7, ఆగస్టు 2024, బుధవారం

EPF: ఈపీఎఫ్ వ్యక్తిగత వివరాల సవరణలకు అవకాశం

EPF: ఈపీఎఫ్ వ్యక్తిగత వివరాల సవరణలకు అవకాశం

ఈపీఎఫ్ చందాదారుల వ్యక్తిగత వివరాల్లో మార్పులు.. లావాదేవీలు నిర్వహించని పీఎఫ్ ఖాతాల పరిష్కారానికి సంబంధించిన విధివిదానాల్లో ఈపీఎఫ్వో స్వల్ప మార్పులు చేసింది.


పేరులో మూడక్షరాలు దాటితేనే పెద్ద మార్పుగా పరిగణన లావాదేవీలు నిర్వహించని ఖాతాల క్లెయిమ్లపై కొత్త విధివిధానాలు
Epf చందాదారుల వ్యక్తిగత వివరాల్లో మార్పులు.. లావాదేవీలు నిర్వహించని పీఎఫ్ ఖాతాల పరిష్కారానికి సంబంధించిన విధివిధానాల్లో ఈపీఎఫ్వో స్వల్ప మార్పులు చేసింది. ఖాతాదారు, తండ్రి, తల్లి, జీవిత భాగస్వామి పేర్లలో తప్పులు దొర్లితే జాయింట్ డిక్లరేషన్ల ద్వారా సవరణలకు అవకాశం కల్పించింది. పేరులో రెండు అక్షరాలకు మించి సవరణ చేయాల్సి ఉంటే గతంలో 'పెద్ద(మేజర్) మార్పు'గా పరిగణించేవారు. ఇప్పుడు ఆ పరిమితిని 3 అక్షరాలకు కుదించారు. స్పెల్లింగ్ పరంగా చేయాల్సిన మార్పులకు, పూర్తి పేరు నమోదు చేసుకునేందుకు అక్షరాల పరిమితిని తొలగించింది. చేయాల్సిన మార్పులు మూడక్షరాలకు తక్కువగా ఉన్నా.. వివాహం తరువాత జీవిత భాగస్వామి ఇంటి పేరు మార్చాల్సి ఉన్నా వాటిని చిన్న సవరణలుగానే పేర్కొంది.

లావాదేవీలు లేని ఖాతాలపై ...

• ఏళ్లుగా లావాదేవీలు లేని పీఎఫ్ ఖాతాల్లో నుంచి నగదు ఉపసంహరణలో ఇబ్బందులతో పాటు మోసాల నివారణకు ఈ-కేవైసీ బయోమెట్రిక్ ధ్రువీకరణను ఈపీఎఫ్వో తప్పనిసరి చేసింది.

• లావాదేవీలు లేని ఖాతాల్లో ఎక్కువ వాటికి యూనివర్సల్ అకౌంట్ నంబరు (యూఏఎన్) లేదు. ఈ తరహా కేసుల్లో ఖాతాదారులు సంబంధిత కార్యాలయాలకు వెళ్లి లేదా ఈపీఎఫ్ ఐజీఎంఎస్ పోర్టల్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకుని బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి. వృద్ధులు, ఇతర అనారోగ్య సమస్యలతో ఉన్నవారు పోర్టల్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకుంటే చాలు.. పీఎఫ్ సిబ్బందికి ఇంటికే వచ్చి యూఏఎనన్ను సిద్ధం చేస్తారు.

• చందాదారుడి ఖాతాలో నగదు నిల్వ రూ. లక్ష కన్నా తక్కువగా ఉంటే సంబంధిత అకౌంట్స్ అధికారి(ఏవో), రూ. లక్ష కన్నా ఎక్కువగా ఉంటే సహాయ పీఎఫ్ కమిషనర్ (ఏపీఎఫ్సీ) లేదా ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్(ఆర్పీఎఫ్సీ) నిర్ణయం తీసుకుంటారు. పనిచేసిన కంపెనీ మూతబడిన సందర్భాల్లో యూఏఎన్ లేనివారు పీఎఫ్ కార్యాలయాల్లో దాన్ని తీసుకోవాలి. చందాదారు చనిపోయినపుడు.. ఫారం-2లో పేర్కొన్న నామినీ పేరిట ఈ-కేవైసీ చేసి నగదు క్లెయిమ్ చేసుకునేందుకు అవకాశమివ్వవచ్చు. నామినీ పేరును పేర్కొనకుంటే. చట్టబద్ధమైన వారసులు క్లైములు దాఖలు చేయవచ్చు
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

కామెంట్‌లు లేవు: