14, డిసెంబర్ 2020, సోమవారం

ప్రభుత్వ ఉద్యోగాల వివరాలు

 

AP Dsc 2020 Recruitment News Update || డీఎస్సి నోటిఫికేషన్ విడుదలపై కీలక అప్డేట్

 

డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలపై కీలక అప్డేట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల భర్తీ కీ సంబంధించిన టీచర్ రిక్రూట్మెంట్ డీఎస్సి నిర్వహణకు సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రకటన వచ్చినది.

ఈ తాజా ప్రకటనతో ఏపీ లో నూతన డీఎస్సీ నోటిఫికేషన్  విడుదలకు రంగం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో  మిగిలిపోయిన బ్యాక్ లాగ్ టీచర్ పోస్టుల భర్తీకి త్వరలో డీఎస్సీ నిర్వహించడానికి ఏపీ విద్యాశాఖ ప్రణాళికలు రచిస్తుంది.

దీనిలో భాగంగా ఏపీ విద్యాశాఖ జిల్లాల వారీగా ఖాళీల వివరాలను సేకరిస్తుండగా, రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీల్లో సుమారు 403 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం.

ఈ పోస్టులను భర్తీ చేయడానికి త్వరలో ఏపీ లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏపీ విద్యా శాఖ సన్నాహాలు చేస్తుంది.

13, డిసెంబర్ 2020, ఆదివారం

NEET Exams Latest Update in telugu || నీట్ పరీక్ష రద్దుపై కీలక నిర్ణయం

జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలైన నీట్ మరియు జేఈఈ ఈ5పరీక్షల నిర్వహణకు సంబంధించిన ముఖ్యమైన ప్రకటనను  కేంద్ర విద్యా శాఖ తెలియచేసినది.

రాబోయే సంవత్సరం 2021 లో వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహించబోయే ప్రవేశ పరీక్ష నీట్ -2021 పరీక్షను ఎట్టి పరిస్థితులలోనూ వాయిదా వేసే ప్రసక్తి లేదని  నేడు కేంద్ర విద్యా శాఖ ఒక ప్రకటన ద్వారా తెలియచేసినది.

కరోనా వైరస్ నేపథ్యంలో నీట్ పరీక్ష ను రద్దు చేయాలనే విజ్ఞప్తులు వస్తున్న నేపథ్యంలో నీట్ మరియు జేఈఈ పరీక్షల నిర్వహణ పై జరిపిన రివ్యూ మీటింగ్ లో నీట్ పరీక్ష 2021 నిర్వహణ పై కేంద్ర విద్యా శాఖ తమ తాజా నిర్ణయాన్ని ప్రకటించింది.

రాబోయే నీట్ 2021 పరీక్షను ఆన్లైన్ లో నిర్వహించేలా కేంద్ర విద్యాశాఖ ప్రణాళికలు రచిస్తుంది.

ఇకపై ప్రతీ సంవత్సరం జేఈఈ పరీక్షలను ఏడాదికి రెండు సార్లు నిర్వహించడానికి కూడా ఈ రివ్యూ మీటింగ్ లో కేంద్ర విద్యా శాఖ సమాలోచనలు జరిపింది.

website