అప్లికేషన్ల కోసం సంప్రదించండి GEMINI ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
APPSC Recruitment 2021 |
ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు శుభవార్త. ఏపీలో ఖాళీల భర్తీకి వరుసగా
జాబ్ నోటిఫికేషన్స్ విడుదల చేస్తోంది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
(APPSC). ఏపీ శాసనసభలో ఖాళీల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేసేందుకు వరుసగా నోటిఫికేషన్స్ విడుదల చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) పలు ఖాళీల భర్తీకి వేర్వేరుగా జాబ్ నోటిఫికేషన్స్ విడుదల చేస్తోంది. ఇప్పటికే 151 మెడికల్ ఆఫీసర్ (Medical Officer) పోస్టులకు, 39 హార్టికల్చర్ ఆఫీసర్ (Horticulture Officer) పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 18న ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్ సర్వీస్‌లో తెలుగు రిపోర్టర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. మొత్తం 5 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు
దరఖాస్తు చేయడానికి 2021 నవంబర్ 8 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు
సంబంధించిన పూర్తి వివరాలు, విద్యార్హతలు, అప్లికేషన్ ప్రాసెస్ గురించి
తెలుసుకోండి.
APPSC Recruitment 2021: నోటిఫికేషన్ వివరాలు
భర్తీ చేసే పోస్టు పేరు
తెలుగు రిపోర్టర్
మొత్తం ఖాళీలు
5
దరఖాస్తు ప్రారంభం
2021 అక్టోబర్ 18
దరఖాస్తుకు చివరి తేదీ
2021 నవంబర్ 8
APPSC Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
విద్యార్హతలు- ఏదైనా డిగ్రీ పాస్ కావాలి. షార్ట్ హ్యాండ్, తెలుగు టైప్ రైటింగ్‌లో హయ్యర్ గ్రేడ్ పాస్ కావాలి.
వయస్సు-
2021 జూలై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 42 ఏళ్లు ఉండాలి. ఎస్‌సీ,
ఎస్‌టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు
వయస్సులో సడలింపు ఉంటుంది.
ఈ
పోస్టులే కాకుండా 4 డీపీఆర్‌ఓ పోస్టులకు 2021 అక్టోబర్ 19న, 6 అసిస్టెంట్
డైరెక్టర్ పోస్టులకు 2021 అక్టోబర్ 22న, 6 అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్
ఆఫీసర్, 29 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్, 1 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, 2
హాస్టల్ వెల్‌ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 పోస్టులకు నవంబర్ 12న దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం కానుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్
కమిషన్ (APPSC) అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in/ ఫాలో కావాలి.
Online Courses : కోవిడ్
తరువాత విద్యావిధానంలో చాలా మార్పులు వచ్చాయి. ఆన్‌లైన్ విద్య సౌలభ్యం
అందరికీ అర్థం అయ్యింది. ప్రముఖ కంపెనీలు, యూనివర్సీటీలు (Universities)
ఆన్‌లైన్ కోర్సులను ప్రవేశపెట్టాయి. ప్రస్తుతం ఉపాధి అవకాశాలు
కల్పించే ఆన్‌లైన్ కోర్సులను ఇంటి నుంచే నేర్చుకొనే అవకాశం
కల్పిస్తున్నాయి. వాటి వివరాలు తెలుసుకోండి
Online Course : ఇంటి నుంచే చదివేయండి.. ఉపాధి అవకాశలిచ్చే ఆన్‌లైన్ కోర్సుల వివరాలు
Online
Courses : కోవిడ్ తరువాత విద్యావిధానంలో చాలా మార్పులు వచ్చాయి.
ఆన్‌లైన్ విద్య సౌలభ్యం అందరికీ అర్థం అయ్యింది. ప్రముఖ కంపెనీలు,
యూనివర్సీటీలు (Universities) ఆన్‌లైన్ కోర్సులను ప్రవేశపెట్టాయి.
ప్రస్తుతం ఉపాధి అవకాశాలు కల్పించే ఆన్‌లైన్ కోర్సులను ఇంటి నుంచే
నేర్చుకొనే అవకాశం కల్పిస్తున్నాయి. వాటి వివరాలు తెలుసుకోండి
ప్రస్తుత ఆకర్షణీయమైన కెరీర్ ఆప్షన్స్‌లో
క్లౌడ్ కంప్యూటింగ్ (Cloud Computing) ఒకటిగా నిలుస్తోంది. వ్యాపారాలు,
ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడంలో.. భవిష్యత్తులో మనుషుల అవసరాలకు తగినట్లుగా
సాంకేతికతను తీసుకురావడంలో క్లౌడ్ కంప్యూటింగ్ కీలక పాత్ర పోషిస్తోంది.
అందుకే క్లౌడ్ కంప్యూటింగ్ నేర్చుకోవడం ద్వారా అపరిమితమైన ఉద్యోగావకాశాలు పొందొచ్చు. తాజాగా అమెజాన్ వెబ్ (Amazon Web) సర్వీసెస్ (AWS) కూడా క్లౌడ్ కంప్యూటింగ్ ప్రాముఖ్యతను నిరుద్యోగులకు
తెలియజేసేందుకు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. ఎడబ్ల్యుఎస్ (AWS)
రీ/స్టార్ట్ ప్రోగ్రాంలో భాగంగా 12 వారాల క్లౌడ్ కంప్యూటింగ్ కోర్స్
ఉచితంగా అందిస్తున్నట్టు అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రకటించింది. ఈ కోర్సులో
జాయిన్ అవ్వాలనుకునే ఆసక్తి గల అభ్యర్థులకు ఎలాంటి టెక్నాలజీ
ఎక్స్‌పీరియన్స్/స్కిల్స్ అవసరం లేదు.
కోర్సుకు అర్హతలు
1. అభ్యర్థులు 12 వారాల కోర్స్ వ్యవధిలో సోమవారం నుంచి శుక్రవారం వరకు హాజరు కావడానికి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలి. 2. ట్రైనింగ్ కోర్స్ తీసుకున్న తర్వాత ఫుల్ టైం జాబ్ చేయగలగాలి.
3. దరఖాస్తుదారుల్లో క్లౌడ్ కంప్యూటింగ్ లో కెరీర్ ని తప్పకుండా ప్రారంభించాలనే ఆసక్తి ఉండాలి.
TCS Careers : "టీసీఎస్ పిలుస్తోంది".. నిరుద్యోగులకు ఉచిత శిక్షణ.. ఉపాధి అవకాశాలు
4. అభ్యర్థులు హైస్కూల్ డిప్లొమా లేదా జనరల్ ఎక్వివలెన్సీ డిప్లొమా (GED) కలిగి ఉండాలి.
అంతేకాకుండా
ఈ ప్రోగ్రామ్.. పార్టిసిపెంట్లను క్లౌడ్ ప్రాక్టీషనర్ సర్టిఫికేషన్
పరీక్షకు సిద్ధం చేస్తుంది. ఈ ఎగ్జామ్ ఖర్చులను కూడా భరిస్తుంది. ఇక్కడ
నేర్చుకున్న క్లౌడ్ స్కిల్స్ సర్టిఫికేషన్ ఎక్కడైనా సరే వాలీడ్ గా ఉంటుంది.
ఈ ప్రోగ్రామ్ చెన్నై, కోల్కతా, ముంబై, పూణే, తిరువనంతపురం సిటీల నుంచి
నిర్వహిస్తారు. ఎడ్యూబ్రిడ్జి లెర్నింగ్, ఎడ్యూజాబ్స్ అకాడమీ వంటి ఐదు
స్థానిక విద్యా సంస్థలతో కలిసి వర్చువల్ ట్రైనింగ్ అందించనున్నారు.
సైన్స్‌ఢిల్లీలోని
ఇంద్రప్రస్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (Indraprastha
Institute of Information Technology) ప్రొఫెసర్‌ల కోసం కంప్యూటర్
సైన్స్‌లో సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ కోర్సు కోవిడ్ ప్రోటోకాల్ నిబంధనలకు అనుగుణంగా వర్చువల్ విధానంలో యూనివర్సిటీ అందిస్తుంది. ఈ కోర్సు బీఈ/ బీటెక్ అండ్ నాన్- ఇంజనీరింగ్
విభాగాలు బీఎస్సీ/ బీసీఏ / ఎంసీఏ నేపథ్యాల నుంచి వచ్చివారు చేసేందుకు
రూపొందించిన సర్టిఫికెట్ ప్రోగ్రామ్ (Certificate Program) ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ (Computer Science)
విభాగాల్లో ఉపాధ్యాయులు బోధనా సామర్థ్యాలు మెరుగు పర్చుకొనేందుకు
రూపొందించిన కోర్సుగా యూనివర్సిటీ తెలిపింది. ఈ కోర్సు చేసేందుక ఇతర
యూనివర్సిటీలు తమ అధ్యాపకులను ప్రోత్సహిస్తున్నాయి. అంతే కాకుండా
అసోసియేషన్ ఫర్ కంప్యూటింగ్ మిషనరీ (Association for Computing
Machinery) ఈ కోర్సు చేసేందుకు అధ్యాపకులను పాక్షిక ఆర్థిక చేయూత
అందించనుంది.
వారానికి 6 నుంచి 8 గంటల బోధన..
ఈ
కోర్సు బోధించేందుకు ఆయా రంగాల్లో స్పెషలిస్టులను ఎంపిక చేసి బోధన
అందించస్తారు. ముఖ్యంగా ఏఐసీటీ (AICTE) సెలబస్ నిబంధనలకు అనుగుణంగా
పాఠ్యాంశాలను బోధిస్తున్నారు.
ఈ మాడ్యుల్ బోధనకు ఐఐటీ, ఐఐఐటీ విద్యావేత్తలను
నియమించనున్నారు. ఈ కోర్సు మొదటి మాడ్యూల్ జనవరి 2022న
ప్రారంభమవుతుంది. ఈ కోర్సు రెగ్యులర్ సెమిస్టర్‌లో పాఠ్యాంశాలు ఆన్‌లైన్
మాడ్యూల్ (Online Module)లను కలిగి ఉన్నందున ఫ్యాకల్టీ ఎప్పుడైనా సెలవు
తీసుకోవాల్సిన అవసరం లేదు.
-ప్రతి వారం, ప్రతి వారం దాదాపు 5
నుంచి 6 గంటల మొత్తం ప్రయత్నం కోసం, కొన్ని వారపు ప్రాక్టీస్ పనితో పాటు
ఒక సింగిల్ సెషన్ జరుగుతుంది. ఒక ప్రోగ్రామ్ పూర్తి చేసిన తర్వాత
హాజరైనవారు సర్టిఫికెట్ పొందుతారు.
ఈ కోర్సులో ప్రతీ
మాడ్యూల్ ధర రూ. 10,000 అదనంగా జీఎస్‌టీ చెల్లించాలి. ఈ ఫీజులోనే ఆన్‌లైన్
క్లాస్‌లు, మెటీరియల్ (Material) అందిస్తారు.
మాడ్యూల్
పూర్తి చేసుకొన్న వారు వారి డిపార్ట్‌మెంట్/ ఇన్‌స్టిట్యూట్ ద్వారా
నిమినేట్ చేయబడతారు. వారానిఇక 6 నుంచి 8 గంటల పాటు కోర్సు విధానాన్ని
నిర్ణయిస్తారు.
ట్రిపుల్ఐటీ హైదరాబాద్‌లో కొత్త కోర్సు..
మారుతున్న
టెక్నాలజీ, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్త కొత్త కోర్సులను
ప్రవేశపెడుతున్నాయి ప్రతిష్టాత్మక సంస్థలు. తాజాగా హైదరాబాద్‌లోని ఇండియన్
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్ఐటీ)
సరికొత్త కోర్సుకు శ్రీకారం చుట్టింది. ప్రొడక్ట్ డిజైన్ అండ్
మేనేజ్‌మెంట్‌లో రెండేళ్ల ఎంటెక్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. అర్హత,
ఆసక్తి గల అభ్యర్థులు ఐఐటీ హైదరాబాద్ అధికారిక వెబ్‌సైట్ www.pdm.iiit.ac.in
ద్వారా నవంబర్ 10లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. టెక్నాలజిస్ట్‌లు,
ప్రొడక్ట్ డిజైనర్లు, ప్రొడక్ట్ మేనేజర్లు, స్టార్టప్ ఫౌండర్లు,
ఎంటర్ప్రెన్యూర్లను తయారు చేయడమే లక్ష్యంగా ఈ కోర్సును ఆవిష్కరించింది.
ఈ
ప్రోగ్రామ్ కొత్త ఉత్పత్తులు, కొత్త స్టార్టప్ (Startup) లు లేదా కొత్త
ఐటీ కొలువుల సృష్టికి దారి తీస్తుంది. ఎంటెక్ ప్రోగ్రామ్ మొదటి సంవత్సరంలో
నూతన టెక్నాలజీపై అవగాహన, టెక్నాలజీ కన్వర్జెన్స్, డిజైన్, మార్కెట్లు
& బిజినెస్, ప్రొడక్ట్ డిజైన్, డెవలప్‌మెంట్, మేనేజ్‌మెంట్, ఎమర్జింగ్
టెక్నాలజీస్పైలోతైన అవగాహన కల్పిస్తారు. ఇక, రెండో సంవత్సరంలో క్రియేటింగ్
ప్రొడక్ట్స్, డీప్టెక్నాలజీస్లోకి ఐడియాలు ట్రాన్స్‌లేట్ చేసుకోవడం,
ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ మార్కెట్ వంటి సబ్జెక్ట్లపై అవగాహన కల్పిస్తారు.
ఇలా దరఖాస్తు చేసుకోండి.. Step 1 : ముందుగా www.pdm.iiit.ac.inక్లిక్ చేసి వెబ్ సైట్ కు వెళ్లాలి. Step 2 : అందులో టాప్ లో అడ్మిషన్స్ అనే ఆప్షన్ కనపడుతుంది. దానిపై క్లిక్ చేయాలి. Step 3 : కొత్త పేజీ ఓ పెన్ అయిన తర్వాత బాటమ్ లో అప్లై(Apply)అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. Step 3 : తదనంతరం New Users click here to registerపైన క్లిక్ చేసి వ్యక్తిగత వివరాలను నమోదు చేసి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రాథమిక
పాఠశాల ఉపాధ్యాయుల శిక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం బ్రిడ్జ్ కోర్సులను
తప్పనిసరి చేసింది. ప్రాథమిక ఉపాధ్యాయుడిగా నియామకం పొందిన రెండేళ్లలోపు
ప్రాథమిక విద్యలో ఆరు నెలల బ్రిడ్జ్ కోర్సు (Bridge Course) చేయాల్సి
ఉంటుంది. ఇందుకు సంబంధించి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (National
Council for Teacher Education) మార్గదర్శకాలు విడుదల చేసింది.
ప్రాథమిక
పాఠశాల ఉపాధ్యాయుల శిక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం బ్రిడ్జ్ కోర్సులను
తప్పనిసరి చేసింది. ప్రాథమిక ఉపాధ్యాయుడిగా నియామకం పొందిన రెండేళ్లలోపు
ప్రాథమిక విద్యలో ఆరు నెలల బ్రిడ్జ్ కోర్సు (Bridge Course) చేయాల్సి
ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్
(National Council for Teacher Education) గుర్తింపు పొందిన సంస్థల నుంచి
మూడేళ్ల ఇంటిగ్రేటెడ్ BEd-MEd పొందిన అభ్యర్థులు 1 నుంచి 5 తరగతులలో
టీచర్‌గా నియామకం చేసేందుకు అర్హత పొందుతారు. ఇందుకోసం పాఠశాల ఉపాధ్యాయుల (Teachers)కు అర్హతలను పేర్కొంటూ ఆగస్టు 23, 2010 తేదీన నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ యొక్క మునుపటి గెజిట్ నోటిఫికేషన్ (Gazette Notification)కు సవరణ చేసింది.
అంతే కాకుండా పలు సవరణలు చేసింది. "కనీసం 50% మార్కులతో గ్రాడ్యుయేషన్
మరియు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (B.Ed.)" లేదా "కనీసం 55% మార్కులతో
పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన గ్రేడ్ మరియు మూడు సంవత్సరాల
ఇంటిగ్రేటెడ్ B.Ed.-M.Ed , ”కనీస అర్హతగా మార్పులు చేసింది.
పాత నిబంధన.. మునుపటి
నిబంధన ప్రకారం, 50% మార్కులు మరియు ప్రాథమిక విద్యలో రెండు సంవత్సరాల
డిప్లొమా లేదా కనీసం 45% మార్కులతో సీనియర్ సెకండరీ మరియు ప్రాథమిక విద్యలో
రెండు సంవత్సరాల డిప్లొమా లేదా సీనియర్ సెకండరీ కనీసం 50% మార్కులతోపాటు
నాలుగు సంవత్సరాల BEd డిగ్రీ లేదా, 50% మార్కులతో సీనియర్ సెకండరీ మరియు
విద్యలో రెండు సంవత్సరాల డిప్లొమా (ప్రత్యేక విద్య) అవసరం ఉండేది.
సవరణ చేస్తూ నోటిఫికేషన్ జారీ.. ఇక నుంచి 6 నుంచి 8 తరగతులకు ఉపాధ్యాయులుగా నియమించబడాలంటే, అభ్యర్థులు కనీసం 50% మార్కులతో గ్రాడ్యుయేట్-స్థాయి
డిగ్రీ మరియు ఒక సంవత్సరం BEd ప్రత్యేక విద్యను కలిగి ఉండాలి లేదా కనీసం
55% మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన గ్రేడ్ మరియు మూడు
సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఉండాలి B.Ed.- M.Ed. ప్రభుత్వం ఉచిత మరియు నిర్బంధ
విద్యాహక్కు చట్టం, 2009 (2009 లో 35) యొక్క సెక్షన్ 23 లోని సెక్షన్ 23
(1) మరియు నోటిఫికేషన్ నంబర్ S.O ని అనుసరించి తన అధికారాలను అమలు
చేస్తుంది. 750 (E), 31 మార్చి, 2010 తేదీన, ఈ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఒక్కసారి టెట్ పాసైతే చాలు.. ఇంతలో,
ప్రభుత్వం ఉపాధ్యాయుల అర్హత పరీక్ష (Teachers Eligibility Test)
సర్టిఫికెట్ల చెల్లుబాటును కూడా పొడిగించింది. ఇంతకు ముందు, చెల్లుబాటు
ఏడేళ్లపాటు ఉండేది, కానీ ఇది 2011 నుంచి అమలు అయ్యేలా టెట్ సర్టిఫికెట్
వ్యాలిడిటీని జీవితకాలం వరకు చెల్లుబాటు అయ్యేలా మార్చారు. TET కేంద్ర
మరియు రాష్ట్ర స్థాయిలో నిర్వహించబడుతుంది. పాఠశాలల్లో బోధించడానికి
సిద్ధంగా ఉన్నవారు CTET లేదా రాష్ట్ర-నిర్దిష్ట TET ని క్లియర్ చేయాలి.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ
టెస్ట్ (CTET) నిర్వహిస్తుంది, దీని ఆధారంగా, ప్రాథమిక పాఠశాలల్లో టీచింగ్
పోస్టుల కోసం అభ్యర్థులను నియమించారు.
మీరు
వ్యవసాయం చేస్తున్నారా? అయితే మీకు శుభవార్త. మీరు ప్రతి నెలా రూ.3 వేలు
పొందొచ్చు. అయితే దీని కోసం నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు చెల్లించాల్సి
ఉంటుంది. 60 ఏళ్లు దాటిన తర్వాత పెన్షన్ వస్తుంది.
ప్రధానాంశాలు:
రైతులకు తీపికబురు
ప్రతి నెలా డబ్బులు
ఈ స్కీమ్‌లో చేరండి
మీరు
వ్యవసాయం చేస్తుంటారా? మీ పేరుపై పొలం ఉందా? అయితే మీకు శుభవార్త. మీరు
ప్రతి నెలా రూ.3 వేల పెన్షన్ పొందొచ్చు. ఇది ప్రధాని మోదీ అందిస్తున్న పీఎం
కిసాన్ స్కీమ్ రూ.2 వేల డబ్బులకు అదనం. అలాగే ఇప్పటికే పెన్షన్ వస్తున్నా
కూడా ఈ రూ.3 వేలు వస్తూనే ఉంటాయి.
కేంద్ర
ప్రభుత్వం ఒక పథకాన్ని అందుబాటులో ఉంచింది. దీని పేరు పీఎం కిసాన్ మాన్ ధన్
యోజన. ఈ స్కీమ్‌లో చేరడం వల్ల రైతులకు 60 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి నెలా
రూ.3 వేల పెన్షన్ వస్తుంది. దీని కోసం రైతులు ఇప్పుడే స్కీమ్‌లో చేరాలి.
ప్రతి నెలా కొంత డబ్బు కట్టాలి.
వయసు ప్రాతిపదికన నెలకు రూ.55
నుంచి రూ.200 వరకు కట్టాల్సి రావొచ్చు. ఇది పెద్ద మొత్తం ఏమీ కాదు. అందుకే
రైతులు సులభంగానే ఈ పథకంలో చేరొచ్చు. ప్రతి నెలా కొంత మొత్తం చెల్లిస్తూ
వెళ్లాలి. 60 ఏళ్ల తర్వాత ప్రతి నెలా రూ.3 వేలు వస్తాయి.