➖〰️〰️〰️〰️〰️〰️➖
🟢 TTD News™ తిరుపతి : శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు మంగళవారం రాత్రి 7 నుండి 8 గంటల వరకు పెద్దశేష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు వైకుంఠ నారాయణుడి అలంకారంలో దర్శనమిచ్చారు. కోవిడ్ -19 నేపథ్యంలో వాహనసేవ ఆలయంలో ఏకాంతంగా జరిగింది..
■ ఏడుపడగలు గల ఆదిశేషుడు ఏడుకొండలకు, ఏడు లోకాలకు సంకేతం. శేషుడు శ్రీనివాసునికి తిరుమలలో నివాసభూమి అయినా శ్రీనివాసమంగాపురంలో వాహనరూపంలో శ్రీవారిని స్తుతిస్తూ, స్వామికి మంచం, పరుపు, ఛత్రం మూడూ తానే అయి శేషశాయి అనే పేరును సార్థకం చేస్తున్నారు. శ్రీవారి విశ్రాంతికీ, సుఖనిద్రకూ కారణమవుతున్నాడు.
👉ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ ధనంజయులు, సూపరింటెండెంట్లు శ్రీ రమణయ్య, శ్రీ చెంగల్రాయులు పాల్గొన్నారు.
*Dept.Of PRO TTD.*
అప్లికేషన్ల కోసం సంప్రదించండి GEMINI ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
Alerts
3, మార్చి 2021, బుధవారం
*పెద్దశేష వాహనంపై వైకుంఠ నారాయణుడి అలంకారంలో శ్రీనివాసుడు*
*ఏకాంతంగా శ్రీ కపిలేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు*
➖〰️〰️〰️〰️〰️〰️➖
🟢 TTD News™ తిరుపతి : శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మార్చి 4 నుండి 13వ తేదీ వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలను కోవిడ్ -19 నేపథ్యంలో ఏకాంతంగా నిర్వహించనున్నారు.
🟢 మర్చి 3వ తేదీ సాయంత్రం 4.30 నుండి 6.30 గంటల మధ్య అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
🕉 *బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :*
తేదీ ఉదయం సాయంత్రం
■04-03-2021(గురువారం)
ధ్వజారోహణం(మీనలగ్నం) హంస వాహనం
■ 05-03-2021(శుక్రవారం)
సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
■ 06-03-2021(శనివారం)
భూత వాహనం సింహ వాహనం
■ 07-03-2021(ఆదివారం)
మకర వాహనం శేష వాహనం
■ 08-03-2021(సోమవారం)
తిరుచ్చి ఉత్సవం అధికారనంది వాహనం
■ 09-03-2021(మంగళవారం)
వ్యాఘ్ర వాహనం గజ వాహనం
■ 10-03-2021(బుధవారం)
కల్పవృక్ష వాహనం అశ్వవాహనం
■ 11-03-2021(గురువారం)
రథోత్సవం(భోగితేరు) నందివాహనం
■ 12-03-2021(శుక్రవారం)
పురుషామృగవాహనం కల్యాణోత్సవం, తిరుచ్చి ఉత్సవం
■ 13-03-2021(శనివారం)
శ్రీనటరాజస్వామివారి రావణాసుర వాహనం,
🕉 సూర్యప్రభ వాహనం, త్రిశుల స్నానం. ధ్వజావరోహణం.
👉ఈ సందర్భంగా ప్రతి రోజు ఉదయం 7 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు ఆలయంలో ఏకాంతంగా వాహన సేవలు నిర్వహిస్తారు.
*Dept.Of PRO TTD.*
*మార్చి 4 నుండి 8వ తేదీ వరకు టిటిడిలో వస్త్రాల ఈ -వేలం*
➖〰️〰️〰️〰️〰️〰️➖
🟢 TTD News™ తిరుపతి : తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన 187 లాట్ల వస్త్రాలను మార్చి 4 నుండి 8వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ-వేలం వేయనున్నారు. ఇందులో కొత్తవి, వినియోగించిన వస్త్రాలున్నాయి.
◆ ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429 నంబరును కార్యాలయం వేళల్లో గానీ, రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ www.konugolu.ap.gov.in / www.tirumala.org ను గానీ సంప్రదించగలరు.
*Dept.Of PRO TTD.*
*మార్చి 14న తిరుమలలో అనంతాళ్వారు 967వ అవతారోత్సవం*
➖〰️〰️〰️〰️〰️〰️➖
🟢 TTD News™ తిరుపతి : శ్రీవైష్ణవ భక్తుడు, ఆళ్వారులలో ప్రముఖుడైన శ్రీ అనంతాళ్వారు 967వ అవతారోత్సవాన్ని మార్చి 14వ తేదీన తిరుమలలోని శ్రీవారి ఆలయానికి నైరుతి దిశగా ఉన్న పురుశైవారి తోటలో టిటిడి ఘనంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో అనంతాళ్వార్ బోధనలు, రచనలపై సదస్సు నిర్వహిస్తారు. 16 మంది పండితులు పాల్గొని ఉపన్యసించనున్నారు.
◆ సాధారణంగా అనంతళ్వారు జననం చైత్రమాసంలో తమిళనాడులో సంభవించినా తిరుమలలో ఆయన కాలుమోపిన దినాన్ని అవతారోత్సవంగా వారి వంశీకులు పరిగణిస్తున్నారు.
👉ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా స్థిరపడిన అనంతాళ్వారు వంశీయులు తిరుమలలోని పురశైవారి తోటలో (అనంతాళ్వారు తోట) కలసి ప్రత్యేక పూజలు, దివ్యప్రబంధ పాశుర పారాయణం, ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తారు.
◆ పురాణాల ప్రకారం శ్రీ అనంతాళ్వారు సాక్షాత్తు ఆదిశేషుని రూపంగా మరో శ్రీవైష్ణవ భక్తాగ్రేశ్వరుడు శ్రీరామానుజాచార్యులతో కలిసి అవిర్భవించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రామానుజాచార్యుని అభిమతానుసారమే శిష్యుడైన అనంతాళ్వారు తిరుమలకు వేంచేసి స్వామివారి పుష్ప కైంకర్యానికి శ్రీకారం చుట్టినట్లు పురాణ కథనాలు ఉన్నాయి. అందులో భాగంగానే ఒకనాడు అనంతాళ్వారు నిండు గర్భిణియైన తన భార్యతో కలిసి స్వామివారి ఆలయం చెంత ఒక పూలతోటను ఏర్పాటు చేస్తుండగా బాలుని రూపంలో సాక్షాత్తు వేంకటేశ్వరస్వామి ప్రత్యక్షమయ్యాడు. తాను కాదన్నా తన భార్యకు పనులలో చేదోడువాదోడుగా ఉద్యానవన నిర్మాణంలో సహకరించాడన్న కోపంతో అనంతాళ్వారు ఆ బాలునిపై తన చేతిలో ఉన్న గునపాన్ని విసిరాడు. మరునాడు స్వామివారి మూలవిరాట్టు చుబుకం నుండి రక్తస్రావం చూసి తాను చేసిన పొరపాటుకు పశ్చాత్తాపం చెందాడు. వెంటనే స్వామివారి గాయానికి కర్పూరపు ముద్దను అంటించి తన అపారభక్తిని చాటుకున్నాడు. తద్వారా శ్రీవేంకటేశ్వరస్వామివారి కృపకు పాత్రుడయ్యాడు.
■ నేటికీ స్వామివారి చుబుకానికి కర్పూరాన్ని అంటించడం అనంతాళ్వారు దివ్యగాథను స్ఫురింపచేస్తుంది. అదే విధంగా నేటికీ మహాద్వారం చెంత అనంతాళ్వారు స్వామివారిపై విసిరిన గునపం కూడా భక్తులకు దర్శనమిస్తోంది.
◆ టిటిడి హెచ్‌డిపిపి కార్యదర్శి మరియు ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆచార్య రాజగోపాలన్ ఆధ్వర్యంలో ఈ అవతారోత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
*Dept.Of PRO TTD.*
*ధ్వజారోహణంతో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం*
➖〰️〰️〰️〰️〰️〰️➖
🟢 TTD News™ తిరుపతి : శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారం వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ ఉదయం 8.30 నుండి 8.53 గంటల మధ్య మీనలగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం జరిగింది. కోవిడ్ -19 నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు.
◆ ముందుగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి, అనంత, గరుడ, విష్వక్సేనుల వారిని, గరుడ పటాన్ని ఆలయ ప్రాంగణంలో ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్దకు తీసుకొచ్చారు.
● వేద మంత్రాల నడుమ ధ్వజస్తంభానికి పూజలు చేశారు. అనంతరం మీన లగ్నంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. 18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.
శ్రీ బాలాజి రంగాచార్యులు కంకణబట్టార్‌గా వ్యవహరించారు.
కోవిడ్ నేపథ్యంలో ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు : టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి
◆ శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలను కోవిడ్ నేపథ్యంలో ఏకాంతంగా నిర్వహిస్తున్నామని టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి తెలిపారు. ధ్వజారోహణం సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఈ ఆలయం చాలా చరిత్ర గలదని, విజయనగరరాజులు, అన్నమాచార్య వంశీకులు ఈ ఆలయాభివృద్ధికి ఎంతో సహకారం అందించారని శాసనాల ద్వారా తెలుస్తోందన్నారు. ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయని, మార్చి 6న గరుడసేవ జరుగనుందని, మార్చి 10న ధ్వజావరోహణంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు. లోకకల్యాణం కోసం నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలతో అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు.
🕉 *భక్తుల కోసం తిరుమల శ్రీవారి లడ్డూలు*
ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా 9 రోజుల పాటు తిరుమల శ్రీవారి లడ్డూలను ఆలయంలో భక్తులకు అందుబాటులో ఉంచారు. రోజుకు 3 వేల చొప్పున లడ్డూలను భక్తులకు విక్రయిస్తారు.
👉 ఈ కార్యక్రమంలో టిటిడి జెఈవో శ్రీమతి సదా భార్గవి, ఎస్ఇ శ్రీ జగదీశ్వర్‌రెడ్డి, డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, విఎస్‌వో శ్రీ మనోహర్, ఏఈవో శ్రీ ధనంజయులు, సూపరింటెండెంట్లు శ్రీ రమణయ్య, శ్రీ చెంగల్రాయులు, ఎవిఎస్వో శ్రీ సురేంద్ర, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీనివాసులు, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
*Dept.Of PRO TTD.*
*శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ*
➖〰️〰️〰️〰️〰️〰️➖
🟢 TTD News™ తిరుపతి : శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు సోమవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణం జరిగింది. కోవిడ్ -19 నేపథ్యంలో మార్చి 2 నుండి 10వ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహిస్తారు.
◆ ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం కార్యక్రమాలు నిర్వహించారు.
👉ఈ కార్యక్రమంలో టిటిడి జెఈవో శ్రీమతి సదా భార్గవి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, విజిఓ శ్రీ మనోహర్, ఎఇఓ శ్రీ ధనంజయుడు, సూపరింటెండెంట్లు శ్రీ చెంగల్రాయలు, శ్రీ రమణయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
🕉 మార్చి 2న ధ్వజారోహణం
మార్చి 2న మంగళవారం ఉదయం 7 నుండి 8 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు తిరుచ్చి ఉత్సవం జరగనుంది. ఉదయం 8.30 నుండి 8.53 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. రాత్రి 7 నుండి 8 గంటల వరకు పెద్దశేష వాహనసేవ జరగనుంది.
👉ఈ సందర్భంగా ప్రతి రోజు ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 8 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు ఆలయంలో ఏకాంతంగా వాహన సేవలు నిర్వహిస్తారు. గరుడసేవ మాత్రం రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు నిర్వహిస్తారు.
🕉 *బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :*
★తేదీ ★ఉదయం ★రాత్రి
■ 02-03-2021(మంగళవారం)
ధ్వజారోహణం(మీనలగ్నం) పెద్దశేష వాహనం
■ 03-03-2021(బుధవారం)
చిన్నశేష వాహనం హంస వాహనం
■ 04-03-2021(గురువారం)
సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం
■ 05-03-2021(శుక్రవారం)
కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం
■ 06-03-2021(శనివారం)
పల్లకి ఉత్సవం(మోహినీ అవతారం) గరుడ వాహనం
■ 07-03-2021(ఆదివారం)
హనుమంత వాహనం తిరుచ్చి, గజ వాహనం
■08-03-2021(సోమవారం)
సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
■ 09-03-2021(మంగళవారం)
సర్వభూపాల వాహనం అశ్వవాహనం
■ 10-03-2021(బుధవారం)
చక్రస్నానం ధ్వజావరోహణం.
*Dept.Of PRO TTD.*
SBI CBO Recruitment 2020 CBT Test Result, Final Result 2021
Some Useful Important Links | |||||||||||||||
Download Final Result | Click Here | ||||||||||||||
Download Interview Letter | Click Here | ||||||||||||||
Download Result | Click Here | ||||||||||||||
Download Admit Card | Click Here | ||||||||||||||
For Change Exam District | Click Here | ||||||||||||||
Download Change Exam District Notice | Click Here | ||||||||||||||
Apply Online | Registration | Login | ||||||||||||||
Download Notification | Click Here | ||||||||||||||
Official Website | Click Here | ||||||||||||||
Recent
District Judiciary of Andhra Pradesh Recruitment 2025–26: Document Verification Schedule & Provisionally Selected Candidates List Released ఆంధ్రప్రదేశ్ జిల్లా న్యాయవ్యవస్థ నియామకాలు 2025–26: డాక్యుమెంట్ వెరిఫికేషన్ షెడ్యూల్ & ప్రొవిజనల్ ఎంపిక జాబితా విడుదల
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
RRB NTPC CITY INTIMATION LINK https://rrb.digialm.com/EForms/loginAction.do?subAction=ViewLoginPage&formId=94346&orgId=33015 -| ఇలాం...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...