30, మార్చి 2024, శనివారం

CMAT: కామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (సీమ్యాట్‌)-2024

CMAT: కామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (సీమ్యాట్‌)-2024 

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించే కామన్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ టెస్టు (సీమ్యాట్‌) ప్రకటన వెలువడింది. ఈ స్కోరుతో 2024-2025 విద్యా సంవత్సరానికి దేశవ్యాప్తంగా వెయ్యి విద్యా సంస్థల్లో మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ పూర్తిచేసుకున్నవారు, ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారు అర్హులు.

పరీక్ష వివరాలు:

కామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (సీమ్యాట్‌)-2024

అర్హత: ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి: దరఖాస్తుకు వ‌య‌సుతో సంబంధం లేదు.

దరఖాస్తు రుసుము: జనర్‌ (యూఆర్‌) పురుషులకు రూ.2000, మహిళలకు రూ.1000. జనరల్‌- ఈడబ్ల్యూఎస్‌/ ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ/ ఓబీసీ-(ఎన్‌సీఎల్‌) పురుషులకు- రూ.1000, మహిళలకు రూ. 1000. థర్డ్ జెండర్‌కు రూ.1000.

పరీక్ష విధానం: సీమ్యాట్‌లో 400 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు చొప్పున వంద ప్రశ్నలు వస్తాయి. ఇందులో ఒక్కో సెక్షన్‌ నుంచి 20 చొప్పున 5 విభాగాల్లో ప్రశ్నలు ఉంటాయి. క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌ అండ్‌ డేటా ఇంటర్‌ప్రిటేషన్‌, లాజికల్‌ రీజనింగ్‌, లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, ఇన్నొవేషన్‌ అండ్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ విభాగాల్లో  ప్రశ్నలు అడుగుతారు. ఆన్‌లైన్‌ పరీక్ష వ్యవధి 3 గంటలు. రుణాత్మక మార్కులు ఉన్నాయి. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికీ ఒక్కో మార్కు చొప్పున తగ్గిస్తారు. ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది.  

తెలుగు రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.

ముఖ్యమైన తేదీలు… 

ఆన్‌లైన్‌ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 18-04-2024.

రుసుము చెల్లింపు చివరి తేదీ: 18-04-2024.

దరఖాస్తు సవరణ తేదీలు: 19-04-2024 నుంచి 21-04-2024 వరకు.

పరీక్ష తేదీ: మే, 2024.

 

Important Links

Posted Date: 30-03-2024

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

కామెంట్‌లు లేవు: