MJPAPBCWCET: ఏపీ బీసీ గురుకులాల్లో అయిదో తరగతి ప్రవేశాలు | విద్యార్హత: నాలుగో తరగతి 2023-24 విద్యా సంవత్సరంలో చదివి ఉండాలి.
విజయవాడలోని మహాత్మా జ్యోతిబా ఫులే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహించే 106 బీసీ బాలబాలికల పాఠశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గాను అయిదో తరగతి (ఇంగ్లిష్ మీడియం, స్టేట్ సిలబస్)లో ప్రవేశాలకు సంబంధించి ప్రవేశ ప్రకటన వెలువడింది. అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థులు మార్చి 31వ తేదీలోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు.
పరీక్ష వివరాలు...
* మహాత్మా జ్యోతిబా ఫులే ఏపీ బీసీడబ్ల్యూ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2024
మొత్తం సీట్ల సంఖ్య: 6,480.
విద్యార్హత: విద్యార్ధులు సంబంధిత జిల్లాల్లోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో నాలుగో తరగతి 2023-24 విద్యా సంవత్సరంలో చదివి ఉండాలి. జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి సంబంధిత జిల్లాలోని పాఠశాలల్లో చదువుతూ ఉండాలి.
వయస్సు: ఓసీ, బీసీ, ఈబీసీ విద్యార్థులు 9 నుంచి 11 ఏళ్ల మధ్య; ఎస్సీ/ ఎస్టీ విద్యార్థులు 9 నుంచి 13 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆదాయ పరిమితి: విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్షకు మించకూడదు.
ప్రవేశ పరీక్ష: ప్రవేశ పరీక్ష ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఓఎంఆర్ షీట్ విధానంలో 50 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం తెలుగు/ ఆంగ్ల మాధ్యమాల్లో ఉంటుంది. తెలుగు(10 మార్కులు), ఇంగ్లిష్(10 మార్కులు), గణితం(15 మార్కులు), పరిసరాల విజ్ఞానం(15 మార్కులు) సబ్జెక్టులో నాలుగో తరగతి స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు.
పరీక్షా కేంద్రం: విద్యార్థుల సంబంధిత జిల్లాలో పరీక్ష నిర్వహిస్తారు.
ఎంపిక విధానం: అర్హులైన అభ్యర్థులకు ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరీ (అనాథ/ మత్స్యకార) ఆధారంగా సీటు కేటాయిస్తారు.
దరఖాస్తు రుసుము: రూ.100.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ముఖ్యమైన తేదీలు...
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 01-03-2024.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31-03-2024.
ప్రవేశ పరీక్ష తేదీ: 27-04-2024.
Important Links
Posted Date: 12-03-2024
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html
కామెంట్‌లు