13, అక్టోబర్ 2021, బుధవారం

ఇంజనీరింగ్ విద్యార్థినులకు ప్రగతి స్కాలర్‌షిప్‌ AICTE Pragati Scholarship:

ఇంజనీరింగ్, డిప్లొమా చదివే విద్యార్థినులకు ఏఐసీటీఈ ప్రగతి స్కాలర్‌షిప్‌ ప్రకటన వచ్చేసింది. ప్రతిభావంతులైన విద్యార్థినులను ఉన్నత విద్య దిశగా ప్రోత్సహించే ఉద్దేశంతో అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) ప్రతి ఏటా ఈ స్కాలర్‌షిప్‌ అందిస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల విద్యార్థులు నవంబర్‌ 30వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

గతంలో ఇలా
ఏఐసీటీఈ గతంలో 4వేల మందికి స్కాలర్‌షిప్స్‌ను అందించేది. ఇందులో బీటెక్‌ అభ్యసించేవారికి 2000, డిప్లొమా వారికి 2000 చొప్పున కేటాయించింది. ప్రస్తుతం 2021 ఏడాది సంబంధించి ఈ స్కాలర్‌షిప్స్‌ సంఖ్యను భారీగా పెంచింది. 4 వేల నుంచి 10వేలకు(బీటెక్‌–5000, డిప్లొమా–5000)పెంచింది.

ఆర్థిక ప్రోత్సాహం
ప్రగతి స్కాలర్‌షిప్‌ పథకం కింద ఎంపికైన ప్రతి విద్యార్థినికి ఏడాదికి రూ.50వేల చొప్పున నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమచేస్తారు. కాలేజీ ఫీజు, కంప్యూటర్‌ కొనుగోలు, స్టేషనరీ, బుక్స్, ఎక్విప్‌మెంట్‌ తదితర అవసరాలన్నింటికీ కలిపి ఈ మొత్తాన్ని డీబీటీ(డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌) విధానంలో అందజేస్తారు. 

అర్హత
ఏఐసీటీఈ గుర్తింపు పొంది టెక్నికల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఫస్ట్‌ ఇయర్‌ బీటెక్‌/డిప్లొమా కోర్సుల్లో చేరి ఉండాలి. కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షలకు మించకుండా ఉండాలి. కుటుంబంలో అర్హులైన విద్యార్థినులు ఇద్దరూ ఉంటే ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం
ఏఐసీటీఈ గుర్తింపు పొందిన సంబంధిత కాలేజీలో బీటెక్‌/పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి నిర్వహించే అర్హత పరీక్షలో సాధించిన మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

ధ్రువపత్రాలు
పదోతరగతి/ఇంటర్‌ అకడమిక్‌ సర్టిఫికెట్లు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, సంబంధిత ఇన్‌స్టిట్యూట్‌లో అడ్మిషన్‌ పొందిన సర్టిఫికేట్, ట్యూషన్‌ ఫీజు రిసిప్ట్, ఆధార్‌తో లింక్‌ అయి ఉన్న బ్యాంక్‌ ఖాతా నంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్, ఫోటోగ్రాఫ్, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్‌ కార్డ్, తల్లిదండ్రుల ధ్రువీకరణ పత్రం ఉండాలి.

ముఖ్య సమాచారం
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 
► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 30.11.2021
► వెబ్‌సైట్‌: https://www.aicte-india.org/

 

ప్రభుత్వ విద్యా ఉద్యోగ సమాచారం Govt. Education and Job Info.



Gemini Internet

Ananthapuramu | Chittoor | Cuddappah | Kurnool District Classifieds 13-10-2021

Gemini Internet







12, అక్టోబర్ 2021, మంగళవారం

నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ రిక్రూట్‌మెంట్ 2021 JRF, SRF, రీసెర్చ్ అసోసియేట్ & ఇతర-30 పోస్ట్లు nif.org.in చివరి తేదీ 30-10-2021


Name of Organization Or Company Name :National Innovation Foundation


Total No of vacancies:– 30 Posts


Job Role Or Post Name:JRF, SRF, Research Associate & Other 


Educational Qualification:PG, CA/ICWA/CFA, Ph.D


Who Can Apply:All India


Last Date:30-10-2021


Website:nif.org.in



ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రిక్రూట్‌మెంట్ 2021 గ్రాడ్యుయేట్/ డిప్లొమా అప్రెంటిస్-66 పోస్టులు www.aai.aero చివరి తేదీ 31-10-2021


Name of Organization Or Company Name :Airports Authority of India


Total No of vacancies: – 66 Posts


Job Role Or Post Name:Graduate/ Diploma Apprentice 


Educational Qualification:Diploma, Degree (Engg)


Who Can Apply:All India


Last Date:31-10-2021


Website:www.aai.aero


Click here for Official Notification


వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ 2021 మైనింగ్ సిర్దార్ & సర్వేయర్-211 పోస్ట్లు www.westerncoal.in చివరి తేదీ 20-11-2021



Name of Organization Or Company Name :Western Coalfields Limited


Total No of vacancies:– 211 Posts


Job Role Or Post Name:Mining Sirdar & Surveyor 


Educational Qualification:10th Class, Diploma (Mining & Mine Surveyor)


Who Can Apply:All India


Last Date:20-11-2021


Website:www.westerncoal.in


Click here for Official Notification