1, నవంబర్ 2021, సోమవారం

ఇప్పుడు వీడియో రికార్డింగ్ ద్వారా కూడా Pensioners Life Certificate 2021 సమర్పించవచ్చు.

మీరు ప్రభుత్వం నుంచి పెన్షన్​ను పొందుతున్నారా? అయితే త్వరపడాల్సిందే. వెంటనే వార్షిక జీవన ధ్రువీకరణ పత్రాన్ని (Pensioners Life Certificate 2021) సమర్పించాలి. లేదంటే పెన్షన్ ఆగిపోయే ప్రమాదం ఉంది! మరి ఈ సర్టిఫికేట్ ఎలా సమర్పించాలో తెలుసా?

పెన్షనర్లకు హై అలర్ట్! పెన్షన్​ను యథావిధిగా పొందాలంటే ప్రతి ప్రభుత్వ పెన్షన్​దారు.. వార్షిక జీవిత ధ్రువీకరణ (లైఫ్ సర్టిఫికేట్) పత్రాన్ని (Pensioners Life Certificate 2021) సమర్పించాల్సి ఉంటుంది. నవంబర్​లో ఈ సర్టిఫికేట్​ను (Pensioners Life Certificate) సమర్పించకపోతే.. పెన్షన్ ఆగిపోయే ప్రమాదం ఉంది! 80 ఏళ్లు పైబడిన వ్యక్తులు అక్టోబర్ 1 నుంచే లైఫ్ సర్టిఫికేట్లను సమర్పిస్తున్నారు. వీడియో కాల్ ద్వారా కూాడా ఈ సర్టిఫికేట్ సమర్పించే అవకాశం ఉంది.

ఎలా సమర్పించవచ్చంటే..

లైఫ్ సర్టిఫికేట్​ను (Pensioners Life Certificate 2021) సమర్పించేందుకు చాలా మార్గాలు ఉన్నాయి. ఆ వివరాలు ఇలా..

  • పెన్షన్ అందిస్తున్న బ్యాంకు బ్రాంచ్​కి వెళ్లి సమర్పించవచ్చు.
  • జీవన్ ప్రమాణ్ పోర్టల్​లోకి వెళ్లి ఆధార్ ద్వారా డిజిటల్ రూపంలో లైఫ్ సర్టిఫికేట్ (Pensioners Life Certificate online) అందించొచ్చు.
  • బ్యాంకింగ్ డోర్​స్టెప్ ఫెసిలిటీ ద్వారా కూడా సర్టిఫికేట్ (Pensioners Life Certificate form) సమర్పించవచ్చు. దీనికోసం 'డోర్​స్టెప్ బ్యాంకింగ్ యాప్​'లో వివరాలు నమోదు చేసుకొని పెన్షన్ అకౌంట్​ నెంబర్​ను ధ్రువీకరించాలి. కనీస రుసుముతో ఈ పని అయిపోతుంది. బ్యాంకు ప్రతినిధులే మీ ఇంటికి వచ్చి లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే ప్రక్రియను పూర్తి చేస్తారు.
  • పోస్ట్​మ్యాన్ ద్వారా ఇంటి నుంచే లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవచ్చు. ఇందుకోసం పోస్ట్ ఇన్పో మొబైల్ యాప్ లేదా ప్రభుత్వ వెబ్​సైట్​కి వెళ్లి డోర్​స్టెప్ రిక్వెస్ట్ కోసం నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత మొబైల్​కు 'ప్రమాణ్ ఐడీ' వస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈ వెసులుబాటు ఉంది. ఏ బ్యాంకులో ఖాతా ఉన్నా సరే.. ఈ సేవను వినియోగించుకోవచ్చు. ఇందుకోసం రూ.70 చెల్లించాల్సి ఉంటుంది.

ఎస్​బీఐ వీడియో కాల్ ఫీచర్

దీంతో పాటు తొలిసారి 'వీడియో లైఫ్ సర్టిఫికేట్​' సేవలను ఎస్​బీఐ ప్రవేశపెట్టింది. నవంబర్ 1 నుంచి ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. దీన్ని ఉపయోగించుకొని ఫించనుదారులు.. తమ లైఫ్ సర్టిఫికేట్లను వీడియో కాల్ చేసి సమర్పించవచ్చు.

ఎలా చేయాలంటే...?

  1. ఎస్​బీఐ పెన్షన్ సేవ పోర్టల్​లోకి వెళ్లి 'వీడియో ఎల్​సీ' అనే ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  2. ఎస్​బీఐ పెన్షన్ ఖాతా నెంబర్​ను ఎంటర్ చేసి.. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్​కు వచ్చిన ఓటీపీని వెబ్​సైట్​లో నమోదు చేయాలి.
  3. టర్మ్స్ అండ్ కండిషన్స్​ను యాక్సెప్ట్ చేసి స్టార్ట్ జర్నీ అనే బటన్​పై క్లిక్ చేయాలి.
  4. ఒరిజినల్ పాన్ కార్డును దగ్గర పెట్టుకోవాలి. ఆ తర్వాత 'ఐయామ్ రెడీ' అనే ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  5. ఎస్​బీఐ అధికారులు అందుబాటులోకి రాగానే వీడియో కాల్ ప్రారంభం అవుతుంది.
  6. స్క్రీన్ మీద కనిపించే నాలుగు అంకెల వెరిఫికేషన్ కోడ్​ను అధికారులు అడుగుతారు.
  7. ఆ తర్వాత పాన్​కార్డు ఒరిజినల్​ను చూపించాలి. దాన్ని ఫొటో తీసుకుంటారు.
  8. అనంతరం పెన్షనర్ ఫొటోను తీసుకుంటారు. దీంతో వీడియో లైఫ్ సర్టిఫికేట్ నమోదు ప్రక్రియ పూర్తవుతుంది.
  9. ఒకవేళ ఈ ప్రక్రియ విఫలమైతే.. బ్యాంకు ద్వారా మొబైల్ నెంబర్​కు సందేశం వస్తుంది.

 

 

31, అక్టోబర్ 2021, ఆదివారం

*కొత్తగా పెళ్లి చేసుకోబోయేవారికి శ్రీవారి తలంబ్రాలు* | కొత్తగా పెళ్లి చేసుకోబోయేవారికి శ్రీవారి తలంబ్రాలు

టీటీడీ ప్రస్తుతం మరో పథకాన్ని ప్రవేశపెట్టింది. కొత్తగా పెళ్లి చేసుకునే వధూవరులు, చేసుకున్న నవదంపతుల కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది.

★ తిరుమల తిరుపతి దేవస్థానం..
దేశంలో ఎన్నో గుడులు ఉండవచ్చుగాక.. కానీ తిరుమల గుడి ప్రత్యేకతే వేరు.
◆ అక్కడికి వెళ్లి ఓసారి శ్రీవారిని దర్శించుకుంటే చాలు..
 మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనసుకు ఏదో తెలియని ఉత్తేజం కలుగుతుంది. అందుకే..

★ తిరుమల తిరుపతి దేవస్థానానికి అంత ప్రత్యేకత. సాధారణంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం అంత ఈజీ కాదు. కొన్ని గంటల పాటు లైన్ లో వేచి ఉండాలి.
 నిద్రకు ఓర్చుకోవాలి.. అప్పుడే శ్రీవారి దర్శనభాగ్యం కలుగుతుంది.

🟢 టిటిడీ ప్రస్తుతం మరో పథకాన్ని ప్రవేశపెట్టింది. కొత్తగా పెళ్లి చేసుకునే దంపతులు, చేసుకున్న దంపతుల కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది.
◆ శ్రీవారికి నిత్య కల్యాణంలో పవిత్ర తలంబ్రాలను వినియోగిస్తారు. ఆ తలంబ్రాలకు కొత్త దంపతులకు అందివ్వాలని నిర్ణయించింది. కొత్తగా పెళ్లయిన, పెళ్లి చేసుకోబోయే దంపతులు స్వామి ఆశీర్వాదం కోసం ప్రత్యేకంగా తిరుమలకు రావాల్సిన అవసరం లేకుండా… వాళ్లకు డైరెక్ట్ గా ఇంటికే శ్రీవారి పవిత్ర తలంబ్రాలను అందివ్వాలని నిర్ణయించింది.

దానికోసం..
■ నూతన దంపతులు వాళ్ల పెళ్లి పత్రికను పోస్టు ద్వారా తిరుమలకు పంపించాల్సి ఉంటుంది. ఆ పెళ్లి పత్రిక ద్వారా.. నూతన దంపతులకు శ్రీవారి పవిత్ర తలంబ్రాలను పోస్టు ద్వారా ఉచితంగా పంపిస్తారు. కల్యాణ తలంబ్రాలతో పాటు కుంకుమ, కంకణాలు, కల్యాణ సంస్కృతి పుస్తకాన్ని కూడా పంపిస్తారు.

❇️ ఇంకెందుకు ఆలస్యం..

★ మీకు ఇటీవలే పెళ్లి అయిందా?
★ లేదా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా?
★ శ్రీవారి తలంబ్రాల కోసం వెంటనే టీటీడీ కాల్ సెంటర్ నెంబర్లు 0877-2233333, 2277777 ఫోన్ చేయండి.
చిరునామా: ది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, టీటీడీ అడ్మిన్ బిల్డింగ్స్, కేటీ రోడ్, తిరుపతి – 517501.
*Dept.Of PRO TTD*

ఆయుర్వేద సిద్ధ యునాని మరియు హోమియోపతి | BAMS/BUMS/BSMS/BHMS Seats 2020-2021 UG మరియు PG కోర్సులలో ఆల్ ఇండియా కోటా All India Quota (AIQ) సీట్ల కోసం కౌన్సెలింగ్ ప్రకటన

Gemini Internet click here for official website https://aaccc.gov.in/aacccug

Minority Scholarship 2021-22 | మైనారిటీ స్కాలర్ షిప్ నవంబర్ 30 దరఖాస్తుకు చివరి తేది



Minority Scholarship 2021-22 | మైనారిటీ స్కాలర్ షిప్స్ కు మీకు అర్హత ఉందా https://www.youtube.com/watch?v=IAKkWecyqOk&ab_channel=GeminiAlertsTeluguUpdates

ISRO Recruitment 2021: రూ. 1.12 లక్షల వేతనంతో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే | నవంబర్ 20 వరకు అప్లై చేసుకోవచ్చు

ఇస్రో(ISRO) నుంచి పలు ఖాళీ భర్తీకి నోటిఫికేషన్(Job Notification) విడుదలైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు నవంబర్ 20 వరకు అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో(Notification) పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్-ఇస్రో(ISRO) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను(Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ నుంచి నోటిఫికేషన్(Job Notification) విడుదలైంది. మొత్తం 6 ఖాళీలను భర్తీ చేయున్నట్లు నోటిఫికేషన్లో(Notification) పేర్కొన్నారు. జూనియర్ ట్రాన్స్ లేషన్(Translation) ఆఫీసర్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులు ఇస్రో(ISRO)కు చెందిన హ్యూమన్ స్పేస్ ఫైట్ సెంటర్(HSFC) లో పని చేయాల్సి ఉంటుంది. అయితే తాత్కాలిక పద్ధతిలో ఈ నియామకాలను(Recruitment) చేపట్టినట్లు నోటిఫికేషన్లో తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1,12,400 వేతనం చెల్లించనున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.


ఎవరు అప్లై చేయాలంటే..

-అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి హిందీలో మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి. అభ్యర్థుల డిగ్రీ లెవల్ లో ఇంగ్లిష్ కంపల్సరీ లేదా ఎలెక్టివ్ సబ్జెక్ట్(Elective Subject) అయి ఉండాలి.

-గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ చేసిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. డిగ్రీలో హిందీ కంపల్సరీ లేదా ఎలెక్టివ్ సబ్జెక్ట్ అయి ఉండాలి.

for Applications Visit Gemini Internet, Dhanalakshmi Road, Hindupur

ఇంగ్లిష్, హిందీ కాకుండా ఇతర సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ చేసిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. డిగ్రీలో హిందీ మీడియం ఉండి ఇంగ్లిష్ కంపల్సరీ లేదా ఎలక్టివ్ సబ్జెక్ట్ అయి ఉండాలి.


-హిందీ లేదా ఇంగ్లిష్ లో కాకుండా ఇతర సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ చేసిన అభ్యర్థులు సైతం ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ స్థాయిలో హందీ మీడియంలో చదివి ఉండాలి. లేదా హిందీ కంపల్సరీ లేదా ఎలెక్టివ్ సబ్జెక్ట్ అయి ఉండాలి.

-హిందీ లేదా ఇంగ్లిష్ కాకుండా ఇతర సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. హిందీ మరియు ఇంగ్లిష్ కంపల్సరీ లేదా ఎలెక్టీవ్ సబ్జెక్టులు అయి ఉండాలి. డిగ్రీ స్థాయిలో ఆ సబ్జెక్టులు కంపల్సరీ లేదా ఎలెక్టివ్ అయి ఉండాలి.

-ఈ విద్యార్హతలతో పాటు అభ్యర్థులు హిందీ నుంచి ఇంగ్లిష్, ఇంగ్లిష్ నుంచి హిందీ భాషకు ట్రాన్స్ లేషన్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. లేదా ట్రాన్స్ లేషన్ లో రెండేళ్ల అనుభవం ఉండాలి. అభ్యర్థులు ఇతర పూర్తి విద్యార్హతల వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.


ఎలా అప్లై చేయాలంటే..
-అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో ఇస్రో అధికారిక వెబ్ సైట్లో (https://www.isro.gov.in/)అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
-ఈ ఖాళీలకు దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 30న ప్రారంభమైంది. దరఖాస్తులకు నవంబర్ 20ని ఆఖరి తేదీగా నిర్ణయించారు.
-అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేయాల్సి ఉంటుంది.
-దరఖాస్తు చేసే సమయంలో అభ్యర్థులు రూ. 250 పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
-రాత పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
-అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.