🌻సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశానికి జాయింట్ ఎంట్రిన్ అడ్వాన్స్డ్-2021 ఎగ్జామినేషన్ పరీక్షను ఈ నిర్వహించనున్నారు జూలై మేరకు 3న పరీష నిర్వహణ సంస్థ.. ఐటీ ఖరగ్ పూర్ షెడ్యూల్ ను ప్రకటించింది. జూలై 3న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1 , మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్షలను ఆన్లైన్లో నిర్వహిస్తారు. అయితే.. పూర్తి వివరాలతో అధికారిక నోటిఫికేషన్ ను విడుదల చేయాల్సి ఉంది కాగా, జేఈఈ మెయినను ఈసారి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మేలో ఆన్లైన్ లో నిర్వహిస్తున్నారు ఫిబ్రవరి సెషన్ కు సంబంధించి ఫలితాలను ఒకటి రెండు రోజుల్లో విడుదల చేయనున్నారు. నాలుగు విడతల పరీక్షలు ముగిశాక నిర్ణీత కటాఫ్ మార్కులు సాధించిన అభ్యర్థుల్లో టాప్ 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్డ్ కు ఎంపిక చేస్తారు ఈ పరీక్ష అనంతరం ఐఐటీల్లో ఆర్కిటెక్చర్ కోర్సులకు.. ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఏఏటీ)ని నిర్వహిస్తారు. దీని తేదీలను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. ఈ ఫలితాలు కూడా విడుదలయ్యాక ఐఐటీలు, ఎన్ఐటీలు, ఇతర సంస్థల్లో సీట్ల కేటాయింపు ప్రక్రియను జాయింట్ చేపడుతుంది.
♦జేఈఈ మెయిన్ అభ్యర్థులకు సవరణలఅవకాశం
కాగా, జేఈఈ మెయిన్‌కు సంబంధించి మార్చి ఏప్రిల్, మే సెషన్లకు దరఖాస్తు చేసినవారు సవరణలు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎసీఏ) ప్రకటన విడుదల చేసింది. ఈ సెషన్లకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు సిటీ సెషన్ కేటగిరీ సబ్జెక్టు తదితరాల్లో మార్పులుచేర్పులుంటే మార్చి 6లోగా చేసుకోవచ్చని వివరించింది. ఎన్టీఏ వెబ్సైట్ 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎన్టీఏ.ఏసీ.ఐఎన్' లేదా 'హెచీటీపీఎస్://జేఈఈమెయిన్.ఎన్ఏ.ఎన్ ఐసీ.ఐఎన్' వెబ్ సైట్ల ద్వారా సవరణలు చేసుకోవచ్చని పేర్కొంది. జేఈఈ మెయినక్కు అదనంగా మరో మూడు పరీక్ష కేంద్రాలను చేర్చింది. లడఖ్ లోని కార్గిల్, మలేషియాలోని కౌలాలంపూర్ నైజీరియాలోని అబుజా/లాగోస్‌లో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.
https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS




