15, జులై 2021, గురువారం

ఏపీ ఐసెట్‌ 2021 నోటిఫికేషన్‌ విడుదల..దరఖాస్తుల ప్రారంభం: 15.07.2021| దరఖాస్తులకు చివరి తేది: 14.08.2021


ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి.. ఏపీ ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఏపీఐసెట్‌)–2021కు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏపీఐసెట్‌ ర్యాంకు ఆధారంగా రాష్ట్రంలో ఎంబీఏ/ఎంసీఏల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఆంధ్రా యూనివర్సిటీ ఈ పరీక్షను నిర్వహించనుంది.
Adminissions 
ఎంట్రెన్స్‌: ఏపీ ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌–2021
ప్రవేశం కల్పించే కోర్సులు: ఎంబీఏ/ఎంసీఏ

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుల ప్రారంభం: 15.07.2021
దరఖాస్తులకు చివరి తేది: 14.08.2021

పరీక్ష తేదీలు: సెప్టెంబర్‌ 17, 18.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://sche.ap.gov.in/icet

JNTUA Results Links B.Tech II Year II Sem and JNTUA: B.Tech III Year II Sem (R15) JNTUA: B.Tech II Year II Sem and JNTUA: B.Tech III Year II Sem. (R13) Supplementary 2021

JNTUA: B.Tech II Year II Sem. (R15) Supplementary Result 2021

Posted: 13 Jul 2021 08:56 PM PDT

For Result: Click Here...

JNTUA: B.Tech III Year II Sem. (R15) Supplementary Result 2021

Posted: 13 Jul 2021 08:54 PM PDT

For Result: Click Here...

JNTUA: B.Tech II Year II Sem. (R13) Supplementary Result 2021

Posted: 13 Jul 2021 08:50 PM PDT

For Result: Click Here...

JNTUA: B.Tech III Year II Sem. (R13) Supplementary Result 2021

Posted: 13 Jul 2021 08:38 PM PDT

For Result: Click Here...

13, జులై 2021, మంగళవారం

భారత రక్షణ విభాగంలో 458 ఖాళీలు | దరఖాస్తులకు చివరి తేది: 30.07.2021

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని రక్షణ విభాగం.. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs  
మొత్తం పోస్టుల సంఖ్య: 458
పోస్టుల వివరాలు: ట్రేడ్స్‌మెన్‌ మేట్, జేఓఏ, మెటీరియల్‌ అసిస్టెంట్, ఎంటీఎస్, ఫైర్‌మెన్‌ తదితరాలు.
అర్హతలు..
ట్రే డ్స్‌మెన్‌మేట్‌: పదోతరగతి ఉత్తీర్ణులవ్వాలి.
జీతం: నెలకు రూ.18,000 నుంచి రూ.56,900 వరకు చెల్లిస్తారు.

జేఓఏ: ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులవ్వాలి.
జీతం: నెలకు రూ.19,900 నుంచి రూ.56,900 వరకు చెల్లిస్తారు.

మెటీరియల్‌ అసిస్టెంట్‌: గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి.
జీతం: నెలకు రూ.29,200 నుంచి రూ.56,900 వరకు చెల్లిస్తారు.

ఎంటీఎస్‌: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
జీతం: నెలకు రూ.18,000 నుంచి రూ.56,900 వరకు చెల్లిస్తారు.

ఫైర్‌మెన్‌: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
జీతం: నెలకు రూ.18,000 నుంచి రూ.56,900 వరకు చెల్లిస్తారు.

ఏబీఓయూ ట్రేడ్స్‌మెన్‌మేట్‌: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
జీతం: నెలకు రూ.18,000 నుంచి రూ.56,900 వరకు చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును కమాండెంట్, 41 ఫీల్డ్‌ ఆమ్యునేషన్‌ డిపో, 909741 సీవో 56 ఏపీవో చిరునామాకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 30.07.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.indianarmy.nic.in  and www.ncs.gov.in 

12, జులై 2021, సోమవారం

ఇండియన్‌ నేవీలో 350 మెట్రిక్‌ రిక్రూట్‌ సెయిలర్లు | ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 19.07.2021 | ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 23.07.2021

ఇండియన్‌ నేవీ అక్టోబర్‌ 2021లో ప్రారంభ‌మయ్యే మెట్రిక్‌ రిక్రూట్‌(ఎంఆర్‌) సెయిలర్ల బ్యాచ్‌ కోసం అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
Jobs 
మొత్తం పోస్టుల సంఖ్య: 350
పోస్టుల వివరాలు: చెఫ్, స్టీవార్డ్, హైజీనిస్ట్‌.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి.
వయసు: 01.06.2001 నుంచి 30.09.2004 మధ్య జన్మించి ఉండాలి.
జీతం: మొదట శిక్షణా సమయంలో స్టైపెండ్‌ రూపంలో నెలకు రూ.14,600 చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు డిఫెన్స్‌ పే మ్యాట్రిక్స్‌ లెవల్‌ 3 ప్రకారం వేతనం, ఎంఎస్‌పీ, డీఏ అందిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్షా విధానం: ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. ఈ పరీక్షను హిందీ, ఇంగ్లిష్‌ మాధ్యమాల్లో నిర్వహిస్తారు. దీనిలో రెండు సెక్షన్లు ఉంటాయి. అవి.. సైన్స్‌ అండ్‌ మ్యాథమేటిక్స్, జనరల్‌ నాలెడ్జ్‌. ప్రశ్నల సరళి పదో తరగతి సిలబస్‌ స్థాయిలో ఉంటుంది. పరీక్షా సమయం 30 నిమిషాలు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 19.07.2021
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 23.07.2021

పూర్తి వివరాలక వెబ్‌సైట్‌: www.joinindiannavy.gov.in

5830 క్లర్క్‌ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్‌ నోటిఫికేషన్‌ | దరఖాస్తుల ప్రారంభ తేది: 12.07.2021 దరఖాస్తులకు చివరి తేది: 01.08.2021 ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ పరీక్ష: ఆగస్టు 28, 29, సెప్టెంబర్‌ 4. ఆన్‌లైన్‌ మెయిన్‌ పరీక్ష: 31.10.2021

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌(ఐబీపీఎస్‌).. దేశవ్యాప్తంగా 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 5830 క్లర్క్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఏదైనా డిగ్రీ అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టుల సంఖ్య: 5830

తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: తెలంగాణలో ఖాళీల సంఖ్య:263, ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీల సంఖ్య: 263

భర్తీ చేసే బ్యాంకులు:

  • బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా
  • బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా
  • బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర
  • కెనరా బ్యాంక్
  • సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా
  • ఇండియన్‌ బ్యాంక్
  • ఇండియన్‌ ఒవర్‌సీస్‌ బ్యాంక్
  • పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్
  • పంజాబ్‌ అండ్‌ సిం«ద్‌ బ్యాంక్
  • యూకో బ్యాంక్
  • యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత రాష్ట్ర అధికారిక భాషలో చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చి ఉండాలి.

వయసు: 01.07.2021 నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ విధానంలో ప్రిలిమినరీ(100మార్కులు), మెయిన్‌(200మార్కులు) పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. నెగిటివ్‌ మార్కుల విధానం ఉంది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్‌కు అనుమతిస్తారు. మెయిన్‌లో మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుల ప్రారంభ తేది: 12.07.2021
దరఖాస్తులకు చివరి తేది: 01.08.2021
ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ పరీక్ష: ఆగస్టు 28, 29, సెప్టెంబర్‌ 4.
ఆన్‌లైన్‌ మెయిన్‌ పరీక్ష: 31.10.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.ibps.in

11, జులై 2021, ఆదివారం

ఏపీ, వైఎస్సార్‌ కడపలోని సాంఘిక సంక్షేమ విభాగంలో వివిధ ఖాళీలు | దరఖాస్తులకు చివరి తేది: 12.07.2021

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని వైఎస్సార్‌ కడప జిల్లా సాంఘిక సంక్షేమ విభాగం ఎస్సీ/ఎస్టీ అభ్యర్థుల నుంచి వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs 
మొత్తం పోస్టుల సంఖ్య: 07
పోస్టుల వివరాలు: ఆఫీస్‌ సబార్డినేట్‌–01, వాచ్‌మెన్‌–04, ఆఫీస్‌ వాచర్‌–02.
అర్హత: పోస్టుల్ని అనుసరించి ఐదోతరగతి, ఏడో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. సైకిల్‌ తొక్కడం వచ్చి ఉండాలి. వాచ్‌మెన్‌/ఆఫీస్‌ వాచర్‌ పోస్టులకు ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ /హోంగార్డ్‌ /సివిల్‌ డిఫెన్స్‌ శిక్షణ పొంది ఉండాలి.
వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 47 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఐదు, ఏడు తరగతుల్లో సాధించిన మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిచేస్తారు.

దరఖాస్తులకు చివరి తేది: 12.07.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://kadapa.ap.gov.in/

10, జులై 2021, శనివారం

838 పోస్టులకు యూపీఎస్సీ–కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌ 2021 నోటిఫికేషన్‌ | ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 27.07.2021 రాత పరీక్ష తేది: 21.11.2021

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ).. 838 పోస్టుల భర్తీకి కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌–2021 నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
 
కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ 2021
మొత్తం పోస్టుల సంఖ్య: 838

పోస్టుల వివరాలు..
కేటగిరీ–1: సెంట్రల్‌ హెల్త్‌ సర్వీస్‌లో జూనియర్‌ స్కేల్‌ పోస్టులు– 349.
కేటగిరీ–2: రైల్వేలో అసిస్టెంట్‌ డివిజనల్‌ మెడికల్‌ ఆఫీసర్‌–300. న్యూఢిల్లీ మున్సిపల్‌ కౌన్సిల్‌లో జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌–05. –జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌ 2 (ఈడీఎంసీ, ఎన్‌డీఎంసీ, ఎస్‌డీఎంసీ)–184.

అర్హతలు: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతో పాటు ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేసి ఉండాలి. ఎంబీబీఎస్‌ ఫైనల్‌ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 01.08.2021 నాటికి 32ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.

ఎంపిక విధానం: రాత పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 27.07.2021

రాత పరీక్ష తేది: 21.11.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in