బాలల కథా సంకలనాలకు ఆహ్వానం | కథా సంపుటాలకు ఆహ్వానం | నవలలకు ఆహ్వానం | దళిత ప్రేమ కథలకు ఆహ్వానం

బాలల కథా సంకలనాలకు ఆహ్వానం

తెలంగాణ సారస్వత పరిషత్తు వెలువరిస్తున్న ‘బాల సారస్వతం’ పరంపరలో ప్రచురించే బాల కథా సంకలనాల కోసం కథలను ఆహ్వానిస్తున్నాం. బాలల మూర్తిమత్వ వికాసం, పర్యావరణ పరిరక్షణ, కుటుంబ బాంధవ్యాలు తదితర అంశాలను స్వీకరించి ఏ4 సైజులో ఒకటిన్నర పేజీకి మించకుండా టైప్‌ చేసి పంపాలి. కథలను జనవరి 20లోగా ఈమెయిల్‌: telanganasaraswathaparishath@gmail. com కు పంపాలి. మరిన్ని వివరాలకు ఫోన్‌: 88852 45234.

జె. చెన్నయ్య

_______________________________________________

‘విభజిత’ కథా సంపుటి

విజయ భండారు కథా సంపుటి ‘విభజిత’ ఆవిష్కరణ సభ జనవరి 18 సా.6గంటలకు రవీంద్ర భారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది. సభలో ఓల్గా, శీలా సుభద్రాదేవి, మామిడి హరికృష్ణ, వి. సంధ్య, మానస ఎండ్లూరి, నందిగాం నిర్మల పాల్గొంటారు.

హస్మిత ప్రచురణలు

________________________________________________

కథా సంపుటాలకు ఆహ్వానం

కందికొండ రామస్వామి స్మారక పురస్కారం కోసం 2023లో ముద్రితమైన కథా సంపుటాలను పంపాలి. బహుమతి పొందిన సంపుటికి నెలపొడుపు సాహిత్య సాంస్కృతిక వేదిక తరఫున ఏప్రిల్‌లో పదివేల రూపాయల నగదు, పురస్కారం, జ్ఞాపిక ప్రదానం జరుగును. మీ కథా సంపుటాలు మూడేసి ప్రతులను జనవరి 31లోగా చిరునామా: అబ్దుల్‌ వహీద్‌ ఖాన్‌, ఇంటి నెం. 15–120/4/1, రహత్‌ నాగర్‌ కాలనీ, నాగర్‌ కర్నూల్‌ – 509209, తెలంగాణకు పంపాలి. వివరాలకు: 94927 65358.

వనపట్ల సుబ్బయ్య 

________________________________________________ 

దళిత ప్రేమ కథలకు ఆహ్వానం

గత ఏడాది మార్జిన్స్‌ ప్రచురణల నుంచి మేం తెచ్చిన దళిత కథల సంకలనం ‘ముళ్ళ చినుకులు’కి వచ్చిన స్పందనతో చేస్తున్న మరో ప్రయత్నం దళిత ప్రేమ కథల సంకలనం. దళిత, దళితేతర రచయితలందరి నుంచి కథలను ఆహ్వానిస్తున్నాం. దళిత, ఇతర కులాల మధ్య చిగురించిన ప్రేమకథలే వస్తువు. చివరి తేదీ ఏప్రిల్‌ 30. డిటిపి చేసిన కథని ఓపెన్‌ ఫైల్లో ఈమెయిల్‌: dalitapremakathalu@gmail.com కు ఈ మెయిల్‌ చెయ్యాలి.

మానస ఎండ్లూరి, అరుణ గోగులమండ

________________________________________________ 

నవలలకు ఆహ్వానం

రజనీశ్రీ రాష్ట్ర స్థాయి సాహిత్య పురస్కారానికి నవలలను ఆహ్వానిస్తున్నాం. ఈ పురస్కారం కింద ప్రశంసా పత్రం, శాలువాతో పాటు రూ.10,116/– నగదు ఉంటుంది. రచయితలు జనవరి 1, 2014 నుంచి డిసెంబర్‌ 31, 2023 మధ్య ముద్రితమైన వారి సొంత నవలలు నాలుగు ప్రతులను ఫిబ్రవరి 10లోగా చిరునామా: గాజుల రవీందర్‌, ఇం.నెం.: 8–3–255/1, రామచంద్రాపూర్‌ కాలనీ, రోడ్‌ నంబర్‌ 12, భగత్‌ నగర్‌, కరీంనగర్‌ – 505001కు పంపాలి. మరిన్ని వివరాలకు ఫోన్‌: 98482 55525.

గాజుల రవీందర్‌

 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

ఆంధ్ర ప్రదేశ్లో ఇంజినీరింగ్ అలాగే ఫార్మసీ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న MPC & BiPC విద్యార్థులు వ్రాయాల్సిన entrance టెస్ట్ AP EAPCET 2024-25 అవసరమైన వివరాలు AP EAPCET 2024-25 Necessary Details | Entrance test for MPC & BiPC students who want to join engineering and pharmacy courses in Andhra Pradesh