Alerts

--------

5, జనవరి 2021, మంగళవారం

Anantapuramu District Classifieds

 

ఐఓసీఎల్‌లో 47 నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు.. చివరి తేది జనవరి 15

భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్) పైప్‌లైన్స్ విభాగంలో నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Jobs వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 47
పోస్టుల వివరాలు: ఇంజనీరింగ్ అసిస్టెంట్(మెకానికల్, ఆపరేషన్స్, ఎలక్ట్రికల్, టీ-ఐ)-27, టెక్నికల్ అటెండెంట్-20.
అర్హతలు:
  • ఇంజనీరింగ్ అసిస్టెంట్ (మెకానికల్): కనీసం 55శాతం మార్కులతో మెకానికల్/ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల ఫుల్‌టైం డిప్లొమా/లేటరల్ ఎంట్రీ డిప్లొమా ఉత్తీర్ణలవ్వాలి.
  • ఇంజనీరింగ్ అసిస్టెంట్ (ఎలక్ట్రికల్): కనీసం 55శాతం మార్కులతో ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల ఫుల్‌టైం డిప్లొమా/లేటరల్ ఎంట్రీ డిప్లొమా ఉత్తీర్ణలవ్వాలి.
  • ఇంజనీరింగ్ అసిస్టెంట్ (టీ-ఐ): కనీసం 55శాతం మార్కులతో ఈసీఈ/ఈటీఈ /ఐసీఈ/ఐపీసీఈ/ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల ఫుల్‌టైం డిప్లొమా/లేటరల్ ఎంట్రీ డిప్లొమా ఉత్తీర్ణలవ్వాలి.
  • ఇంజనీరింగ్ అసిస్టెంట్(ఆపరేషన్స్): కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో మూడేళ్ల ఫుల్‌టైం డిప్లొమా ఇంజనీరింగ్/లేటరల్ ఎంట్రీ డిప్లొమా ఉత్తీర్ణలవ్వాలి.
  • టెక్నికల్ అటెండెంట్: పదోతరగతి, సంబంధిత ట్రేడుల్లో (ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, టర్నర్ తదితరాలు) ఐటీఐ ఉత్తీర్ణలవ్వాలి. సంబంధిత ట్రేడుల్లో ఎస్‌సీవీటీ/ఎన్‌సీవీటీ జారీచేసిన ట్రేడ్ సర్టిఫికేట్/నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి.

వయసు: 22.12.2020 నాటికి కనీస వయసు 18 ఏళ్లకు తగ్గకుండా.. గరిష్ట వయసు 26 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్/ప్రొఫిషియన్సీ/ఫిజికల్ టెస్ట్(ఎస్‌పీపీటీ) ద్వారా ఎంపిక చేస్తారు. స్కిల్/ప్రొఫిషియన్సీ/ఫిజికల్ టెస్ట్(ఎస్‌పీపీటీ)ని కేవలం అర్హత కోసం మాత్రమే నిర్వహిస్తారు. తుది ఎంపిక రాతపరీక్షలో సాధించిన మార్కులు, ఎస్‌పీపీటీలో ఫిట్‌నెస్ ఆధారంగా ఉంటుంది. రాతపరీక్షలో కనీసం 40శాతం మార్కులు సాధించినవారు మాత్రమే ఎస్‌పీపీటీకి అర్హత సాధిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: జనవరి 15, 2021.
పరీక్షా తేది: ఫిబ్రవరి 14, 2021.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.iocl.com

జనవరి4 నుంచి ట్రిపుల్ ఐటీ కౌన్సెలింగ్

అమరావతి/నూజివీడు: ఆర్జీయూకేటీ పరిధిలోని ట్రిపుల్ ఐటీలలో ప్రవేశాల కోసం జనవరి నాలుగో తేదీ నుంచి 11 వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు చాన్సలర్ ఆచార్య కేసీ రెడ్డి తెలిపారు. నూజివీడు, శ్రీకాకుళం, ఇడుపులపాయ, ఒంగోలు ట్రిపుల్ ఐటీలలో చేరేందుకు నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలలో నిర్వహిస్తున్న కౌన్సెలింగ్‌కు ఎక్కడైనా హాజరు కావొచ్చన్నారు. కాగా, 4 ట్రిపుల్ ఐటీల్లో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు అడ్మిషన్ల కౌన్సెలింగ్ నాలుగో తేదీ నుంచి నూజివీడు, ఆర్కేవేలీల్లో జరుగుతుందని వర్సిటీ చాన్సలర్ పేర్కొన్నారు.

Recent

Make Best Use of 'Kala Utsav' Competitions | కళా ఉత్సవ్ పోటీలను సద్వినియోగం చేసుకోండి

Kala Utsav 2026 - Event Details కళా ఉత్సవ్ పోటీలు – Kala Utsav Competitions Event Highlights | పోటీ ముఖ్యాంశాలు ...