మహిళలకు ‘పీఎం కిసాన్’ సాయం డబుల్! 'PM Kisan' aid to women is doubled!
న్యూఢిల్లీ, జనవరి 13: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రైతులకు
పీఎం కిసాన్ సాయాన్ని పెంచేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు
కసరత్తు చేస్తోంది. 2019 ఎన్నికలకు ముందు తీసుకొచ్చిన ఈ పథకం ద్వా రా
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 11 కోట్ల మంది రైతులకు ఏడాదికి రూ.6 వేలు
అందుతోంది. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు.
అయితే మహిళా రైతులకు ఈ మొత్తాన్ని రెట్టింపు చేసే అవకాశాలున్నట్లు
తెలుస్తోంది. ఈ మేరకు రూ.10 వేలు లేదా 12 వేలకు.. మిగతా రైతులకు రూ.8 వేలు
లేదా రూ.9 వేలకు పెంచాలని యోచిస్తున్నారు. ఈ మేరకు ఫిబ్రవరి 1న సమర్పించే
మధ్యంతర బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేయనున్నట్లు సమాచారం. పీఎం కిసాన్ పథకం
కోసం ఈ ఏడాది రూ.60 వేల కోట్లు కేటాయించారు. ఈ నెల 31వ తేదీన బడ్జెట్
సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశముంది.
New Delhi, January 13: As the Lok Sabha elections are approaching, the Narendra Modi government at the Center is working to increase PM Kisan assistance to farmers. This scheme, which was introduced before the 2019 elections, is currently providing Rs. 6 thousand per year to 11 crore farmers across the country. This amount is deposited in the accounts of farmers in three installments. But it seems that women farmers have the opportunity to double this amount. To this extent, it is planned to increase to Rs. 10 thousand or 12 thousand. For other farmers, it will be increased to Rs. 8 thousand or Rs. 9 thousand. In this regard, proposals will be made in the interim budget to be presented on February 1. Rs.60 thousand crores have been allocated for PM Kisan scheme this year. Budget meetings are likely to start on 31st of this month.
కామెంట్‌లు