Alerts

--------

19, మే 2020, మంగళవారం

State Wise- ePass Online Websites

State Wise- ePass Online Websites
State Name
Online E-Pass Website Link
Uttrakhand
For Dehradun- Webline.org.in
West Bengal Kolkata
Delhi
Gurugram
Haryana
Punjab
Goa
Himachal Pradesh
Travel Permit Kangra
Tamil Nadu
For Tiruvannamalai-  Epasskki.in
Kerala
Maharashtra
For Pune- Click  Here
Rajasthan
 Bihar
West Bengal
Karnataka
 For Bengaluru
Uttar Pradesh
Madhya Pradesh
Jharkhand
Assam
Chandigarh
 Apply Online Below- 
Gujarat
Andhra Pradesh
Odisha
Helpline for Drivers-0674-2620200
Telangana
Chhattisgarh
Andaman & Nicobar Islands
J & K
Chhattisgarh

ఏది చదివినా.. మీరు డాక్టరే! | ఇంటర్‌ బైపీసీ తర్వాత?మెడికల్‌ కోర్సులు

డాక్టర్‌ కావాలంటే  ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ చదవాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే.  కానీ ఆయుష్‌ కోర్సులు చేసినా డాక్టర్‌ అయిపోవచ్చు. వీటికీ నీట్‌ ద్వారానే ప్రవేశాలు లభిస్తాయి.  ఆయుష్‌ విభాగాలైన ఆయుర్వేదం, యునానీ, హోమియో, నేచురోపతి, సిద్ధ వైద్యాలు ఇప్పుడు అలోపతికి దీటుగా ప్రాచుర్యం పొందుతున్నాయి.  ప్రతి ఒక్కదానికీ ప్రత్యేకమైన విధానం ఉంది. అందరికీ ఆరోగ్యమే ప్రధాన లక్ష్యం. ఇంటర్మీడియట్‌ను బైపీసీ గ్రూప్‌తో పూర్తిచేసిన అభ్యర్థులు తమ ఆసక్తికి అనుగుణంగా ఈ కోర్సులనూ ఎంచుకోవచ్చు.
వైద్యవిద్య వైపు సాగే లక్ష్యంతోనే చాలామంది ఇంటర్మీడియట్‌లో బైపీసీ గ్రూప్‌ తీసుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ, గౌరవం, ఆదాయం ఉన్నవాటిల్లో వైద్యవృత్తి ప్రధానమైనది. అందుకే వైద్యవిద్యకు పోటీ ఎక్కువ. వ్యయమూ అధికమే. ఇంటర్మీడియట్‌లో చేరినప్పటి నుంచే  ప్రవేశ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని తీవ్రంగా పరిశ్రమిస్తుంటారు.
వైద్యవిద్యలో ప్రధానమైన కోర్సులు ఎంబీబీఎస్‌, బీడీఎస్‌. ఎక్కువమంది వీటిపైనే దృష్టిపెడతారు. కానీ ఆధునిక వైద్యంతో పోటీపడుతూ ఎన్నో ఇతర వైద్య కోర్సులూ అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు వాటినీ పరిశీలించవచ్చు. వీటన్నింటికీ నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌) ద్వారానే ప్రవేశాలు కల్పిస్తారు. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) దీన్ని నిర్వహిస్తోంది.
సాధారణంగా వైద్య విద్యను ప్రధాన, ఆయుష్‌ కోర్సులుగా విభజించవచ్చు. ప్రధాన కోర్సుల్లో ఇంగ్లిష్‌/ ఆధునిక వైద్యంగా పేర్కొనే ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ఉంటాయి. ఆయుష్‌ కోర్సుల్లో సంప్రదాయ/ ప్రకృతిసిద్ధమైన ఆయుర్వేద, యోగా, నేచురోపతి, యునానీ, సిద్ధ, హోమియోపతికి సంబంధించినవి ఉంటాయి.

ఏది చదివినా.. మీరు డాక్టరే!

ఈ ఏడాది నుంచి ఎయిమ్స్‌, జిప్‌మర్‌లు నిర్వహించుకునే ప్రత్యేక ప్రవేశ పరీక్షలను రద్దు చేశారు. ఎయిమ్స్‌ల్లోని 1207 సీట్లనూ, జిప్‌మర్‌ల్లోని 200 సీట్లనూ నీట్‌ ర్యాంకు ద్వారానే భర్తీ చేస్తారు.

ప్రధాన కోర్సులు

ఏది చదివినా.. మీరు డాక్టరే!

ఎంబీబీఎస్‌: బ్యాచిలర్‌ ఆఫ్‌ మెడిసిన్‌ అండ్‌ బ్యాచిలర్‌ ఆఫ్‌ సర్జరీ. ప్రతిష్ఠాత్మక కోర్సు. డాక్టర్‌ వృత్తిని చేపట్టాలనుకునేవారు ఎంచుకునే ప్రధాన డిగ్రీ. రెండు ప్రొఫెషనల్‌ డిగ్రీలు- మెడిసిన్‌, సర్జరీల కలయిక ఇది. దేశంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు దీనిని అందిస్తున్నాయి. నాలుగున్నరేళ్ల కోర్సులో బేసిక్‌, ప్రి, పారామెడికల్‌ సబ్జెక్టులను చదువుతారు. ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, అనాటమీ, ఫార్మకాలజీ, పాథాలజీ వీటిలో భాగం. ఏడాది తప్పనిసరి రొటేటరీ ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది. నీట్‌ ద్వారా ప్రవేశం పొందవచ్చు.
బీడీఎస్‌: బ్యాచిలర్‌ ఆఫ్‌ డెంటల్‌ సర్జరీ. ఇది దంత వైద్యానికి సంబంధించింది.  ఎంబీబీఎస్‌ తర్వాత ఎక్కువమంది ఆసక్తి చూపే కోర్సు. గతంతో పోలిస్తే ఇటీవలి సంవత్సరాల్లో దీనికీ ఆదరణ బాగా పెరిగింది. డెంటల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీఐ) ఆధ్వర్యంలో కోర్సును నిర్వహిస్తారు. దీనిని పూర్తిచేసినవారు ప్రాక్టీసింగ్‌ డెంటిస్ట్‌ లేదా డెంటల్‌ సర్జన్‌ కావచ్చు. కోర్సు కాలవ్యవధి అయిదేళ్లు. దీనిలో ఏడాది తప్పనిసరి ఇంటర్న్‌షిప్‌ భాగం. 26,949 బీడీఎస్‌ సీట్లు దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి.

ఆయుష్‌ విభాగాలు

ఏది చదివినా.. మీరు డాక్టరే!

వీటిని సంప్రదాయ లేదా ప్రత్యామ్నాయ వైద్య కోర్సులుగా చెబుతారు. ఆధునిక వైద్యానికి భిన్నంగా ప్రకృతిసిద్ధమైన చికిత్సతో వ్యాధులను నయం చేయడం వీటిల్లో కనిపిస్తుంటుంది. సహజంగా శరీరమే తనను తాను నయం చేసుకునే విధంగా చేయడం (నేచురల్‌ హీలింగ్‌) ఈ చికిత్స విధానాల్లో కనిపిస్తుంది. కానీ ఉపయోగించే పద్ధతుల్లోనే తేడా ఉంటుంది. నీట్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. కోర్సుల కాలవ్యవధి అయిదేళ్లు అందులో ఏడాది ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది.
* ఆయుర్వేదం- బీఏఎంఎస్‌: బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆయుర్వేదిక్‌ మెడిసిన్‌ అండ్‌ సర్జరీ. ఆయుర్వేద వైద్యానికి సంబంధించింది. మనదేశంతోపాటు నేపాల్‌, బంగ్లాదేశ్‌, సౌత్‌ ఏషియన్‌ దేశాల్లో ఈ వైద్యానికి ఆదరణ ఎక్కువ. ఆయుర్వేద తత్వశాస్త్రం పంచభూతాల సిద్ధాంతంపై ఆధారపడి ఉంటుంది. దీనిని పురాతన వైద్యవిధానంగానూ చెబుతారు. ఈ విధానంలో వ్యాధిని నయం చేయడమే కాకుండా నివారణ, భవిష్యత్తులో వచ్చే అవకాశాలనూ నియంత్రించడం ప్రధాన లక్ష్యాలుగా ఉంటాయి. మూలికలు, వాటితో చేసిన మందుల ద్వారా వ్యాధులను   నివారిస్తారు. మొత్తంగా ప్రకృతి సిద్ధమైనవి, జీవన విధానాల్ని మార్చుకోవడం ద్వారా శరీరం తనను తాను నయం చేసుకునే పద్ధతులను ఇందులో నేర్పిస్తారు.
కోర్సు ఏడాదిన్నర చొప్పున మూడు విభాగాలుగా విభజితమై ఉంటుంది. అనాటమీ, ఫిజియాలజీ, ఆయుర్వేదిక్‌ ఫార్మస్యూటికల్‌ సైన్స్‌, టాక్సికాలజీ, ఫార్మకాలజీ, సర్జరీ, ఈఎన్‌టీ, స్కిన్‌, గైనకాలజీ మొదలైన అంశాలను కోర్సులో భాగంగా చదువుతారు. కోర్సు అనంతరం జనరల్‌ ప్రాక్టీస్‌ పెట్టుకోవచ్చు లేదా ఎండీ ఆయుర్వేద చదవవచ్చు. ప్రాక్టీసు పెట్టాలనుకునేవారు ప్రభుత్వం నుంచి లైసెన్స్‌ పొందాలి.

ఏది చదివినా.. మీరు డాక్టరే!

* హోమియో- బీహెచ్‌ఎంఎస్‌: బ్యాచిలర్‌ ఆఫ్‌ హోమియోపతిక్‌ మెడిసిన్‌ అండ్‌ సర్జరీ. హోమియోపతిక్‌ వైద్య పరిజ్ఞాన విభాగం ఇది. అలోపతి, ఆయుర్వేదం తర్వాత దేశంలో మూడో ప్రసిద్ధ వైద్య విధానం. దేహంపై దుష్ప్రభావాలు చూపకుండా ఉండే ద్రవ, టాబ్లెట్‌ రూపంలో మందులను అందిస్తారు. వీటిని సాధారణంగా మొక్కలు, జంతువులు, మినరల్స్‌ నుంచి తయారు చేస్తారు. దేహంలో సహజసిద్ధ స్వస్థత వృద్ధి అయ్యేలా చేస్తారు.
కోర్సులో నాలుగు విభాగాలుంటాయి. మొదటిది ఏడాదిన్నర, మిగతా మూడు ఏడాది చొప్పున ఉంటాయి. హెర్బాలజీ, నేచురల్‌ థెరపీలు, హోమియోపతిక్‌ పద్ధతులు, హీలింగ్‌ టెక్నిక్‌లు మొదలైనవాటిని కోర్సులో భాగంగా నేర్చుకుంటారు. ఫార్మసీ, పీడియాట్రిక్స్‌, సైకియాట్రీ, స్కిన్‌ స్పెషలిస్ట్‌, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్‌ స్పెషలైజేషన్లుంటాయి. వీటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకునే వీలుంటుంది. కోర్సు అనంతరం ప్రాక్టీస్‌ పెట్టుకోవచ్చు లేదా అందుబాటులో ఉన్న స్పెషలైజేషన్లలో పీజీ అయినా చేసుకునే వీలుంది.


ఏది చదివినా.. మీరు డాక్టరే!

* యునానీ- బీయూఎంఎస్‌:  బ్యాచిలర్‌ ఆఫ్‌ యునానీ మెడిసిన్‌ అండ్‌ సర్జరీ. పురాతన వైద్యవిధానాల్లో ఒకటి. దేశంలో నాలుగో ప్రసిద్ధ వైద్య విధానం. దక్షిణ ఆసియా, అరబ్‌ దేశాలు ఈ విధానాన్ని ఎక్కువగా అనుసరిస్తున్నాయి. దీనినే హిక్‌మత్‌, యునానీ టిబ్‌ మెడిసిన్‌గానూ వ్యవహరిస్తారు. దీనిలో సానుకూల ఆరోగ్యం, వ్యాధుల నివారణ, వాటి జ్ఞానం, అభ్యాసాలు ఉంటాయి. మూలికలను వ్యాధి నివారణలో ఉపయోగిస్తారు. వ్యాధి నిర్ధారణ అంశాలు- వ్యాధి లక్షణాలు, నిర్ధారణ, లెబోరేటరీ సదుపాయాలు, వాటిని ఉపయోగించే విధానం వంటి అంశాలను నేర్చుకుంటారు. దీనిని చదవాలనుకునేవారికి ఉర్దూ తెలిసుండటం తప్పనిసరి. కోర్సు పూర్తిచేసినవారిని హకీమ్‌లుగా వ్యవహరిస్తారు. ఉన్నత చదువులు చదవాలనుకునేవారికి డిప్లొమా, పీజీ, డాక్టర్‌ ఆఫ్‌ మెడిసిన్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

ఏది చదివినా.. మీరు డాక్టరే!


* నేచురోపతి- బీఎన్‌వైఎస్‌: బ్యాచిలర్‌ ఆఫ్‌ నేచురోపతి అండ్‌ యోగిక్‌ సైన్సెస్‌. నేచురోపతిక్‌ మెడిసిన్‌, థెరపిక్‌ యోగాల సమ్మిళితం. దీనిలో మందుల ప్రసక్తి లేకుండా వ్యాధులు రాకుండా/ నయం చేయడంపై దృష్టిసారిస్తారు. కోర్సులో భాగంగా నేచురోపతి, యోగా అంశాలను నేర్చుకుంటారు. నేచురోపతిలో డైట్‌, మసాజ్‌, ఎక్సర్‌సైజ్‌, న్యూట్రిషన్‌ థెరపీ, ఆక్యుపంక్చర్‌, ఆక్యుప్రెజర్‌, నాచురల్‌ చైల్డ్‌బర్త్‌, హెర్బల్‌/ బొటానికల్‌ మెడిసిన్‌ మొదలైన వాటిని బోధిస్తారు. యోగాలో శ్వాస నియంత్రణ, మెడిటేషన్‌, ఆసనాలపై దృష్టిపెడతారు. రోగి సమస్య ఆధారంగా ఈ అంశాల నుంచి అవసరమైన ప్రత్యేకమైన చికిత్సా పద్ధతిని రూపొందిస్తారు. కోర్సు పూర్తిచేసినవారు సొంతంగా జనరల్‌ ప్రాక్టీషనర్‌ కావచ్చు. వీరికి మెడికల్‌ విశ్వవిద్యాలయాల్లో లెక్చరర్‌ అవకాశాలూ ఉంటాయి. స్పెషలైజేషన్‌తో పీజీ చేసుకునే వీలూ ఉంది.

ఏది చదివినా.. మీరు డాక్టరే!


సిద్ధ వైద్యం- బీఎస్‌ఎంఎస్‌: బ్యాచిలర్‌ ఆఫ్‌ సిద్ధ మెడిసిన్‌ అండ్‌ సర్జరీ. కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ, ఆయుష్‌ విభాగాల ఆధ్వర్యంలో నడిచే సెంట్రల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియన్‌ మెడిసిన్‌ (సీసీఐఎం)   ఈ కోర్సును నిర్వహిస్తోంది. ఈ వైద్య విధానం తమిళుల నుంచి ఇతరులకు చేరినట్లుగా చెబుతారు. ఇందులో శరీరానికే కాదు మానసిక స్థితికీ ప్రాధాన్యమిస్తారు. సిద్ధ తాత్వికత ప్రకారం- మానవ శరీరంలోని ఏడు అంశాలు (ప్లాస్మా, రక్తం, ఎముకలు, ఫ్యాట్‌, కండరాలు, రక్తనాళాలు, సీమన్‌) వాత (గాలి), పిత్త (ఉష్ణం/ శక్తి), కఫ (వాటర్‌) అధీనంలో ఉంటాయి. ఈ మూడింటిలో వచ్చే హెచ్చుతగ్గుల కారణంగా వ్యాధులు వస్తాయి. అందుకే చికిత్సలో భాగంగా రోగి, పర్యావరణం, వయసు, అలవాట్లు, శారీరక స్థితిని పరిగణనలోకి తీసుకుంటారు. కోర్సు అనంతరం డాక్టర్‌గా స్థిరపడవచ్చు లేదా సంబంధిత వైద్య కళాశాలల్లో బోధన చేయవచ్చు. ఉన్నత విద్యపై ఆసక్తి ఉన్నవారు నచ్చిన స్పెషలైజేషన్‌తో ఎండీ కోర్సులో చేరవచ్చు

మారిన 10వ తరగతి తెలుగు ప్రశ్న పత్రానికి ప్రిపరేషన్


హిందూపురం పట్టణ | విద్యా | ఉద్యోగ సమాచారం 19-05-2020

లాక్ డౌన్ కారణంగా హిందూపురంలో నిన్నటి రోజు ఉదయం సుమారుగా రెండు వందల మంది యుపి వాసులను వారి స్వస్థలాలకు చేర్చేందుకు విశ్వహిందూ పరిషత్ సభ్యులతో సహా చారు కీర్తి గారి అధ్యక్షతన స్వచ్ఛందంగా కార్యక్రమం నిర్వహించి వారికి అన్ని సౌకర్యాలతో వారి స్వస్థలాలకు పంపడం జరిగింది.

బీహార్ కు చెందిన 500మంది వలస కూలీలు నిన్నటి సాయంత్రం రైలులో వారి స్వస్థలమైన బీహార్ కు ప్రయాణమయ్యారు వారికి ప్రయాణంలో తినడానికి తనవంతుగా చపాతీలు ప్యాకెట్లను అక్కడి కాలనీ మహిళల సహాయంతో తయారు చేయించి శ్రీ సత్య సాయిబాబా సమితి సభ్యులకు అందించిన వైఎస్సార్సీపి నాయకులు మారుతి రెడ్డి. 

లాక్ డౌన్ మరియ ఇతర కారణాల వల్ల వాయిదా పడిన సి బి ఎస్ ఇ 10, 12వ తరగతి పరీక్షలు  జులై 1 వ తేదీ నుండి 15వ తేదీ వరకు జరుగుతాయి. 12వ తరగతికి విద్యార్థులకు జులై 1 న హోం సైన్స్, 2న హిందీ, 7న కంప్యూటర్ సైన్స్, 9న బిజినెస్ స్టడీస్, 10న బయో టెక్నాలజీ, 11న జియోగ్రఫీ, 13వ తేదీన సోషియాలజీ పరీక్షలుంటాయి.

డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఫిబ్రవరి/మార్చిలో నిర్వహించిన ఎం బీ బీ ఎస్ ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలను సోమవారం విడుదల చేసింది. మార్కుల రీటోటలింగ్ కోసం సబ్జెక్టుకు 2 వేల రూపాయలతో ఈ నెల 30 లోగా దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ మేజర్ భీమేశ్వర్ తెలిపారు.


వై ఎస్ ఆర్ వాహన మిత్ర పథకం ద్వారా, సొంతంగా ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ లున్న డ్రైవర్లకు ఆర్థిక సాయం జూన్ 4న సి ఎం వై ఎస్ జగన్ చేతుల మీదుగా ఆన్ లైన్ ద్వారా చెల్లింపులు చేయనున్నారు. ఈ ఏడాది మే 17 వరకు రవాణా శాఖలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ ల యజమానులే డ్రైవర్లు అయిన వారు ఈ పథకం కింద కొత్తగా దరఖాస్తులను ఈ నెల 18 నుండి 26వ తేదీలోగా గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో అందించాలి. జూన్1వ తేదీలోపు లబ్దిదారుల ఎంపిక పూర్తి చేస్తామన్నారు.

విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తూ మృతి చెందిన 108 అంబులెన్స్ డ్రైవర్ నవీన్ బాబు కుటుంబానికి 108 ఉద్యోగుల సంఘ సభ్యులు 5 లక్షల 75 వేల రూపాయల ఆర్థిక సాయం చేశారు.

మారిన 10వ తరగతి తెలుగు ప్రశ్న పత్రానికి ప్రిపరేషన్ అలాగే ప్రశ్నపత్రంలో ఉండే వివరాలను దిన పత్రికల ద్వారా సేకరించిన సమాచారాన్ని స్పీడ్ జాబ్  అలర్ట్స్ . బ్లాగ్ స్పాట్  . కామ్ లో చూడొచ్చు.

వ్రాత పరీక్ష ద్వారా స్వామి వివేకానంద నేషనల్ ఇన్ స్టిట్యూట్ లో ఉద్యోగాలు 
మొత్తం ఖాళీలు 9
దరఖాస్తుకు చివరి తేది జులై 7
విభాగాల  వారీగా
ఆడిట్ ఆఫీసర్ 1
స్టాఫ్ నర్స్5
మహిళా హాస్టల్ వార్డెన్  1
జూనియర్ అసిస్టెంట్ 2
అర్హత
ఆడిట్ ఆఫీసర్ - బి కాం తో పాటు అకౌంటింగ్ లో అనుభవం ఉండాలి
స్టాఫ్ నర్స్ - బి ఎస్సి నర్సింగ్ లేదా డిప్లొమా లో జనరల్ నర్సింగ్ మరియు స్టేట్ నర్సింగ్  కౌన్సిల్ లో మిడ్ వైఫరీగా రిజిస్టర్ అయి, అనుభవం ఉండాలి
మహిళా  హాస్టల్ వార్డెన్ - 1st క్లాస్ లేదా హైయర్ 2nd క్లాస్ లో గ్రాడ్యుయేట్ అయుండాలి
జూనియర్ అసిస్టెంట్ - గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి అనుభవం ఉండాలి.
వయసుః
ఆడిట్ ఆఫీసర్ 35
సిబ్బంది నర్స్ 30
మహిళా హాస్టల్ వార్డెన్  35 నుండి 40
జూనియర్ అసిస్టెంట్ 40
http://www.svnirtar.nic.in/


వ్రాత పరీక్శ ఇంటర్వ్యూ ఆధారంగా హెచ్‌పీసీఎల్ లోఉద్యోగాలు
విభాగాలు - ఇంజినీర్, ఫైనాన్, లీగల్
ఖాళీలు - 71
అర్హత -  ఉద్యోగాన్ని బట్టి ఇంజినీర్ కు డిగ్రీ లేదా బి టెక్, ఫైనాన్స్ కు సి ఎ లేదా ఎం బి ఎ లీగల్ కు పి జి లేదా లా
వయసు - 35
దరఖాస్తుకు చివరి తేది మే 31
https://hrrl.in/

ఆంధ్రప్రదేశ్ హై కోర్టులో ఉద్యోగాలు దరఖాస్తుకు చివరి తేది మే 26
మొత్తం ఖాళీలు 12
ఉద్యోగాలు - సిస్టమ్ ఆఫీసర్, సిస్టమ్ అసిస్స్టెంట్
విద్యార్హత - డిప్లొమా, ఐ టి ఐ, బి ఎస్సి, బి టెక్, సంబంధిత సబ్జెక్టుల్లో పి జి
hc.ap.gov.in



ఆన్ లైన్ అప్లికేషన్ సేవలు ఇంటి వద్దనుండే పొందండి ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | అప్లికేషన్ ఆన్ లైన్ ద్వారా చేయించాలనుకునే వారు మతో మాట్లాడి గూగుల్ పే/ఫోన్ పే ద్వారా గాని రూ.100/-లను 9640006015 కు చెల్లించి, సేవలను పొందచ్చు. దీని కోసం వ్యక్తి కి వాట్సాప్ ఛాటింగ్ ద్వారా మేము పంపే ప్రశ్నలకు సమాధానాలు పంపూతూ ఉంటే చాలు, అప్లికేషన్ ను సబ్మిట్ చేసే ముందు మేము పంపే స్ర్కీన్ షాట్ లను సరిచూసుకుని, అన్ని సరిపోయాయంటే అప్లికేషన్ ను ఫైనల్ సబ్మిట్ చేస్తాము.
అయితే నిర్ణీత అప్లికేషన్ ఫీజును చెల్లించుటకు మాత్రం మీ ATM ఉండాల్సిందే (మా వద్ద ATM లేదు) మా ఫోన్ నెంబరు 9640006015.




 


18, మే 2020, సోమవారం

Jr Assistant Jobs | స్వామి వివేకానంద నేషనల్ ఇన్‌సిట్యూట్ లో జాబ్స్


స్వామి వివేకానంద నేషనల్ ఇన్‌సిట్యూట్ లో ఉద్యోగాలు :

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులకు ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన స్వామి వివేకానంద నేషనల్ ఇన్‌సిట్యూట్ ఆఫ్ రిహబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రిసెర్చ్ సెంటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రావడం జరిగింది. మంచి శాలరీ ఉంటుంది. తప్పనిసరిగా అప్లై చేసుకోండి. 

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ11-07-2020

మొత్తం ఖాళీలు:

09

విభాగాల వారిగా ఖాళీలు:

ఆడిట్ ఆఫీసర్1
సిబ్బంది నర్స్5
హాస్టల్ వార్డెన్ (ఆడ)1
జూనియర్ అసిస్టెంట్2

అర్హత:

ఆడిట్ ఆఫీసర్B.com తో పాటు అకౌంటిగ్ లో అనుభవం ఉండాలి.
సిబ్బంది నర్స్B.Sc (నర్సింగ్) లేదా డిప్లొమా లో జనరల్ నర్సింగ్ మరియు స్టేట్ నర్సింగ్ కౌన్సిలో మిడ్ వైఫరిగా రిజిస్టర్ అయి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. మరియు అనుభవం ఉండాలి.
హాస్టల్ వార్డెన్ (ఆడ)ఫస్ట్ క్లాస్/హైయర్ 2nd క్లాస్/ఏ విభాగం లో అయిన గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. మరియు అనుభవం ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.
జూనియర్ అసిస్టెంట్గ్రాడ్యూయేట్ పూర్తి చేసి ఉండాలి మరియు అనుభవం ఉండాలి.

జీతం:

ఆడిట్ ఆఫీసర్44,900/- To 42,400/-
సిబ్బంది నర్స్44,900/- To 42,400/-
హాస్టల్ వార్డెన్ (ఆడ)35,400/- To 1,12,400/-
జూనియర్ అసిస్టెంట్25,500/- To 81,100/-

వయస్సు:

ఆడిట్ ఆఫీసర్35
సిబ్బంది నర్స్30
హాస్టల్ వార్డెన్ (ఆడ)35 To 40
జూనియర్ అసిస్టెంట్40

ఎలా ఎంపిక చేస్తారు:

రాతపరీక్ష (ఆబ్జెక్టివ్ / బహుళ ఎంపిక ప్రశ్నలు)80%
కావలసిన అర్హత10%
అనుభవం10%
శాతం తో ఎంపిక విధానం ఉంటుంది.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఆఫ్‌లైన్ లో అప్లై చేసుకోవాలి. పోస్ట్ ద్వారా దరఖాస్తు ఫారం పంపవలసి ఉంటుంది.

చిరునామ:

The Director Swami Vivekanand National Institute of Rehabilitation Training and Research Olatpur post: Bairoi. Dist: Cuttak Odisha PIn 754010

మీకు కావలసిన జాబ్ కామెంట్ రాయండి, మీ ప్రెండ్స్ కి షేర్ చెయ్యండి.
Website
Notification

ఎల్ ఐ సిలో ఇద్యోగాలు | LIC Jobs

ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్( NLC India) లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు క్రింద చూడండి:

జాబ్ :ఎగ్జిక్యూటివ్ ట్రైనీ
ఖాళీలు :259
అర్హత :Degree/CA/MBA, PG/M.Tech.
వయసు :30 ఏళ్లు మించకూడదు.
వేతనం :రూ.50,000-1,80,000/-
ఎంపిక విధానం:రాత పరీక్ష ,ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ 5,00/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌.
దరఖాస్తులకు ప్రారంభతేది:మే 16, 2020
దరఖాస్తులకు చివరితేది:మే 30, 2020
వెబ్‌సైట్‌:Click Here
నోటిఫికేషన్:Click Here

.

HPCL లో ఉద్యోగాలు

హెచ్‌పీసీఎల్ లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు క్రింద చూడండి:

జాబ్ :ఇంజ‌నీర్, ఫైనాన్స్‌, లీగ‌ల్‌
ఖాళీలు :71
అర్హత :Degree/B.Tech,
CA/MBA, PG/LAW
వయసు :35 ఏళ్లు మించకూడదు.
వేతనం :రూ.40,000-2,00,000/-
ఎంపిక విధానం:రాత పరీక్ష ,ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ 500/- ,
ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌.
దరఖాస్తులకు ప్రారంభతేది:మే 16, 2020
దరఖాస్తులకు చివరితేది:మే 31, 2020
వెబ్‌సైట్‌:Click Here
నోటిఫికేషన్:Click Here
The last date of the online application revised to 31st May 2020.
ముఖ్య గమనిక: ఇక్కడ పోస్ట్ చేసిన ఉద్యోగాలకు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ ని పూర్తిగా చదువుకొని అప్లై చెయ్యండి అని మా మనవి. అలాగే మీకు ఏమైనా సందేహం ఉంటె ఈ పోస్ట్ క్రింద కామెంట్ రూపంలో తెలియజేయండి.

Recent

Uncertainty Over Results: Delays in Group Exams and TET Concerns Among Teachers తేలని ఫలితాలు: గ్రూప్ పరీక్షల జాప్యం మరియు టెట్‌పై ఉపాధ్యాయుల ఆందోళన

TET ISSUE సైన్స్/మ్యాథ్స్ టీచర్లు టెట్ (TET) లో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏమిటి? ...