JEE Advanced 2024: జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్ తేదీల్లో మార్పు * మే 26న యథాతథంగా పరీక్ష
JEE Advanced 2024: జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్ తేదీల్లో మార్పు
* మే 26న యథాతథంగా పరీక్ష
చెన్నై: ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి ఏటా నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రిజిస్ట్రేషన్ షెడ్యూల్‌లో మార్పు చోటుచేసుకుంది. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన విద్యార్థులు ఏప్రిల్ 21 నుంచి 30 వరకు అడ్వాన్స్‌డ్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా.. దాన్ని ఏప్రిల్ 27 నుంచి మే 7 సాయంత్రం 5గంటల వరకు మార్పు చేసినట్లు ఐఐటీ- మద్రాస్ ప్రకటించింది. పరీక్ష తేదీలో మార్పు లేదని, మే 26న యథాతథంగా పరీక్ష జరుగుతుందని స్పష్టం చేసింది. జేఈఈ అడ్వాన్స్‌డ్ దరఖాస్తు ఫీజు చెల్లింపునకు మే 10 వరకు గడువు ఇచ్చారు. అడ్మిట్ కార్డులు మే 17 నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానున్నాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్ అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు మే 31 నుంచి అందుబాటులో ఉంచుతారు. ప్రాథమిక కీ జూన్ 2న విడుదల చేసి తుది కీ, ఫలితాలను జూన్ 9న ప్రకటిస్తారు.
జేఈఈ అడ్వాన్స్‌డ్ వెబ్‌సైట్

కామెంట్‌లు