3, మార్చి 2021, బుధవారం

*శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ*

       ➖〰️〰️〰️〰️〰️〰️➖
🟢 TTD News™ తిరుపతి : శ్రీ‌నివాస‌మంగాపురంలోని శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వర‌‌స్వామివారి ఆల‌యంలో వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల‌కు సోమ‌వారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణం జ‌రిగింది. కోవిడ్ -19 నేప‌థ్యంలో మార్చి 2 నుండి 10వ తేదీ వ‌ర‌కు ఈ బ్ర‌హ్మోత్స‌వాలను ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.

◆ ఇందులో భాగంగా సోమ‌వారం సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పుణ్యాహ‌వ‌చ‌నం, మృత్సంగ్ర‌హ‌ణం, సేనాధిప‌తి ఉత్స‌వం, అంకురార్పణం కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.

👉ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి జెఈవో శ్రీమ‌తి స‌దా భార్గ‌వి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి శాంతి, విజిఓ శ్రీ మనోహర్, ఎఇఓ శ్రీ ధనంజయుడు, సూపరింటెండెంట్లు శ్రీ చెంగల్రాయలు, శ్రీ రమణయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

🕉 మార్చి 2న ధ్వ‌జారోహ‌ణం
మార్చి 2న మంగ‌ళ‌వారం ఉదయం 7 నుండి 8 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు తిరుచ్చి ఉత్సవం జర‌గనుంది. ఉదయం 8.30 నుండి 8.53 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. రాత్రి 7 నుండి 8 గంటల వరకు పెద్దశేష వాహనసేవ జర‌గ‌నుంది.

👉ఈ సంద‌ర్భంగా ప్ర‌తి రోజు ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు స్వామి, అమ్మ‌వార్లకు ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న సేవ‌లు నిర్వ‌హిస్తారు. గ‌రుడ‌సేవ మాత్రం రాత్రి 7.30 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హిస్తారు.

🕉 *బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :*

★తేదీ      ★ఉదయం       ★రాత్రి

■ 02-03-2021(మంగ‌ళ‌వారం)
 ధ్వజారోహణం(మీన‌లగ్నం) పెద్దశేష వాహనం
■ 03-03-2021(బుధ‌వారం)
 చిన్నశేష వాహనం హంస వాహనం
■ 04-03-2021(గురువారం)
 సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం
■ 05-03-2021(శుక్ర‌వారం)
కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం
■ 06-03-2021(శ‌ని‌వారం)
పల్లకి ఉత్సవం(మోహినీ అవతారం) గరుడ వాహనం
■ 07-03-2021(ఆదివారం)
 హనుమంత వాహనం తిరుచ్చి, గజ వాహనం
■08-03-2021(సోమ‌వారం)
 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
■ 09-03-2021(మంగ‌ళ‌వారం)
 సర్వభూపాల వాహనం అశ్వవాహనం
■ 10-03-2021(బుధ‌‌వారం)
 చక్రస్నానం ధ్వజావరోహణం.
 *Dept.Of PRO TTD.*

కామెంట్‌లు లేవు: