నవోదయలో 1,377 నాన్‌టీచింగ్‌ పోస్టులు ‣ పరీక్ష సరళి, సిలిబస్‌ వివరాలు 1,377 Non-Teaching Posts in Navodaya ‣ Exam Pattern, Syllabus Details

నవోదయలో 1,377 నాన్‌టీచింగ్‌ పోస్టులు

పరీక్ష సరళి, సిలిబస్‌ వివరాలు



నవోదయ విద్యాలయ సమితి (ఎన్‌వీఎస్‌) 1,377 బోధనేతర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ/ స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఉత్తీర్ణులైనవారిని కేంద్ర, ప్రాంతీయ ఎన్‌వీఎస్‌ కార్యాలయాల్లో నియమిస్తారు. 


పోస్టును బట్టి నియామక పోటీ పరీక్షలు వేర్వేరుగా ఉంటాయి. ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లిష్‌లలో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికీ పావు మార్కు తగ్గిస్తారు. అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురంపోస్టులు.. వాటి సంఖ్య.. ఇతర వివరాలు చూద్దాం.


1. ఫిమేల్‌ స్టాఫ్‌నర్స్‌ - 121: బీఎస్సీ (ఆనర్స్‌) ఇన్‌ నర్సింగ్‌ లేదా బీఎస్సీ నర్సింగ్‌ లేదా పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌. స్టేట్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌లో రిజిస్టరై ఉండాలి. 50 పడకల ఆసుపత్రిలో రెండున్నర ఏళ్లు పనిచేసిన అనుభవం అవసరం. హిందీ/ ప్రాంతీయ భాష, ఇంగ్లిష్‌లను అర్థం చేసుకుని పనిచేయగలగాలి.  


2. అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ - 5: డిగ్రీ పాసవ్వాలి. అడ్మినిస్ట్రేటివ్, ఫైనాన్షియల్‌ విషయాల్లో మూడేళ్ల పని అనుభవం ఉండాలి. 


3. ఆడిట్‌ అసిస్టెంట్‌ - 12: బీకాం పాసై.. మూడేళ్ల అకౌంట్స్‌ అనుభవం అవసరం. 


4. జూనియర్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫీసర్‌ - 4: హిందీలో మాస్టర్స్‌ డిగ్రీ.. ఇంగ్లిష్‌ తప్పనిసరి సబ్జెక్టుగా చేయాలి. లేదా ఇంగ్లిష్‌లో మాస్టర్స్‌ డిగ్రీ.. హిందీ తప్పనిసరి సబ్జెక్టుగా చదవాలి. ఏ సబ్జెక్టుతోనైనా హిందీ మాధ్యమంలో పీజీ చేయాలి, ఇంగ్లిష్‌ తప్పనిసరి సబ్జెక్టుగా ఉండాలి. అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం


5. లీగల్‌ అసిస్టెంట్‌ - 1: లా డిగ్రీ పాసై.. లీగల్‌ కేసుల నిర్వహణలో మూడేళ్ల అనుభవం, కంప్యూటర్‌ పరిజ్ఞానం, హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో ప్రావీణ్యం అవసరం. వయసు 23 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. 


6. స్టెనోగ్రాఫర్‌ - 23: ఇంటర్మీడియట్‌ పాసై నిమిషానికి 80 పదాల వేగంతో డిక్టేషన్‌ తీసుకుని.. దాన్ని కంప్యూటర్‌ పైన ఇంగ్లిష్‌లో 50 నిమిషాలు, హిందీలో 65 నిమిషాల్లో ట్రాన్‌స్క్రిప్ట్‌ చేయగలగాలి. గరిష్ఠ వయసు 27 సంవత్సరాలు. 


7. కంప్యూటర్‌ ఆపరేటర్‌ - 2: బీసీఏ/ బీఎస్సీ (కంప్యూటర్‌ సైన్స్‌/ఐటీ) పాసవ్వాలి. లేదా బీఈ/బీటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌/ఐటీ) పూర్తిచేయాలి. గరిష్ఠ వయసు 30 సంవత్సరాలు. 


8. కేటరింగ్‌ సూపర్‌వైజర్‌ - 78: హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ పాసవ్వాలి. గరిష్ఠ వయసు 35 ఏళ్లు. లేదా కేటరింగ్‌లో ట్రేడ్‌ ప్రొఫిషియన్సీ సర్టిఫికెట్‌ ఉండి పదేళ్ల అనుభవం అవసరం (ఈ అవకాశం ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు మాత్రమే)


9. జూనియర్‌ సెక్రెటేరియట్‌ అసిస్టెంట్‌ - 381: ఇంటర్మీడియట్‌ పాసై.. టైపింగ్‌ వేగం ఇంగ్లిష్‌లో నిమిషానికి 30 పదాలు లేదా హిందీలో 25 పదాలు ఉండాలి. లేదా సెక్రటేరియల్‌ ప్రాక్టీసెస్‌ అండ్‌ ఆఫీస్‌ మేనేజ్‌మెంట్‌ ఒకేషనల్‌ సబ్జెక్టులుగా స్టేట్‌ బోర్డ్‌ ఇంటర్మీడియట్‌ పాసవ్వాలి. 6 నెలల కంప్యూటర్‌ డిప్లొమా కోర్సు చేసి, అకౌంట్స్‌/ అడ్మినిస్ట్రేటివ్‌ విషయాల్లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు. గరిష్ఠ వయసు 27 సంవత్సరాలు. 


10. ఎలక్ట్రీషియన్‌ కమ్‌ ప్లంబర్‌ - 128: పదో తరగతి పాసై, ఎలక్ట్రీషియన్‌/ వైర్‌మేన్‌ ఐటీఐ సర్టిఫికెట్‌ ఉండి.. ఎలక్ట్రికల్‌ ఇన్‌స్టలేషన్‌/ వైరింగ్‌/ ప్లంబింగ్‌లో రెండేళ్ల అనుభవం అవసరం.. 


11. ల్యాబ్‌ అటెండెంట్‌ - 161: పదో తరగతి పాసై ల్యాబొరేటరీ టెక్నిక్‌లో సర్టిఫికెట్‌/ డిప్లొమా ఉండాలి. లేదా సైన్స్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌ పాసవ్వాలి. గరిష్ఠ వయసు 30 ఏళ్లు. 


12. మెస్‌ హెల్పర్‌ - 442: పదో తరగతి పాసై, ఐదేళ్లు స్కూల్‌ మెస్‌లో పనిచేసిన అనుభవం అవసరం. నవోదయ విద్యా సమితి నిర్వహించే స్కిల్‌ టెస్ట్‌ పాసవ్వాలి. గరిష్ఠ వయసు 30. 


13. మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ - 19: పదో తరగతి పాసవ్వాలి. గరిష్ఠ వయసు 30 సంవత్సరాలు. 


పరీక్ష ఎలా ఉంటుంది?

స్టాఫ్‌నర్స్‌: ప్రశ్నపత్రంలో 4 పార్ట్‌లు ఉంటాయి. మొత్తం 120 ప్రశ్నలకు 120 మార్కులు. పార్ట్‌-1లో రీజనింగ్‌ ఎబిలిటీ 15 ప్రశ్నలు - 15 మార్కులు. పార్ట్‌-2లో జనరల్‌ అవేర్‌నెస్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌ 15 ప్రశ్నలు - 15 మార్కులు. పార్ట్‌-3లో లాంగ్వేజ్‌ కాంపిటెన్సీ టెస్ట్‌ (జనరల్‌ ఇంగ్లిష్‌ అండ్‌ జనరల్‌ హిందీ ప్రతి సబ్జెక్టుకు 10 మార్కుల చొప్పున) 20 ప్రశ్నలకు - 20 మార్కులు. పార్ట్‌-4లో సబ్జెక్టు నాలెడ్జ్‌ 70 ప్రశ్నలకు - 70 మార్కులు.  


జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌: స్టేజ్‌-1లో కాంపిటిటివ్‌ పరీక్ష, స్టేజ్‌-2లో టైపింగ్‌ టెస్ట్‌ ఉంటాయి. ప్రశ్నపత్రంలో 5 పార్టులు. పార్ట్‌-1లో మెంటల్‌ అండ్‌ రీజనింగ్‌ ఎబిలిటీ 20 ప్రశ్నలకు 20 మార్కులు. పార్ట్‌-2లో క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 20 ప్రశ్నలకు-20 మార్కులు. పార్ట్‌-3లో జనరల్‌ అవేర్‌నెస్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌ 30 ప్రశ్నలకు - 30 మార్కులు. పార్ట్‌-4లో లాంగ్వేజ్‌ కాంపిటెన్సీ టెస్ట్‌ 30 ప్రశ్నలకు - 30 మార్కులు. పార్ట్‌-5లో బేసిక్‌ నాలెడ్జ్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ ఆపరేషన్‌ 30 ప్రశ్నలకు- 30 మార్కులు. మొత్తం 130 ప్రశ్నలకు - 130 మార్కులు.  


ల్యాబ్‌ అటెండెంట్‌: ప్రశ్నపత్రం 120 మార్కులకు ఉంటుంది. పార్ట్‌-1లో రీజనింగ్‌ ఎబిలిటీ 15 ప్రశ్నలకు 15 మార్కులు. పార్ట్‌-2లో జనరల్‌ అవేర్‌నెస్‌ 15 ప్రశ్నలకు 15 మార్కులు. పార్ట్‌-3లో లాంగ్వేజ్‌ కాంపిటెన్సీ టెస్ట్‌ 30 ప్రశ్నలకు 30 మార్కులు. పార్ట్‌-4లో సబ్జెక్ట్‌ స్పెసిఫిక్‌ నాలెడ్జ్‌ 60 ప్రశ్నలకు 60 మార్కులు.  అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం


మెస్‌ హెల్పర్‌: ప్రశ్నపత్రంలో 4 పార్టులు. పార్ట్‌-1లో రీజనింగ్‌ ఎబిలిటీ 15 ప్రశ్నలకు 15 మార్కులు. పార్ట్‌-2లో జనరల్‌ అవేర్‌నెస్‌ 15 ప్రశ్నలకు 15 మార్కులు. పార్ట్‌-3లో లాంగ్వేజ్‌ కాంపిటెన్సీ టెస్ట్‌ 20 ప్రశ్నలకు 20 మార్కులు. పార్ట్‌-4లో సబ్జెక్ట్‌ స్పెసిఫిక్‌ నాలెడ్జ్‌ (ఫుడ్, న్యూట్రిషన్, హైజీన్, ఇండియన్‌ ఫుడ్‌ అండ్‌ స్వీట్స్‌ రెసిపీస్‌) 70 ప్రశ్నలకు 70 మార్కులు. మొత్తం 120 ప్రశ్నలకు 120 మార్కులు. 


పై నాలుగు పరీక్షలకు వ్యవధి 2.5 గంటలు.


మల్టీటాస్కింగ్‌ స్టాఫ్‌: ప్రశ్నపత్రంలో మూడు పార్టులు ఉంటాయి  పార్ట్‌-1లో లాంగ్వేజ్‌ టెస్ట్‌ 40 ప్రశ్నలు, 40 మార్కులు. పార్ట్‌-2లో జనరల్‌ అవేర్‌నెస్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌ 20 ప్రశ్నలు, 20 మార్కులు, పార్ట్‌-3లో బేసిక్‌ నాలెడ్జ్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ ఆపరేషన్‌ 40 ప్రశ్నలు 40 మార్కులు. మొత్తం 100 ప్రశ్నలకు 100 మార్కులు. వ్యవధి 2 గంటలు.  


వయసు: పోస్టును బట్టి వయః పరిమితిలో తేడాలు ఉన్నాయి. గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10-15 ఏళ్ల సడలింపు ఉంటుంది. 


దరఖాస్తు ఫీజు: స్టాఫ్‌నర్స్‌ పోస్టుకు జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీ (ఎన్‌సీఎల్‌)లకు రూ.1500. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీలకు రూ.500. మిగతా అన్ని పోస్టులకూ జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ (ఎన్‌సీఎల్‌)లకు రూ.1000. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీలకు రూ.500. 


పరీక్ష కేంద్రాలు..

ఆంధ్రప్రదేశ్‌లో: విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, అనంతపురం. 

తెలంగాణలో: హైదరాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్‌. 


దరఖాస్తుకు చివరి తేదీ: 30.04.2024


వెబ్‌సైట్‌: https://navodaya.gov.in/nvs/en/Home1

 

Navodaya Vidyalaya Samiti - 1,377 Non-Teaching Posts

Navodaya Vidyalaya Samiti (NVS), Noida invites online applications for filling up the post of Non-Teaching Staff to work NVS Head Quarters Office, Regional Offices, NLIs, Jawahar Navodaya Vidyalayas on direct recruitment basis.

Post details:

1. Female Staff Nurse: 121 Posts

2. Assistant Section Officer (ASO): 5 Posts

3. Audit Assistant: 12 Posts

4. Junior Translation Officer: 4 Posts

5. Legal Assistant: 1 Post

6. Stenographer: 23 Posts 

7. Computer Operator: 2 Posts

8. Catering Supervisor: 78 Posts

9. Jr. Secretariat Assistant (JSA): 381 Posts

10. Electrician cum Plumber: 128 Posts

11. Lab Attendant: 161 Posts 

12. Mess Helper: 442 Posts

13. Multi Tasking Staff (MTS): 19 Posts

Total no. of posts: 1,377.

Qualification: 10th Class, 12th Class, Diploma, Bachelors Degree, PG in relevant Discipline with experience.

Mode of selection: Based on written examination, Trade/ skill test, Interview, document verification, Medical Examination.

Exam Centers in AP & Telangana States: Anantapur, Kakinada, Nellore, Guntur, Kurnool, Vijayawada, Vishakapatnam, Hyderabad, Mahabubnagar, Nizamabad, Khammam, Karimnagar. 

How to apply: Apply Online through Kendriya Vidyalaya Samiti website.

Application Fee: For Female Staff Nurse Gen/ OBC/ EWS Rs.1500. SC/ ST/ PWD Rs.500. Other posts Gen/ OBC/ EWS Rs.1000. SC/ ST/ PWD Rs.500.

Starting date for Online Submission of Application: 22.03.2024.

Last date for Online Submission of Application: 30.04.2024.

Correction in Particulars of Application Form: 02.05.2024 to 04.05.2024.

Notification

website

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.