్, మైనింగ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఫార్మసీ.
స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు రూ.15028; టెక్నీషియన్ అప్రెంటిస్‌కు రూ.12524.
అర్హతలు: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీలో డిప్లొమా/ డిగ్రీ.
ఎంపిక: డిప్లొమా/ డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 18-01-2024.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31-01-2024.
అభ్యర్థుల ఎంపిక జాబితా వెల్లడి: 19-02-2024.
అప్రెంటిస్‌షిప్ ప్రవేశ తేదీలు: 23-02-2024 నుంచి 29-02-2024 వరకు.
వెబ్‌సైట్: https://www.nlcindia.in/
ప్రవేశాలు
గిరిజన గురుకుల ప్రతిభా కళాశాలల్లో ఇంటర్
తెలంగాణ గిరిజన
సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సెంటర్ ఆఫ్
ఎక్సలెన్స్ (ప్రతిభా కళాశాలలు)లో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు నిర్వహించే
‘తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2024’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఎంపికైన
విద్యార్థులకు ఇంటర్ ఉచిత విద్య, వసతి సౌకర్యాలతో పాటు ఐఐటీ, నీట్ తదితర
జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సంబంధించి శిక్షణ ఇస్తారు.
గ్రూపులు: ఎంపీసీ (575 సీట్లు, బైపీసీ (565 సీట్లు).
మొత్తం సీట్లు: 1,140 (బాలురు- 660; బాలికలు- 480).
రిజర్వేషన్: అన్ని సీట్లు ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు కేటాయించారు.
అర్హత: మార్చి-2024లో పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న
విద్యార్థులు. విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2,00,000 (పట్టణ
ప్రాంతం); రూ.1,50,000 (గ్రామీణ ప్రాంతం) మించకూడదు.
వయసు: విద్యార్థుల వయసు 31.08.2024 నాటికి 19 ఏళ్లు మించకూడదు.
రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.200.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 05-02-2024.
వెబ్‌సైట్: https://ttwreiscoe.cgg.gov.in/TTWREISWEB20/#!/
హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో ఎంబీఏ
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ 2024-2026 విద్యా సంవత్సరానికి ఎంబీఏలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
రెండేళ్ల ఎంబీఏ ఫుల్ టైం ప్రోగ్రామ్: 75 సీట్లు
విభాగాలు: మార్కెటింగ్, ఫైనాన్స్, ఆపరేషన్స్, హ్యూమన్ రిసోర్సెస్, ఆంత్రప్రెన్యూర్‌షిప్, బిజినెస్ అనలిటిక్స్, బ్యాంకింగ్.
ప్రవేశ ప్రక్రియ: క్యాట్-2023 స్కోర్, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: జనరల్ రూ.600, ఈడబ్ల్యూఎస్ రూ.550, ఓబీసీ రూ.400, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.275.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31-01-2024.
వెబ్‌సైట్: http://acad.uohyd.ac.in/mba24.html
కామెంట్‌లు