ఆర్థికంగా ఎదగాలని అందరూ కోరుకుంటారు. అయితే ఈ విషయంలో కొందరు మాత్రమే
సక్సెస్ అవుతారు. చాలామంది ఒకే ఒక్క ఆదాయ మార్గంతోనే జీవితం
వెళ్లదీస్తుంటారు. ఇంకేమైనా ఆదాయమార్గాలున్నాయేమో కూడా ఆలోచించరు. అయితే ఈ
రోజుల్లో ఒక్క ఆదాయమార్గంతో ఇల్లు గడవడం చాలా కష్టం. ప్రస్తుతం మనిషి
అవసరాలకు తోడు ధరలు కూడా పెరిగిపోతున్నాయి. పలు విధాలుగా సౌకర్యాలను
అందించే వస్తువులు అందుబాటులోకి వస్తున్నాయి. అందుకే మల్టిపుల్ సోర్సెస్
గురించి అందరూ ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు మీ ఆదాయాన్ని పెంచే
ఆరు మార్గాల గురించి తెలుసుకుందాం.
Gemini Internet
1. ఏదో ఒక విద్యలో నైపుణ్యం పెంచుకోవడం
ఈ రోజులల్లో
అన్నిరంగాలలోనూ నిపుణుల ఆవశ్యకత మరింతగా పెరుగుతోంది. అందుకే ప్రతీ ఒక్కరూ
ఏదో ఒక రంగంలో నిపుణత సాధించాలి. మిగిలినవారికన్నా ఏదోఒక ప్రత్యేక
పరిజ్ఞానం కలిగివుండాలి. అప్పుడు మీ సేవలు ఏదో ఒక సంస్థ స్వీకరించి మీకు
ఆదాయ మార్గాన్ని ఏర్పరుస్తుంది. శాస్త్రీయ సంగీతం మొదలు కొని కంటెంట్
రైటింగ్ వరకూ ఏదైనా సరే మీకు ఇష్టమైన విద్యను నేర్చుకోవచ్చు.
2. మీ స్కిల్స్ పదిమందికీ తెలియజేయండి
ఈ
రోజుల్లో తమ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతీఒక్కరూ
పరితపిస్తున్నారు. ఏదో ఒకవిధంగా ఆదాయం సంపాదించాలని అనుకుంటున్నారు. అందుకే
మీకున్న స్కిల్స్ పదిమందికీ తెలియజేసి ఆదాయ మార్గాలను ఏర్పరుచుకోండి.
ఇప్పుడున్న పరిస్థితుల్లో వీడియో ఎడిటింగ్, ఆన్‌లైన్ క్లాసులు, ఆర్టికల్
రైటింగ్, కొత్త భాష నేర్పడం, కోడింగ్, కుకింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్,
డిజిటల్ మార్కెటింగ్, ఆన్‌లైన్ సెల్లింగ్ మొదలైనవన్నీ మంచి ఆదాయాన్ని
అందిస్తున్నాయి.
3 పాసివ్ ఇన్కమ్ సోర్సెస్ ఏర్పాటు చేసుకోండి
ఈ
రోజుల్లో చాలామంది పాసివ్ ఇన్కమ్ సోర్సెస్‌పై ఆధారపడుతున్నారు. ఒకసారి
పనిచేసి జీవితాంతం ఆదాయం అందుకోవడం పాసివ్ ఇన్కమ్ సోర్సెస్‌తో
సాధ్యమవుతుంది. దీనిని స్మార్ట్ ఇన్కమ్ అని చెప్పుకోవచ్చు. ఈ విభాగంలోకి
బ్లాగింగ్, బుక్ రైటింగ్, రాయల్టీ ఇన్కమ్, ఆన్‌లైన్ కోర్సులు అందించడం,
రెంటల్ ఇన్కమ్ మొదలైనవన్నీ పాసివ్ ఇన్కమ్ కోవలోకి వస్తాయి.
సైడ్ బిజినెస్ చేయడం
మీరు
మీ ఆదాయ మార్గాన్ని పెంచుకోవాలంటే సైడ్ బిజినెస్ ఏర్పాటు చేసుకోవాలి. 8
గంటలపాటు ఏదోఒక ఉద్యోగం చేసిన తరువాత మరో 6 గంటల సమయంలో మరో ఆదాయ
మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ సమయంలో మీకు అభిరుచి కలిగిన వ్యాపారాన్ని
చేయవచ్చు. యూట్యూబ్ ఛానల్ నిర్వహించడం, కోచింగ్ సెంటర్ నడపడం, జనరల్
స్టోర్ నడపడం మొదలైనవి చేయడం ద్వారా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు.
ఇన్వెస్ట్‌మెంట్ చేయడం
అదనపు
ఆదాయాన్ని అందుకునేందుకు ఇన్వెస్ట్‌మెంట్ చేయడమనేది మరో ఉత్తమ మార్గం.
తగిన మొత్తంలో వివిధ బ్యాంకులు లేదా పోస్టల్ పథకాలలో పెట్టుబడులు పెట్టడం
ద్వారా మీరు ప్రతీనెలా ఆదాయాన్ని అందుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ
విధానంలో ఆదాయాన్ని వృద్ధి చేసేందుకు కూడా అవకాశం ఉంటుంది.
హాబీలను ఆదాయ మార్గాలుగా మార్చుకోవడం
మీకున్న
హాబీలను ఆధారంగా చేసుకుని ఆదాయాన్ని సంపాదించవచ్చు. ఇష్టమైన పనులు చేయడం
ద్వారా ఆదాయాన్ని సంపాదించడం మరింత ఆనందాన్ని కలిగిస్తుంది. మీకు రాయడం
అంటే ఇష్టముంటే పుస్తకాలు రాయవచ్చు లేదా బ్లాగ్ నిర్వహించవచ్చు. మెహందీ
దగ్గర నుంచి పెయింటింగ్ వరకూ ఇలా ఏ హాబీనైనా ఆదాయమార్గంగా మార్చుకోవచ్చు.