Alerts

Loading alerts...

27, మే 2020, బుధవారం

Indian Army Jobs

ఇండియ‌న్ ఆర్మీలో సోల్జ‌ర్ పోస్టుల భ‌ర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
సోల్జ‌ర్ పోస్టులు: 06
అర్హ‌త‌: 
ఇంట‌ర్మీడియేట్ ఉత్తీర్ణ‌త‌
వ‌య‌సు: 23 ఏళ్లు మించ‌కూడ‌దు

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: జూన్ 30, 2020

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌

నార్త‌ర‌న్ రైల్వే రిఫ్రాక్ష‌నిస్ట్ పోస్టులు | Northern Railway Jobs

నార్త‌ర‌న్ రైల్వే రిఫ్రాక్ష‌నిస్ట్ పోస్టుల భ‌ర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
రిఫ్రాక్ష‌నిస్ట్ పోస్టులు
అర్హ‌త‌:
బ‌్యాచిల‌ర్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: జూన్ 10, 2020

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌

AICTE FREE E LEARNING COURSES

అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఉచితంగా ఈ-లెర్నింగ్ కోర్సులు అందిస్తోందని ఆ సంస్థ జాతీయ చీఫ్ కో ఆర్డినేటింగ్ ఆఫీసర్ బుద్ధా చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఉచితంగా ఈ కోర్సులు అందించేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయని తమ వెబ్‌సైట్స్ వేదికగా వీటిని అందిస్తున్నామని చెప్పారు. మే 15లోపు రిజిస్టర్ చేసుకున్న విద్యార్ధులు వీటిని ఉచితంగా పొందవచ్చు. ప్రస్తుతం 26 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. డేటా అనలిటిక్స్ టెస్టింగ్, బిగ్ డేటా, ఆర్ ప్రోగ్రామింగ్, జావా, డేటా సైన్స్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ వంటి పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి అని చెప్పారు. వెబ్‌సైట్ www.free.aicte-india.org .

JEE MAINS EXAM DETAILS

జూలై 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్న జేఈఈ మెరుున్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు జూలై మొదటి వారంలో హాల్‌టికెట్లను జారీ చేసేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఏర్పాట్లు చేస్తోంది.

ఏప్రిల్‌లో జరగాల్సిన ఈ పరీక్షలను కరోనా నేపథ్యంలో జూలైకి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. పరీక్ష తేదీలను ఇదివరకే ప్రకటించిన ఎన్‌టీఏ తాజాగా దానిపై అధికారిక నోటీసు జారీ చేసింది.
పరీక్షలు నిర్వహించే నిర్ణీత తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక షిఫ్ట్, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు రెండో షిప్ట్ పరీక్ష ఉంటుందని పేర్కొంది. విద్యార్థుల పరీక్ష కేంద్రాల వివరాలతో కూడిన హాల్‌టికెట్లను పరీక్ష ప్రారంభానికి 15 రోజుల ముందుగా జారీ చేస్తామని వెల్లడించింది. జూలై 26వ తేదీన నిర్వహించనున్న నీట్ హాల్‌టికెట్లను కూడా 15 రోజుల ముందుగా వెబ్‌సైట్ అందుబాటులో ఉంచుతామని తెలిపింది.
మాక్ టెస్టులకోసం యాప్జేఈఈ, నీట్‌కు సిద్ధమయ్యే విద్యార్థులు ఆన్‌లైన్ పరీక్షలను ప్రాక్టీస్ చేసుకునేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ) మాక్ టెస్టులను అందుబాటులోకి తీసుకువచ్చింది. నేషనల్ టెస్ట్ అభ్యాస్ పేరుతో మొబైల్ యాప్‌ను అందుబాటులో ఉంచింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి దీనిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో https://www.nta.ac.in/Abhyas కూడా విద్యార్థులు ప్రాక్టీస్ చేసుకోవచ్చని వివరించింది.

ఆంధ్రప్రదేశ్ లో ఏ సెట్ ఎప్పుడు | తేదీల వివరాలు

ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ తదితర సాంకేతిక, వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి నిర్వహించాల్సిన ఎంసెట్-2020 ఆన్‌లైన్ పరీక్షలు జూలై 27 నుంచి 31 వరకు జరగనున్నాయి.
అలాగే ఇతర కోర్సుల ప్రవేశ పరీక్షల షెడ్యూళ్లలో కూడా మార్పులు చేశారు. ఈ మేరకు సవరించిన వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూళ్లను ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్ ప్రేమ్‌కుమార్ మే 6న విడుదల చేశారు. ఎంసెట్ పరీక్షలను ఏప్రిల్ 20 నుంచి 24 వరకు నిర్వహించేలా షెడ్యూల్‌ను గతంలో ఉన్నత విద్యామండలి ప్రకటించిన విషయం తెలిసిందే. వాటితో పాటు ఈసెట్, ఐసెట్, పీజీసెట్, లాసెట్, ఎడ్‌సెట్, పీఈసెట్ తదితర సెట్ల తేదీలను కూడా విడుదల చేసింది. అయితే కరోనా, లాక్‌డౌన్‌లతో ప్రవేశ పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో వాటిని విద్యామండలి నిరవధికంగా అప్పట్లో వాయిదా వేసింది. ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్ తదితర జాతీయ విద్యాసంస్థల్లోకి నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. తాజాగా జేఈఈ మెయిన్స్ ఆన్‌లైన్ పరీక్షలను జూలై 18 నుంచి 23 వరకు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజనీరింగ్ తదితర కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన ఎంసెట్ ఇతర సెట్ల నిర్వహణకు వీలుగా షెడ్యూళ్లను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఇప్పటికే ఈ ప్రవేశ పరీక్షలకు ఆన్‌లైన్ దరఖాస్తు గడువును మే 20 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఎంసెట్‌కు 2,48,614 దరఖాస్తులు అందాయి. వీటిలో ఇంజనీరింగ్‌కు 1,69,137, అగ్రి,మెడికల్‌కు 78,959, రెండింటికీ 518 దరఖాస్తులు వచ్చాయి.

తాజా షెడ్యూళ్లు ఇలా

పరీక్ష

తేదీ

ఈసెట్

జూలై 24

ఐసెట్

జూలై 25

ఎంసెట్

జూలై 27 - 31 వరకు

పీజీసెట్

ఆగస్టు 2 - 4 వరకు

ఎడ్‌సెట్

ఆగస్టు 5

లాసెట్

ఆగస్టు 6

పీఈసెట్

ఆగస్టు 7- 9 వరకు (ఫీల్డ్ టెస్టు మాత్రమే)

NBPGR VACANCIEA | ఎన్‌బిపిజిఆర్ రిక్రూట్‌మెంట్

ఎన్‌బిపిజిఆర్ రిక్రూట్‌మెంట్ 2020 రీసెర్చ్ అసోసియేట్ III, ప్రాజెక్ట్ అసోసియేట్ I, సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ - 12 పోస్టులు www.nbpgr.ernet.in చివరి తేదీ 15-06-2020



సంస్థ పేరు లేదా కంపెనీ పేరు: నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జన్యు వనరులు


మొత్తం ఖాళీల సంఖ్య: 12 పోస్టులు


ఉద్యోగ పాత్ర లేదా పోస్ట్ పేరు: రీసెర్చ్ అసోసియేట్ III, ప్రాజెక్ట్ అసోసియేట్ I, సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్


విద్యా అర్హత: ఏదైనా డిగ్రీ, పిజి, పిహెచ్‌డి (సంబంధిత క్రమశిక్షణ)


ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు: ఆల్ ఇండియా


చివరి తేదీ: 15-06-2020


వెబ్సైట్: http: //www.nbpgr.ernet.in



బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ | Bank of India Recruitment

బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ 2020 06 పోస్టులు bankofindia.co.in చివరి తేదీ 30 మే 2020

సంస్థ పేరు లేదా కంపెనీ పేరు: బ్యాంక్ ఆఫ్ ఇండియా


మొత్తం ఖాళీల సంఖ్య: 06 పోస్టులు


ఉద్యోగ పాత్ర లేదా పోస్ట్ పేరు: 1. ఆఫీస్ అసిస్టెంట్ - 02

2. ఫ్యాకల్టీ సభ్యుడు - 03

3. అటెండర్ - 01

విద్యా అర్హత: 10 వ / గ్రాడ్యుయేషన్ డిగ్రీ


ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు: ఆల్ ఇండియా


చివరి తేదీ: 30 మే 2020


ఎలా దరఖాస్తు చేయాలి: అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులందరూ 2020 మే 30 లోపు లేదా అంతకుముందు కింది చిరునామాకు సంబంధిత టెస్టిమోనియల్స్ (వివరణాత్మక ప్రకటనలో పేర్కొనబడింది) తో పాటు దరఖాస్తు యొక్క హార్డ్ కాపీని పంపాలి.

చిరునామా -బ్యాంక్ ఆఫ్ ఇండియా, కొల్లాపూర్ జోనల్ ఆఫీస్, 1519 సి, జయధవాల్, బిల్డింగ్, లక్ష్మీపురి, కొల్లాపూర్.

వెబ్సైట్: https: //bankofindia.co.in


Recent

District Judiciary of Andhra Pradesh Recruitment 2025–26: Document Verification Schedule & Provisionally Selected Candidates List Released ఆంధ్రప్రదేశ్ జిల్లా న్యాయవ్యవస్థ నియామకాలు 2025–26: డాక్యుమెంట్ వెరిఫికేషన్ షెడ్యూల్ & ప్రొవిజనల్ ఎంపిక జాబితా విడుదల

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...