Alerts

Loading alerts...

21, అక్టోబర్ 2021, గురువారం

Federal Bank: మీరు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారా..? అయితే మీకో గుడ్ న్యూస్.. ఏడాదికి రూ.5.70 లక్షలు సంపాదించే ఛాన్స్..!

Federal Bank: మీరు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారా? బ్యాంకులో ఇంటర్న్‌షిప్‌ ద్వారా వర్క్ ఎక్స్పీరియన్స్ పొందాలనేది మీ కలా? అయితే మీకు ఫెడరల్ బ్యాంకు (Federal Bank) ఓ గుడ్ న్యూస్ చెప్పింది.

మీరు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారా? బ్యాంకులో ఇంటర్న్‌షిప్‌ ద్వారా వర్క్ ఎక్స్పీరియన్స్ పొందాలనేది మీ కలా? అయితే మీకు ఫెడరల్ బ్యాంకు (Federal Bank) ఓ గుడ్ న్యూస్ చెప్పింది. గ్రాడ్యుయేట్ల కోసం తాజాగా రెండేళ్ల ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ తీసుకువచ్చినట్లు ప్రకటించింది. ప్రస్తుతం విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఫెడరల్ బ్యాంకు తెలిపింది. ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులు ఫెడరల్ బ్యాంక్ మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (MAHE) నుంచి పీజీ డిప్లొమా అందుకోవచ్చు. అంతేకాదు, సంవత్సరానికి రూ. 5.70 లక్షల వరకు ఆదాయం సంపాదించవచ్చు.
ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొనాలనే ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 23 లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ ఆప్టిట్యూడ్ పరీక్షను నవంబర్ 7న నిర్వహిస్తారు. ఫెడరల్ బ్యాంకు ఈ కోర్సును ‘ఫెడరల్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ (ఎఫ్‌ఐపీ)’ పేరుతో.. మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ (ఎంఏజీఈ) తో కలిసి నిర్వహిస్తుంది.
* ఇంటర్న్‌షిప్ నేర్పించే అంశాలు ఏంటి?

ఈ కోర్సు ఎంఏజీఈ (MAGE) ద్వారా వర్చువల్ సెషన్‌లతో పాటు ఫెడరల్ బ్యాంక్ శాఖలు/ఆఫీసుల వద్ద ఇంటర్న్‌షిప్ అందిస్తుంది. భౌతిక అభ్యాస విధానం (physical mode of learning) ద్వారా ఇంటర్న్‌లు పూర్తిస్థాయిలో విషయాలను తెలుసుకునేందుకు ఈ కోర్సు సహాయపడుతుంది. ఈ ప్రోగ్రామ్‌లో చేరిన అభ్యర్థి సంవత్సరానికి రూ. 5.70 లక్షల వరకు సంపాదించవచ్చు.

అలాగే ఈ ప్రోగ్రామ్‌ను విజయవంతంగా పూర్తయిన చేసిన ఇంటర్న్‌కు మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (MAHE) నుంచి బ్యాంకింగ్ లో పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రదానం చేస్తారు. ఈ ప్రోగ్రామ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన తరువాత ఇంటర్న్ విద్యార్థులను ఫెడరల్ బ్యాంక్‌లో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా తీసుకునే (absorption) అవకాశం ఉంది.

* ఫెడరల్ బ్యాంక్ ఇంటర్న్‌షిప్ అర్హతలు
ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేయాలనుకుంటున్న అభ్యర్థులు 10వ తరగతి, 12వ తరగతి, గ్రాడ్యుయేషన్ కోర్స్ లో కనీసం 60% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 01.10.2021 నాటికి 27 ఏళ్లు మించకూడదు. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, గోవా, హర్యానా, గుజరాత్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ లేదా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు https://www.federalbank.co.in/federal-internship-program లింకు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

 

తిరుమల శ్రీవారి భక్తులకు తీపి కబురు.


నవంబరు నుంచి తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల సంఖ్య పెంచనున్నట్లు టీటీడీ తెలిపింది. సర్వదర్శనం 10వేలు, ప్రత్యేక ప్రవేశ దర్శన (రూ.300) టికెట్లు 12వేలు జారీ చేయనున్నట్లు ప్రకటన విడుదల చేసింది. నవంబరు నెలకు ప్రత్యేక సర్వదర్శన టికెట్ల విడుదల షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ నెల 22న ఉదయం 9 గంటలకు ప్రత్యేక దర్శన టికెట్లు.. 23న ఉదయం 10వేల సర్వదర్శన టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది.

శ్రీవారి దర్శనానికి సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, టైంస్లాట్‌ సర్వదర్శన టోకెన్లను ‘గోవింద’ యాప్‌లో కాకుండా టీటీడీ వెబ్‌సైట్‌లోనే బుక్‌ చేసుకోవాలని టీటీడీ తెలిపింది. రూ.300 టోకెన్లు, సర్వ దర్శనం టోకెన్లు శుక్ర, శనివారాల్లో విడుదల కానుండటంతో భక్తులు ఎదురు చూస్తున్నారు. ఒకవేళ రూ.300 టోకెన్లు దొరక్కపోయినా సర్వ దర్శనం టోకెన్లు తీసుకోవాలని భావిస్తున్నారు.

మరోవైపు తిరుమల వెళ్లే భక్తులను టీటీడీ అలర్ట్ చేసింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ కొత్త నిబంధనలను అమలులోకి తీసుకు వచ్చింది. ఇకపై శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయిన సర్టిఫికెట్, మూడు రోజుల ముందు కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తేవాలి. కొవిడ్ నియంత్రణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయానికి భక్తులు సహకరించాలని కోరారు.

APPSC Jobs Recruitment 2021: అసిస్టెంట్‌ ఇంజనీర్ ఉద్యోగాల‌కు అర్హ‌త‌లు..ఎంపికైతే ప్రారంభ జీతమే..రూ.31,460–రూ.84,970

నిరుద్యోగుల‌కు శుభవార్త. రాష్ట్రంలో ఏఈ (అసిస్టెంట్‌ ఇంజనీర్‌) స్థాయి ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

దీనిద్వారా పలు శాఖల్లో 190 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది. డిప్లొమా, బీటెక్‌ ఉత్తీర్ణులు ఏఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగానే చక్కటి ప్రభుత్వ కొలువు సొంతం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో.. ఏపీపీఎస్సీ తాజాగా విడుదల చేసిన అసిస్టెంట్‌ ఇంజనీర్‌(ఏఈ) నోటిఫికేషన్‌ వివరాలు, ఎంపిక విధానం, ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

మొత్తం పోస్టులు : 190

తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్‌లో..
ఏపీపీఎస్సీ తాజాగా విడుదల చేసిన ఏఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం తొమ్మిది విభాగాల్లో 190 పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. ఈ 190 పోస్ట్‌లలో 155 తాజా పోస్ట్‌లు కాగా, 35 పోస్ట్‌లను క్యారీ ఫార్వర్డ్‌ పోస్ట్‌లు(గత నోటిఫికేషన్‌లో భర్తీ కానివి)గా పేర్కొన్నారు. 

ఎంపికైతే వేతన శ్రేణి: రూ.31,460–రూ.84,970 లభిస్తుంది.

అర్హతలు ఇవే..:
ఏపీ సబార్డినేట్‌ సర్వీస్‌ పరిధిలోని ఈ ఏఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకునేందుకు డిప్లొమా, బీఈ/బీటెక్‌ అభ్యర్థులు అర్హులు. దరఖాస్తు చేసుకుంటున్న పోస్ట్‌ను అనుసరించి ఆయా బ్రాంచ్‌తో బీఈ/బీటెక్‌ లేదా డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి : 
జూలై 1,2021 నాటికి 18–42 ఏళ్ల మధ్యలో ఉండాలి. రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనలకు అనుగుణంగా గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.

ఎంపిక విధానం : 
రాత పరీక్షలో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా అసిస్టెంట్‌ ఇంజనీర్‌(ఏఈ) పోస్టులను భర్తీ చేస్తారు. రాత పరీక్షలో పొందిన మార్కులు, దరఖాస్తు చేసుకున్న పోస్ట్‌లు, అందుబాటులో ఉన్న ఖాళీలు, రిజర్వేషన్లు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని.. తుది విజేతల జాబితా విడుదల చేసి.. నియామకాలు ఖరారు చేస్తారు.

ముఖ్య‌మైన స‌మాచారం:
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: అక్టోబర్‌ 21–నవంబర్‌ 11,2021
దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి తేదీ: నవంబర్‌ 10, 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://psc.ap.gov.in 

తిరుమల దర్శనం RTC ప్రకటన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులలో తిరుమల వెళ్ళి దైవ దర్శనం చేసుకునే ప్రయాణికుల సౌకర్యార్థం, ప్రతి రోజు ఏ.పి.ఎస్.ఆర్.టి.సి బస్సులలో 1000 దైవ దర్శనం టికెట్లు అందుబాటులోకి వచ్చాయి.  ఏ.పి.ఎస్.  ఆర్.టి.సి బస్సులలో తిరుమలకు విచ్చేయు ప్రయాణికులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఈ అమూల్యమైన అవకాశం కల్పించినారు.
ఏ.పి.ఎస్. ఆర్.టి.సి బస్సులలో తిరుపతి వెళ్ళు ప్రయాణికులు ఛార్జీతోపాటు 300 రూపాయలు అదనంగా చెల్లించి బస్సులోనే శీఘ్ర దర్శనం టికెట్ పొందవచ్చును.
ప్రతి రోజు ఉదయం 11. 00 గంటలకు మరియు సాయంత్రం 4.00 గంటలకు ఈ శీఘ్ర దర్శనం ఏర్పాటు కలదు. తిరుమల బస్సు స్టేషన్ చేరుకున్న తర్వాత శీఘ్ర దర్శనం చేసుకొనుటకు ప్రయాణికులకు RTC సూపర్ వైజర్లు సహాయం చేసెదరు. కావున తిరుపతి వెళ్ళు ప్రయాణికులు ముందుగా RTC బస్సులలో శీఘ్ర దర్శనం టికెట్ పొందే అవకాశాన్ని వినియోగించుకోవలసినదిగా కోరడమైనది. APSRTC ప్రతి రోజు తిరుపతికి 650 బస్సులు నడుపుతున్నది.  ప్రతి డిపో నుండి తిరుపతికి బస్సు సౌకర్యం కలదు. బెంగుళూరు, చెన్నై, కంచి, వెల్లూరు, పాండిచ్చేరి, హైదరాబాద్ మొదలైన నగరాల నుండి దైవ దర్శనం కొరకు వచ్చు ప్రయాణికులకు ఇది చాలా మంచి సౌకర్యం.

*చివరిగా ఒక మనవి :--*

ఈ పోస్టు చూసిన ప్రతి ఒక్కరూ షేర్ చేయడం మరవద్దు. మీకు అవసరం లేకపోవచ్చు,కానీ మరొకరికి అవసరమవుతుంది అందుకే దయచేసి షేర్ చేయం డి (సేకరణ)

Daily Updates 21-10-2021

















Gemini Internet

Ananthapuramu | Chittoor | Kurnool | Cuddappah District Classifieds 21-10-2021








Gemini Internet

Recent

District Judiciary of Andhra Pradesh Recruitment 2025–26: Document Verification Schedule & Provisionally Selected Candidates List Released ఆంధ్రప్రదేశ్ జిల్లా న్యాయవ్యవస్థ నియామకాలు 2025–26: డాక్యుమెంట్ వెరిఫికేషన్ షెడ్యూల్ & ప్రొవిజనల్ ఎంపిక జాబితా విడుదల

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...