Alerts

14, మే 2020, గురువారం

🎯డీఆర్‌డీఓ-ఆర్‌ఏసీలో 167 సైంటిస్టులు🎯



🏵డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌(డీఆర్‌డీఓ)కి చెందిన దిల్లీలోని రిక్రూట్‌మెంట్‌ అండ్‌ అసెస్‌మెంట్‌ సెంటర్‌(ఆర్‌ఏసీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

🏵 సైంటిస్ట్‌-బి మొత్తం ఖాళీలు: 167

🏵విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, మెకానికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, ఎరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ తదితరాలు.

👉అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, వాలిడ్‌ గేట్‌ స్కోర్‌.

👉ఎంపిక విధానం: వాలిడ్‌ గేట్‌ స్కోర్‌, డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

👉దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

👉దరఖాస్తుకు చివరి తేది: జులై 10, 2020.

⭕వెబ్‌సైట్‌: https://rac.gov.in/

ఐఐటీ కౌన్సెలింగ్‌ రౌండ్ల తగ్గింపు!!



హైదరాబాద్‌, మే 13(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ కారణంగా ఇప్పటికే జేఈఈ-మెయిన్‌, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు వాయిదా పడటంతో తరగతుల ప్రారంభం కూడా ఆలస్యమవడం అనివార్యంగా మారింది. దీంతో పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి, కౌన్సెలింగ్‌ ప్రక్రియలను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని కేంద్ర మానవ వనరుల శాఖ భావిస్తోంది. ఇందులో భాగంగానే ఐఐటీ, నీట్‌లలో ప్రవేశాలకుగానూ జేఈఈ కౌన్సెలింగ్‌కు ఈ ఏడాది తక్కువ రౌండ్లు నిర్వహించాలని యోచిస్తోంది. 2019లో సీట్ల భర్తీకి జోసా 7 రౌండ్ల కౌన్సెలింగ్‌ నిర్వహించింది. ఈసారి రౌండ్లు తగ్గించాలని ఐఐటీలు మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపాయి. దీంతో ఈ ఏడాది ఐదు లేదా ఆరు రౌండ్ల కౌన్సెలింగ్‌ నిర్వహించాలని భావిస్తున్నారు. జేఈఈ-మెయిన్‌ పరీక్షను జూలై 18 నుంచి 23 వరకు, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను ఆగస్టు 23న నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే

AP ELECTRICITY NEW TARIFF

*ఏపీ కరెంట్ బిల్ కొత్త టారిఫ్* 

కన్ఫ్యూజ్ కాకుండా ఈ కింది కొత్త స్లాబ్స్ చూడండి.

1. *కేటగిరి A* 

నెలకు 75 యూనిట్స్ లోపు కరెంట్ వాడుకున్న వారు కేటగిరీ A లోకి వస్తారు. కేటగిరి A స్లాబ్స్ ఈ కింది విధంగా ఉన్నాయి.

0 - 50  --->  1.45
51-75 ----> 2.60

*2. కేటగిరి B*

నెలకు 75 యూనిట్స్ దాటి 225 యూనిట్స్ వరకు  వాడుకున్న వారు కేటగిరి B లోకి వస్తారు. కేటగిరి B స్లాబ్స్ ఈ కింది విధంగా ఉన్నాయి.

0 - 50      ---->   2.60
51 - 100 ----->   2.60
101 - 200 -----> 3.60
201 - 225 -----> 6.90

*3. కేటగిరి C*

నెలకు 225 యూనిట్స్ పైన వాడుకున్న వారు కేటగిరి C లోకి వస్తారు. కేటగిరి C స్లాబ్స్ ఈ కింది విధంగా ఉన్నాయి.

0 - 50      ---->   2.65
51 - 100 ----->   3.35
101 - 200 -----> 5.40 
201 - 300 -----> 7.10
301 - 400 -----> 7.95
401 - 500 ----->  8.50
500 పైన  ----->   9.95 

చదివారు కదా, ఇప్పుడు మీ కరెంట్ బిల్ తీసుకుని మీరు నెలలో ఎన్ని యూనిట్స్ వాడుకున్నారో దానిని బట్టి మీ కేటగిరి తెలుసుకోండి. దానిని బట్టి మీ యూనిట్ రేట్స్ స్లాబ్స్ వారీగా లెక్క కట్టుకొని దానిని టోటల్ చెయ్యండి. దీనికి సర్ చార్జీలు అదనం.

SVMVV | SRM JEEJEEE Entrance | Sathybhama Entrance Exams details

🔳ఎస్పీఎంవీవీ పీజీ సెట్‌ దరఖాస్తు గడువు పెంపు

తిరుపతి (మహిళా వర్సిటీ), న్యూస్‌టుడే: తిరుపతి శ్రీ పద్మావతి మహిళా వర్సిటీలో పీజీ ప్రవేశాలకు ఏటా నిర్వహించే.. ఎస్పీఎంవీవీ-2020 పీజీసెట్‌ ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును జూన్‌ 10 వరకు పొడిగించినట్లు వీసీ ఆచార్య జమున తెలిపారు. కొవిడ్‌-19 కారణంగా జులై లేదా ఆగస్టులో ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.

జులై 30 నుంచి ఎస్‌ఆర్‌ఎం జేఈఈఈ ప్రవేశ పరీక్షలు
ఎస్‌ఆర్‌ఎం జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ ఇంజినీరింగ్‌(ఎస్‌ఆర్‌ఎం జేఈఈఈ) ప్రవేశపరీక్షలు జులై 30 నుంచి ఆగస్టు 4 వరకు జరగనున్నాయి. ఈ మేరకు ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ నిర్వాహకులు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు జరుగుతాయన్నారు. ఆగస్టు 2 లేదా 3వ వారం నుంచి ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామన్నారు.


ఆగస్టు 3 నుంచి ‘సత్యభామ’లో ప్రవేశ పరీక్షలు
‘సత్యభామ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ’ వర్సిటీలో ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు ఆగస్టు 3 నుంచి 5 వరకు జాతీయ స్థాయి ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. ఈ మేరకు బుధవారం ఆ సంస్థ నిర్వాహకులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 30లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆగస్టు 8న ఫలితాలు, 12న కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని తెలిపారు.

డీఎస్సీ-2008 అభ్యర్థులకు తాత్కాలిక ఉద్యోగాలు!



ఈనాడు, అమరావతి: డీఎస్సీ-2008 అభ్యర్థులకు తాత్కాలిక ఉద్యోగాలు ఇచ్చేందుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినట్లు తెలిసింది. కనీస టైం స్కేల్‌తో ఉద్యోగాలు ఇచ్చేందుకు అనుమతించింది. డీఎస్సీ-2008లో సెకండరీ గ్రేడ్‌ టీచర్ల (ఎస్జీటీ) పోస్టులకు మొదట డీఈడీ వాళ్లకే అవకాశం కల్పించారు. దీనిపై బీఈడీ అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా డీఈడీ వాళ్లకు 30శాతం పోస్టులే కేటాయించారు. దీంతో మొదట పోస్టులు వచ్చిన డీఈడీ అభ్యర్థులు పోస్టు కోల్పోవాల్సి వచ్చింది. ఈ అభ్యర్థుల వినతి మేరకు గత ప్రభుత్వం ఎమ్మెల్సీలతో కమిటీ వేసింది. కనీస వేతనంతో వీరికి పోస్టింగ్‌ ఇవ్వాలని కమిటీ సిఫార్సు చేసింది. దీనికి ప్రస్తుతం ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినట్లు సమాచారం.

ప్రభుత్వ ఆమోదానికి దస్త్రం
డీఎస్సీ-2008కి సంబంధించిన అభ్యర్థులు మొత్తం 4,657 మంది ఉన్నట్లు లెక్క తేల్చారు. వీరిలో కొందరు ఇప్పటికే వేర్వేరు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వీరికి పదవీ విరమణ వరకు కనీస టైం స్కేల్‌ ఇస్తూ పోస్టింగ్‌లు ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ దస్త్రాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆమోదం లభించిన తర్వాత పోస్టింగ్‌లు ఇచ్చే అవకాశం ఉంది.

ఉపాధ్యాయుల బదిలీలకు వివరాల సేకరణ
ఉపాధ్యాయుల బదిలీలకు ఖాళీల వివరాలు పంపాలని కమిషనరేట్‌ నుంచి జిల్లా విద్యాధికారులకు ఆదేశాలు అందాయి. ఫిబ్రవరి 29 వరకు ఉన్న ఎస్జీటీ, ఎల్‌ఎఫ్‌ఎల్‌, గ్రేడ్‌-2 ప్రధానోపాధ్యాయుల ఖాళీలు, పాఠశాలల్లో ఖాళీలు, 5, 8 ఏళ్లుగా ఒకేచోట పని చేస్తున్నవారు.. తదితర వివరాలు సేకరిస్తున్నారు.

Ad

జూన్‌ నుంచి ఈ-ఎస్‌ఆర్‌
ఉపాధ్యాయుల ప్రస్తుత సర్వీసు రిజిస్టర్‌(ఎస్‌ఆర్‌) స్థానంలో ఈ-ఎస్‌ఆర్‌ తీసుకొస్తున్నారు. ఉపాధ్యాయుడిగా విధుల్లో చేరినప్పటి నుంచి పదవీ విరమణ పొందిన వరకు అన్ని సేవలను ఆన్‌లైన్‌లోనే నమోదు చేయనున్నారు. జూన్‌ నుంచి దీన్ని అమల్లోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మానవవనరుల సేవలు, వేతనాల చెల్లింపులు, సర్వీసు మొత్తం ఆన్‌లైన్‌ చేయనున్నారు.

టెన్త్‌ పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం


పదో తరగతి పరీక్షలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో 11 పేపర్లను 6 పేపర్లుగా కుదించింది. భౌతిక దూరం పాటిస్తూ జూలై 10వ తేదీ నుంచి 15 వరకూ పరీక్షలు నిర్వహించనుంది. ప్రతి పేపర్‌కు 100 ​మార్కులు ఉంటాయి.
►జులై 10న ఫస్ట్ లాంగ్వేజ్(9.30am- 12.45pm)
►జులై 11న సెకండ్ లాంగ్వేజ్(9.30am- 12.45pm)
►జులై 12న ఇంగ్లీషు(9.30am- 12.45pm)
►జులై 13న మ్యాథ్స్‌(9.30am- 12.45pm)
►జులై 14న జనరల్ సైన్స్(9.30am- 12.45pm)
►జులై 15న సోషల్ స్టడీస్‌(9.30am- 12.45pm)

లాక్ డౌన్ సమయంలో అత్యవసర పరిస్థితులలో ప్రయాణానికి

ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు పరిష్కారంగా  ఏపి పోలీసులు ఓ మార్గాన్ని సూచిస్తున్నారు
అత్యవసర ప్రయాణానికి పోలీసు వారి వెబ్ సైట్ ద్వారా ఇ పాస్ లను ఇవ్వనున్నట్టు అందుకు
ఫోటో, పూర్తి పేరు, మొబైల్ నంబర్, మెడికల్ సర్టిఫికెట్లు, అధికారిక లేఖలు, ఆధార్‌ను అప్‌లోడ్ లేదా ఏదైనా గుర్తింపు కార్డు, పూర్తి ప్రయాణ వివరాలు, ప్రయాణించే వాహన పూర్తి వివరాలు, ప్రయాణీకుల సంఖ్యను వెబ్ సైట్ లో నమోదు చేయాలి. త్వరితగతిన అందించే అత్యవసర ఇ పాస్ ను అప్లై చేసిన అభ్యర్థి యొక్క మెబైల్ ఫోన్ కు లేదా ఇ మెయిల్ ఐడికు చేరవేస్తారు, కారుకు (1+3) మాత్రమే అనుమతి ఉంటుంది. ఇ పాస్ లభించిన తరువాత  ప్రయాణించేటప్పుడు వారి ఒరిజినల్ ఐడి కార్డును కూడా తప్పనిసరిగా తీసుకెళ్లాలి. వెబ్ సైట్ లింక్ https://citizen.appolice.gov.in/

Recent

Local jobs from various areas no need to pay money for these jobs

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...