Alerts

Loading alerts...

9, జూన్ 2020, మంగళవారం

🌻ఈనాడు, అమరావతి: Door Darshan Classes for Bridge Course

కరోనా నేపథ్యంలో విద్యార్థుల బోధనకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు బుధవారం నుంచి 1-10తరగతులకు దూరదర్శన్‌ సప్తగిరి ఛానల్‌ ద్వారా పాఠాలు ప్రసారం చేయనున్నారు. 1-5 తరగతులకు   బ్రిడ్జి కోర్సు, 6-9 తరగతులకు సబ్జెక్టు పాఠాలను బోధిస్తారు. పిల్లలకు వచ్చే సందేహాలను నివృత్తి చేసేందుకు వారానికోసారి ఉపాధ్యాయులు పాఠశాలలకు రానున్నారు. టీవీ పాఠాలపై ఏవైనా సందేహాలు వస్తే విద్యార్థులు ఆ రోజుల్లో పాఠశాలలకు రావచ్చు. 1-5 విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన బ్రిడ్జి కోర్సు పుస్తకాలను మంగళవారం వారికి అందించనున్నారు. ఆంగ్ల మాధ్యమం విధానంలోనే ఆంగ్లం, గణితం, తెలుగు సబ్జెక్టులు బోధిస్తారు. 1, 2 తరగతులకు ఉదయం 11 గంటల నుంచి 11.30 గంటలు,   3, 4, 5 తరగతులకు 11.30 గంటల నుంచి 12 గంటల వరకు తరగతులు ఉంటాయి. 6-9 తరగతులకు అన్ని సబ్జెక్టులను బోధిస్తారు. 6, 7 తరగతులకు మధ్యాహ్నం 2గంటల నుంచి 3గంటల వరకు, 8, 9 తరగతులకు మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తరగతులు ప్రసారమవుతాయి. జూన్‌ నెల చివరి వరకు ఈ తరగతులు నిర్వహిస్తారు. పదోతరగతి విద్యార్థులకు ప్రస్తుతం నిర్వహిస్తున్న రెండు గంటల కార్యక్రమాన్ని కొనసాగిస్తారు.

* 1-5 తరగతులకు పాఠాలు బోధించే ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులకు వచ్చే సందేహాలను నివృత్తి చేసేందుకు ఈ నెల 16 నుంచి ప్రతి మంగళవారం పాఠశాలకు హాజరుకావాలి.

* 6-7 తరగతుల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు 17వ తేదీ నుంచి ప్రతి బుధవారం పాఠశాలలకు వెళ్లాలి.

* 8-9 తరగతులకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుడు 19 నుంచి ప్రతి శుక్రవారం పాఠశాలకు హాజరు కావాలి.

* పదో తరగతి ఉపాధ్యాయులు ప్రతి బుధవారం, శుక్రవారం బడులకు వెళ్లాల్సి ఉంటుంది.

* ఉపాధ్యాయులు విద్యార్థుల వర్క్‌షీట్లను మూల్యాంకనం చేయాలి.

🌻అమరావతి, ఆంధ్రప్రభ: | Degree Colleges Should submit their details

రాష్ట్రంలో ఉన్న డిగ్రీ కళాశాల నీ తమ వివరాలను ఉన్నత విద్యామండలికి సమర్పించాలని కార్యదర్శి ప్రొ. బి. సుధీర్ ప్రేమ్ కుమార్ సూచించారు. వివరాలు కళాశాలలకు సమర్పించిన మాత్రమే అడ్మిషన్లు చేసుకునే అవకాశం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆన్లైన్ వివరాలు సమర్పించేందుకు ఈ నెల పదో తేదీ వరకు గడువు పొడిగించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 130 ప్రభుత్వడి గ్రీ కళాశాలలు, 105 ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలు, 1015 ప్రైవేట్ అన్ ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలు వివరాలు సమర్పించాయని వివరించారు. ఇంకా 21 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 23 ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలు, 188 ప్రైవేటు అన్ ఎయిడెడ్ కళాశాలలు వివరాలు అందజేయాల్సి ఉందని పేర్కొన్నారు. కళాశాలలను ఆన్ లైన్ లో సూచించిన ఫార్మాట్ మేరకు తప్పనిసరిగా వివరాలు అందజేయాల్సి ఉంటుందని సూచించారు. అటానమస్ కళాశాలలు, మైనారిటీ కళాశాలలు కూడా ఈ నెల పదో తేదీ లోపు వివరాలు అప్లోడ్ చేయాలని పేర్కొన్నారు. అలా చేయని కళాశాలలు 2020- 21 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు చేపట్టడానికి వీలు ఉండదని ప్రొబి. సుధీర్ ప్రేమ్ కుమార్ స్పష్టం చేశారు.

🌻సాక్షి, అమరావతి: PG Medical Admission Date Extended

దేశవ్యాప్తంగా పీజీ వైద్య విద్య అడ్మి షన్ల గడువు జూలై 31 వరకు పొడిగించారు. కోవిడ్ కార లంగా తీవ్ర అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో భారతీ య వైద్య మండలి అడ్మిషన్ల గుడువు పొడిగించాలని కో రుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు జూలై 31 వరకు గడువు పొడిగిస్తూ సుప్రీం కోర్టు ఆదేశించినట్టు భారతీయ వైద్య మండలి సోమవారం ప్రకటించింది.తాజా ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో కూడా పీజీ వైద్య విద్య అడ్మిషన్ల గడువు జూలై 31 వరకు పెంచారు.

🌻 అమరావతి, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి): | Food Safety Selection List

ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్స్‌ ప్రొవిజినల్‌ సెలెక్షన్‌ జాబితాను ఏపీపీఎస్సీ సోమవారం విడుదల చేసింది. అలాగే, ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్స్‌, అసిస్టెంట్‌ ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్స్‌ ప్రొవిజినల్‌ అడ్మిటెడ్‌ జాబితాను కూడా విడుదల చేసింది. ఆయా అభ్యర్థులకు 1:2 నిష్ఫత్తిలో నడక, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహించనున్నారు. కమిషన్‌ వెబ్‌సైట్‌ తో పాటు నోటీసు బోర్డులో అభ్యర్థుల జాబితా ఉంచామని, వాకింగ్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఎప్పుడు జరిగేదీ త్వరలో తెలియజేస్తామని ఏపీపీఎస్‌ కార్యదర్శి  పి.ఎ్‌స.ఆర్‌.ఆంజనేయులు తెలిపారు. అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్స్‌ ప్రొవిజినల్‌ అడ్మిటెడ్‌ జాబితాను కూడా విడదుల చేసినట్లు పేర్కొన్నారు. ఆయా జాబితాలను కమిషన్‌ వెబ్‌సైట్‌ (https://psc.ap.gov.in)లో అందుబాటులో ఉంచారు.

☝️అమరావతి, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి) | One Fee Structure in Degree Colleges


 రాష్ట్రంలోని ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీల్లో ఒకే తరహా ఫీజు విధానం అమల్లోకి రానుంది. 2020-21 విద్యా సంవత్సరం నుంచి మూడేళ్ల కాలానికి కొత్త ఫీజులను ఖరారు చేసేందుకు రాష్ట్ర ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ సిద్ధమవుతోంది. సంప్రదాయ డిగ్రీ కోర్సులకు సంబంధించిన ఫీజుల్లో వ్యత్యాసం ఉండరాదన్న ఉద్దేశంతో కమిషన్‌ ఏకరూప ఫీజును నిర్ణయించాలని నిశ్చయించింది. మరో వారం రోజుల్లో కొత్త ఫీజుల నిర్ణయ ప్రక్రియ పూర్తి చేయనుంది. రాష్ట్రంలో మొత్తం 1,441 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. వీటిలో 1,153 ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌ కాలేజీలు, 137 ఎయిడెడ్‌ కాలేజీలు, 151 ప్రభుత్వ కాలేజీలు ఉన్నాయి. ఎయిడెడ్‌, ప్రభుత్వ కాలేజీలకు కళాశాల విద్య కమిషనరేట్‌(సీసీఈ) ఫీజులను నిర్ణయిస్తుంది. ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీలకు మాత్రం తొలిసారిగా ఉన్నత విద్య నియంత్రణ కమిషన్‌ ఫీజులను నిర్ణయించనుంది. ఒకేతరహా ఫీజు ఎలా ఉండాలన్న దానిపై రెండు రకాలుగా ఆలోచనలు పరిశీలనలో ఉన్నాయని కమిషన్‌ సెక్రెటరీ ఎన్‌.రాజశేఖరరెడ్డి తెలిపారు. ఒకటి.. రాష్ట్రంలోని అన్ని కాలేజీలకు ఒకే రకమైన ఫీజును నిర్ణయించడం. రెండోది.. కాలేజీలను రెండు లేదా మూడు కేటగిరీలుగా విభజించి ఫీజులను నిర్ణయించడమని చెప్పారు.

🤝♦సంక్షేమం’లో సరికొత్త ఒరవడి | AP Govt. Services becoming fast

🔸సంక్షేమ పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఒరవడికి శ్రీకారం చుడుతోంది. ప్రభుత్వ సేవలన్నీ గ్రామ, వార్డు సచివాలయాల్లో నిర్దిష్ట కాలపరిమితితో అర్హులందరికీ అందించే కార్యక్రమాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ మంగళవారం ప్రారంభించనున్నారు

🔹ఈ కొత్త విధానం ప్రకారం..దరఖాస్తు చేసిన పదిరోజుల్లోనే బియ్యం కార్డు, పది రోజుల్లో పింఛన్‌ కార్డు,  20 రోజుల్లో ఆరోగ్యశ్రీ కార్డు, 90 రోజుల్లో అక్కచెల్లెమ్మల పేరుతో ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్‌ చేసి అప్పగిస్తారు.

► ప్రధాన సేవలతోపాటు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 541 రకాల సేవలు నిర్దిష్ట కాలపరిమితితో ప్రజలకు అందనున్నాయి. లబ్ధిదారుల జాబితా, అర్హతలు, లబ్ధిపొందే విధానం వంటి  వివరాలను అక్కడ ఏర్పాటుచేస్తారు.

► దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను వలంటీర్లు నిర్దిష్ట కాలపరిమితిలో పరిశీలన పూర్తిచేస్తారు. వాటికి సంబంధించిన సంక్షేమ ఫలాలను లబ్ధిదారుల ఇంటికే వెళ్లి అందజేస్తారు.

► ఇందుకు సంబంధించిన సలహాలు, సూచనలు, ఫిర్యాదులను 1902 టోల్‌ ఫ్రీ నంబర్‌కు తెలియజేయవచ్చు.
 
► వ్యవసాయ అనుబంధ సేవలకు 1907కు, టెలి మెడిసిన్‌ సేవలకు 14410, అవినీతిపై ఫిర్యాదులు 14400, దిశ 181, మద్యం అక్రమ తయారీ, అమ్మకం, రవాణా, ఇసుకపై ఫిర్యాదులను 14500కు ఫోన్‌ చేయవచ్చు.

GEMINI TIMES | 09-06-2020 | HINDUPUR

NCERT ఆధ్వర్యంలోని సెంట్ర్ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ కింద సాంకేతిక సిబ్బంది నియామకం
ఉద్యోగాలుః- వీడియో ఎడిటర్, గ్రాఫిక్ అసిస్టెంట్, ప్రొడక్షన్ అసిస్టెంట్ (విడియో), సౌండ్ టెక్నీషియన్ / రికార్డిస్టు, కెమెరా పర్సన్స్, ప్రొడక్షన్ అసిస్టెంట్ (వీడియో), యాంకర్ (వీడియో)
ఇంటర్వ్యూ తేదీలుః- జూన్ 16 నుంచి 19 వరకు


Recent

District Judiciary of Andhra Pradesh Recruitment 2025–26: Document Verification Schedule & Provisionally Selected Candidates List Released ఆంధ్రప్రదేశ్ జిల్లా న్యాయవ్యవస్థ నియామకాలు 2025–26: డాక్యుమెంట్ వెరిఫికేషన్ షెడ్యూల్ & ప్రొవిజనల్ ఎంపిక జాబితా విడుదల

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...