11, జనవరి 2021, సోమవారం

Ananthapuramu District Classifieds

 

RRB NTPC Exams 2021 Jan 10th Shift 1 Bits || జనవరి 10వ తేదీన జరిగిన రైల్వే NTPC పరీక్ష షిఫ్ట్-1 లో వచ్చిన బిట్స్

ప్రశ్నలు – జవాబులు :

1). చంద్ర కాంత అనే నవలను రచించినది?

జవాబు : దేవకీ నందన్ ఖత్రి.

2).2019 లో థాయిలాండ్ దేశంలో విధ్వంసం సృష్టించిన తుఫాన్ పేరు?

జవాబు : పాబుక్.

3). కామాక్య మందిర్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో గలదు?

జవాబు : గువహతి ( అస్సాం ).

4). ఇంటర్నేషనల్ అటమిక్ ఎనర్జీ ఏజెన్సీ (IAEA) ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసారు?

జవాబు : 1957.

5). కిడ్నీ లో అతి చిన్న యూనిట్ విభాగాన్ని ఏమని పిలుస్తారు?

జవాబు : నెఫ్రాన్.

6). బోకారో స్టీల్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో కలదు?

జవాబు : ఝార్ఖండ్.

7). నీతి అయోగ్ చైర్మన్ ఎవరు?

జవాబు : భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ.

8). పూనా ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది?

జవాబు : 1932 ( గాంధీజీ మరియు అంబేద్కర్ మధ్య ).

9). GPS సంక్షిప్త నామం?

జవాబు : Global Positioning System.

10). ఝార్ఖండ్ రాష్ట్రం అవతరించిన సంవత్సరం?

జవాబు : నవంబర్ 15,2000.

11). ఖజురాహో ఆలయం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కలదు?

జవాబు : మధ్యప్రదేశ్.

12). లావని సంగీత నృత్యం ఏ రాష్ట్రానికి ప్రసిద్ధి చెందింది?

జవాబు : మహారాష్ట్ర.

13). HTML సంక్షిప్త నామం?

జవాబు : Hyper Text Markup Language.

14). సన్నీ డేస్ పుస్తక రచయిత?

జవాబు : సునీల్ గావస్కర్.

15).ఫిఫా మెన్స్ వరల్డ్ కప్ 2018 లో గోల్డెన్ బూట్ అవార్డు సాధించినది ఎవరు?

జవాబు : హారి కెన్.