అప్లికేషన్ల కోసం సంప్రదించండి GEMINI ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
1. పరిచయం అక్కర్లేని సెర్చ్ ఇంజిన్, ఇంటర్నెట్ సేవల దిగ్గజ కంపెనీ అయిన
గూగుల్ (Google) విద్యార్థినులకు స్కాలర్‌షిప్ ప్రకటించింది. 'జనరేషన్
గూగుల్ స్కాలర్‌షిప్' (Generation Google Scholarship) పేరుతో ఆర్థిక
సహకారాన్ని ప్రకటించింది. కంప్యూటర్ సైన్స్‌లో విద్యను అభ్యసిస్తున్న
విద్యార్థినులు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేయొచ్చు.
Gemini Internet
2. డిగ్రీ చదువుతున్న అమ్మాయిలు మాత్రమే ఈ స్కాలర్‌షిప్‌కు అప్లై చేయాలి. ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. విద్యార్థినులు 2021 డిసెంబర్ 10 లోగా అప్లై చేయాలి. ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైనవారికి 2022-23 విద్యాసంవత్సరానికి 1000 డాలర్లు అంటే సుమారు రూ.74,000 స్కాలర్‌షిప్ లభిస్తుంది.
3. ఈ స్కాలర్‌షిప్‌ను కంప్యూటర్ సైన్స్, టెక్నాలజీ లేదా సంబంధిత టెక్నికల్ ఫీల్డ్‌లో డిగ్రీ చదువుతున్న విద్యార్థినులకు మాత్రమే ప్రకటించింది గూగుల్. దరఖాస్తుదారులు నాయకత్వాన్ని ప్రదర్శించడంతో పాటు కంప్యూటర్ సైన్స్, టెక్నాలజీలో ప్రాతినిధ్యం లేని బృందాలను మెరుగుపర్చేందుకు తమ అభిరుచిని, ఆసక్తిని ప్రదర్శించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఈ విద్యాసంవత్సరంలో అంటే 2021-2022 లో ఫుల్ టైమ్ బ్యాచిలర్స్ డిగ్రీ చదువుతున్నవారు మాత్రమే అప్లై చేయాలి. ఆసక్తి గల విద్యార్థినులు buildyourfuture.withgoogle.com వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత Scholarships+ ట్యాబ్ పైన క్లిక్ చేయాలి.
5. ఆ తర్వాత Generation Google Scholarship (Asia Pacific) ట్యాబ్ పైన క్లిక్ చేయాలి. నియమనిబంధనలు చదివిన తర్వాత APPLY NOW పైన క్లిక్ చేయాలి. తర్వాత గూగుల్ అకౌంట్ యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి. పేరు, ఇతర వివరాలు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత విద్యార్థినికి సంబంధించిన మరిన్ని వివరాలు, కాంటాక్ట్ వివరాలు ఎంటర్ చేయాలి.
6. తర్వాతి సెక్షన్‌లో విద్యార్హతల వివరాలు ఎంటర్ చేయాలి. రెజ్యూమె, అకడమిక్ ట్రాన్స్‌స్క్రిప్ట్స్, ఎస్సే ప్రశ్నలకు సమాధానాలు అప్‌లోడ్ చేయాలి. దరఖాస్తుల్ని 2021 డిసెంబర్ 10 లోగా సబ్మిట్ చేయాలి. అప్లికేషన్స్ విజయవంతంగా సబ్మిట్ చేసిన తర్వాత గూగుల్ నుంచి మెయిల్ వస్తుంది. దరఖాస్తుల్ని పరిశీలించిన తర్వాత స్కాలర్‌షిప్‌కు కొందర్ని ఎంపిక చేస్తుంది గూగుల్.
7. వైవిధ్యం, సమానత్వం, విద్యాభ్యాసంలో పనితీరు లాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ స్కాలర్‌షిప్ ఇస్తామని గూగుల్ ప్రకటించింది. వారికి 1,000 డాలర్ల స్కాలర్‌షిప్ లభిస్తుంది. ఈ స్కాలర్‌షిప్‌కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే విద్యార్థినులు generationgoogle-apac@google.com మెయిల్ ఐడీలో సంప్రదించొచ్చు.
6వ తరగతి దరఖాస్తు ఫారమ్ లో సరిదిద్దుకునే/కరెక్షన్ విండో డిసెంబర్ 16, 2021న తెరవబడుతుంది.
JNVST 2022 తరగతి 6 ఎంపిక పరీక్షను నవోదయ విద్యాల సమితి రెండు గంటల పాటు నిర్వహిస్తుంది.
అభ్యర్థులు navodaya.gov.inలో మరింత వివరణాత్మక సమాచారాన్ని పొందవచ్చు.
Gemini Internet
https://www.youtube.com/watch?v=9NEqnsefRP4&ab_channel=HindupurInfo.fromGemini
Javahar నవోదయ విద్యాలయ 6వ తరగతి ఎంపిక పరీక్ష 2022 ఏప్రిల్ 30, 2022న నిర్వహించబడుతుంది. నవోదయ విద్యాల సమితి లేదా NVS దరఖాస్తు ఫారమ్‌ను సవరించడానికి దిద్దుబాటు విండో తేదీలను విడుదల చేసింది. మరింత సమాచారం navodaya.gov.in లో చూడవచ్చు.
నవోదయలో 6వ తరగతి ప్రవేశ పరీక్ష కోసం ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్ను సమర్పించడానికి చివరి తేదీ డిసెంబర్ 15, 2021 అని అభ్యర్థులు గమనించాలి. నవోదయ విద్యాలయ సమితి ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, అభ్యర్థులు డిసెంబర్ 16న దిద్దుబాటు విండోను పొందగలుగుతారు. నోటీసు ప్రకారం, "6వ తరగతి JNVST 2022కి సంబంధించిన దిద్దుబాటు విండో 2021 డిసెంబర్ 16 మరియు 17 వరకు తెరిచి ఉంటుంది. VI తరగతి JNVST 2022 కోసం ఇంతకముందే అప్లై చేసుకున్న అభ్యర్థుల డేటాలో సవరణ జెండర్ అంటే స్త్రీ లేదా పురుషుడు, కేటగిరీ అంటే జనరల్/ఓబీసీ/ఎస్సీ/ఎస్టీ, ఏరియా (రూరల్ అంటే గ్రామీణ /అర్బన్ అంటే పట్టణ లేదా నగర ప్రాంతాలు), అలాగే వైకల్యం మరియు పరీక్షా మీడియం లాంటి వివరాలను మాత్రమే కరెక్షన్ కు అనుమతించబడుతుంది.
అందువల్ల, అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పుట్టిన తేదీ వంటి వారి ఆధారాలతో లాగిన్ చేయడం ద్వారా పైన పేర్కొన్న కేటగిరీలలో మాత్రమే మార్పులు చేయగలరు. ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్-navodaya.gov.inకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు మొదట పేరు, ఇమెయిల్ ఐడి, చిరునామా, ఆధార్ నంబర్, మునుపటి పాఠశాల వివరాలు మరియు ఇతర వివరాలను పూరించడం ద్వారా నమోదు చేసుకోవాలని గమనించాలి. దీని తరువాత, అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను పూరించగలరు. అభ్యర్థులు భవిష్యత్ సూచన కోసం దరఖాస్తు ఫారమ్ కాపీని ఉంచుకోవాలని సూచించారు.
JNVST 2022 తేదీ
ఈవెంట్ తేదీ
JNVST 2022 దిద్దుబాటు విండో డిసెంబర్ 16 & 17, 2021న తెరవబడుతుంది
JNVST 2022 పరీక్ష ఏప్రిల్ 30, 2022
JNVST 2022 6వ తరగతి ఎంపిక పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా వివిధ భాషల్లో నిర్వహించబడుతుంది. పరీక్ష రెండు గంటల వ్యవధిలో ఉంటుంది మరియు పరీక్షలో మొత్తం మార్కుల సంఖ్య 100. అభ్యర్థులు మానసిక సామర్థ్యం, అంకగణితం మరియు భాష నుండి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు జరగనుంది. OMR షీట్ రాయడానికి అభ్యర్థులు నలుపు మరియు నీలం బాల్ పాయింట్ పెన్ను మాత్రమే ఉపయోగించాలని అభ్యర్థులు గమనించాలి. అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యే ముందు NVS విడుదల చేసిన మొత్తం అధికారిక నోటిఫికేషన్‌ను చూడాలని సూచించారు.
ఇవి కూడా చూడండి
PM-SYM: రోజుకు 2 రూపాయలు చెల్లించండి.. ఈ పథకం ద్వారా నెలకు 3 వేల రూపాయల పెన్షన్ పొందండి.. ఎలా అంటే.. https://speedjobalerts.blogspot.com/2021/12/pm-sym-2-3.html
పెన్షన్‌పైనా పన్ను ఉంటుందా? పన్ను పడకపోవడానికి ఛాన్స్ ఎంతంటే.. https://speedjobalerts.blogspot.com/2021/12/blog-post.html
LIC Loan: మీరు ఎల్ఐసీ పాలసీదారా.. అయితే తక్కువ వడ్డీకే రుణం తీసుకోవచ్చు.. ఎలాగంటే. https://speedjobalerts.blogspot.com/2021/12/lic-loan.html
Personal Finance: ఈ పోస్టాఫీస్ స్కీంతో అధిక రిటర్న్స్, ప్రభుత్వ హామీ https://speedjobalerts.blogspot.com/2021/12/personal-finance.html
| Event | Date |
| JNVST 2022 Correction Window opens | December 16 & 17, 2021 |
| JNVST 2022 Exam | April 30, 2022 |
PM-SYM: ప్రతి మనిషికీ జీవిత కాలంలో బాధ్యతల బరువులు మోసిన తరువాత వృత్తి, ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ తీసుకోవడం సహజం. పదవీవిరమణ అంటే రిటైర్మెంట్ తీసుకున్న తరువాత జీవితం నడవాలంటే ప్రతి నెల కొంత ఆదాయం తప్పనిసరిగా అవసరం అవుతుంది. అయితే, ప్రభుత్వ ఉద్యోగులకు.. కొన్ని ప్రైవేట్ కొలువులకు రిటైర్మెంట్ తరువాత పెన్షన్ అందే సౌకర్యం ఉంది. కానీ, అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల్ ఆపరిస్థితి దీనికి భిన్నం. కాలూ..చెయ్యి పనిచేయడం మొరాయిస్తే వీరి జీవితం కష్టాల కొలిమిలో పడిపోయినట్టే. వీరికి రిటైర్మెంట్ అనే పదం అంటేనే భయం పుడుతుంది. ఎందుకంటే.. పని మానేసి ఇంటిలో కూచుంటే వారికి కాలం గడిచే పరిస్థితి ఉండదు. అందుకోసమే.. ఇటువంటి వారికి సహకరించేలా రెండేళ్ళ క్రితం కేంద్ర ప్రభుత్వం ఒక పధకాన్ని తీసుకువచ్చింది. ఇప్పుడు ఈ పధకంలో చేరే వారి సంఖ్యా ఎక్కువ అవుతుంది.
కేంద్రం తెచ్చిన ఈ పథకం ఏమిటి?
ఈ పథకం పేరు ప్రధాన్ మంత్రి శ్రమయోగి మంధన్ యోజన అంటే PM-SYM. అసంఘటిత రంగ కార్మికులకు నెలవారీ పింఛను అందించేందుకు 2019లో ఈ పథకాన్ని ప్రారంభించారు. 60 ఏళ్లు నిండిన అసంఘటిత రంగ కార్మికులకు నెలకు 3,000 రూపాయల పింఛను అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. PM-SYM స్కీమ్‌కు విశేష స్పందన లభించింది. ఇప్పటి వరకు అసంఘటిత రంగానికి చెందిన 45,77,295 మంది కార్మికులు ఈ పథకం కింద నమోదు చేసుకున్నారు.
ప్లాన్ ఇలా ఉంది…
Gemini Internet
ప్రశ్న: నా పెన్షన్ రూ. 3,60,000. సేవింగ్స్ లేవు. ఇతర ఆదాయాలు లేవు. పెన్షన్ మీద పన్ను పడుతుందా?
: యం. మంగతాయారు, రాజమండ్రి
సమాధానం: ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. పెన్షన్ కూడా జీతంలాగే పన్నుకు గురయ్యే ఆదాయం. ఎటువంటి మినహాయింపు లేదు. పన్ను భారం లెక్కించేటప్పుడు ఆదాయంలాగే పరిగణనలోకి తీసుకోవాలి. రెండో విషయం .. మీకు సంబంధించిన ఇతర ఆదాయాలు ఏవీ లేవని అంటున్నారు కాబట్టి, మీ కేసులో మీరు 60 సం.లు. దాటినట్లయితే బేసిక్ లిమిట్ రూ. 3,00,000 అవుతుంది. బేసిక్ లిమిట్ దాటినా నికర ఆదాయం రూ. 5,00,000 లోపల ఉంటే పన్ను భారం లెక్కించిన తర్వాత రిబేటు ఉండటం వల్ల ఎటువంటి పన్ను భారం ఉండదు. సెక్షన్ 87 అ ద్వారా రిబేటు లభిస్తుంది. పెన్షన్‌లో నుంచి రూ. 50,000 తగ్గిస్తారు. ఈ తగ్గింపును స్టాండర్డ్ డిడక్షన్ అంటారు. కానీ ఫ్యామిలీ పెన్షన్‌ని జీతంగానూ, పెన్షన్‌గానూ భావించరు. ఆ మొత్తాన్ని ‘ఇతర ఆదాయం’గా పరిగణించి, అందులో నుంచి 1/3వ భాగం లేదా రూ. 15,000 ..ఈ రెండింటిలో ఏది తక్కువైతే .. ఆ మొత్తాన్ని మినహాయింపుగా ఇస్తారు. ఏ పెన్షన్ అయినా పన్నుభారానికి గురి అవుతుంది. బేసిక్ లిమిట్ లోపల ఉన్నా .. రూ. 5,00,000 లోపల ఉన్నా రిబేటు పొందడం ద్వారా పన్ను పడకపోవచ్చు.
-----------
ప్రశ్న: నేను
గత వారం ఆదాయపు పన్ను రిటర్న్ వేసి రిఫండ్ క్లెయిమ్ చేశాను. ఈ రోజు
రిఫండ్ .. నా బ్యాంకు అకౌంట్లో జమ అయింది. ఎటువంటి సమాచారం /ఆర్డర్లు /
ఉత్తరాలు రాలేదు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
: యం. శంకరరావు, సికింద్రాబాద్
సమాధానం: అవును. ఇప్పుడు చాలా త్వరగా అసెస్‌మెంట్ చేస్తున్నారు. సెంట్రల్ ప్రాసెసింగ్ సెల్ ద్వారా జరుగుతోంది. అన్ని అంశాలు .. అంటే ఆదాయం, తగ్గింపులు, మినహాయింపులు, పన్ను చెల్లింపులు, బ్యాంకు అకౌంట్ వివరాలు మొదలైనవి సరిగ్గా ఉంటే సత్వరం రిఫండ్ ఇస్తున్నారు. ముందుగా 143 (1) ప్రకారం ఆర్డరు మీకు ఈమెయిల్ ద్వారా వస్తుంది. చెక్ చేసుకోండి. 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను మీ అసెస్‌మెంట్ అయినట్లు. ఏమీ గాభరా పడక్కర్లేదు. అయితే, కొన్ని మార్గదర్శకాలను అనుసరించి ‘‘స్క్రూటినీ’’ ఎంపిక చేస్తే మాత్రం మళ్లీ అసెస్‌మెంట్ చేస్తారు.
----------------
ప్రశ్న:2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను కాస్ట్ అప్ ఇన్‌ఫ్లేషన్ ఇండెక్స్ ఎంత ఉంది. దీన్ని ఎలా నిర్ణయిస్తారు?
: జె.వి.యస్. యన్. మూర్తి, హైదరాబాద్
సమాధానం: 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ ఇండెక్స్‌ను 317గా నిర్ణయించి, ఆ మేరకు నోటిఫికేషన్ ఎప్పుడో జారీ చేశారు. ప్రతి సంవత్సరం ఇది మారుతుంటుంది. దేశంలో ఉన్న ద్రవ్యోల్బణం .. అంటే ధరల పెరుగుదల సూచికను బట్టి కేంద్ర ప్రభుత్వంలోని నిపుణులు ఈ ఇండెక్స్ లెక్కిస్తారు. ఆదాయపు పన్ను విభాగం ఒక నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తుంది. ఈ సంవత్సరంలో జరిగే స్థిరాస్తి క్రయ విక్రయాలు, ఇతర క్యాపిటల్ ఆస్తులు, షేర్లు మొదలైన వాటికి దీన్ని వర్తింపచేస్తారు.
పన్నుకు సంబంధించిన సందేహాలు business@sakshi.com ఈ–మెయిల్ పంపించగలరు.
Gemini Internet
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థ. ఈ సంస్థకు లక్షల్లో పాలసీదారులు ఉన్నారు. అయితే LIC తన పాలసీదారులకు రుణ సౌకర్యంతో సహా అనేక సదుపాయాలను అందిస్తుంది. మీకు ఎల్‌ఐసీ పాలసీని ఉంటే సులభంగా పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. దీని వడ్డీ రేటు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల కంటే తక్కువగా ఉంది. వ్యక్తిగత రుణంపై ఎల్‌ఐసీ వడ్డీ రేటు 9 శాతం నుంచి ప్రారంభమవుతుంది. మీ ఎల్‌ఐసీ పాలసీపై మీరు ఎంత రుణం పొందుతారు అనేది మీ ఆదాయంపై ఆధారపడి ఉంటుంది.
రుణ కాల వ్యవధి 5 సంవత్సరాలు ఉంటుంది. లోన్ మొత్తం పాలసీ సరెండర్ విలువపై ఆధారపడి ఉంటుంది. అందులో 90% వరకు లోన్ పొందవచ్చు. మీ పాలసీ సరెండర్ విలువ రూ. 5 లక్షలు అయితే మీరు దానిపై 4.5 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. దీని అతి పెద్ద ఫీచర్ ఏమిటంటే.. మీరు లోన్ కాలపరిమితికి ముందు చెల్లిస్తే ప్రత్యేక ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. దీనిని ఫోర్‌క్లోజర్ ఛార్జ్ అని కూడా అంటారు.
అయితే LIC పర్సనల్ లోన్‌పై వడ్డీ రేటు ఎంత అనేది పూర్తిగా దరఖాస్తుదారు క్రెడిట్ ప్రొఫైల్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ ప్రొఫైల్‌లో రుణదాత ఆదాయం, అతను చేసే ఉపాధి పను, లోన్ మొత్తం ఎంత, రుణం తిరిగి చెల్లించే వ్యవధి ముఖ్యమైనవి. రుణ రేటు ఈ అంశాలన్నింటిపై ఆధారపడి ఉంటుంది. రుణంపై వడ్డీ రేటు ఫ్లాట్ రేట్ లేదా ఫ్లాట్ బ్యాలెన్స్ పద్ధతిని ఉపయోగించి లెక్కిస్తారు. దీనిలో రుణం మొత్తంపై వడ్డీ వసూలు చేస్తారు. మీరు 5 లక్షల రుణం తీసుకుని క్రమంగా దాన్ని తిరిగి చెల్లించి 2 లక్షలకు తీసుకొచ్చారనుకోండి, అప్పుడు ఆ 2 లక్షలకు మాత్రమే వడ్డీ వసూలు చేస్తారు.
EMI ఎంత ఉంటుంది
సంవత్సరకాలానికి ఒక వ్యక్తి 9% చొప్పున రూ.1 లక్ష రుణం తీసుకుంటే అతను నెలకు రూ. 8,745 EMI చెల్లించాల్సి ఉంటుంది. రుణాన్ని 2 సంవత్సరాల కాలవ్యవధికి తీసుకుంటే అప్పుడు రూ. 4,568 EMI ఉంటుంది. 3 సంవత్సరాల పాటు రుణంపై రూ. 3,180 EMI ఉంటుంది. రుణాన్ని 4 సంవత్సరాల కాలవ్యవధికి తీసుకుంటే, అప్పుడు రూ. 2,489 EMI ఉంటుంది. 5 సంవత్సరాల పాటు రుణం తీసుకుంటే, 2,076 EMI ఉంటుంది.
మీరు 5 లక్షల వ్యక్తిగత రుణం తీసుకున్నట్లయితే, 1 సంవత్సరం కాలానికి నెలకు రూ. 44,191 EMI ఉంటుంది. 2 సంవత్సరాల లోన్ కాలవ్యవధిలో 23,304 EMI ఉంటుంది.3 సంవత్సరాల కాలవ్యవధితో రుణంపై EMI రూ. 18,472 అవుతుంది. 4 సంవత్సరాలకు రూ. 15,000 EMI, 5 సంవత్సరాల కాలవ్యవధితో రుణంపై రూ. 12,917గా ఉంటుంది.
రుణం ఎలా తీసుకోవాలి
మీరు లోన్ తీసుకోవడానికి LIC వెబ్‌సైట్‌ని సందర్శించవచ్చు. మీరు ఈ వెబ్‌సైట్‌లో రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ఫారమ్‌లో వివరాలు నమోదు చేసిన తర్వాత, దాన్ని డౌన్‌లోడ్ చేయండి. ఈ ఫారమ్‌ను ప్రింట్ అవుట్ తీసుకుని, సంతకం చేసిన తర్వాత స్కాన్ చేసి ఎల్‌ఐసీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయండి. ఇలా చేసిన తర్వాత రుణ దరఖాస్తు పూర్తవుతుంది. దీని తర్వాత, LIC మీ దరఖాస్తును ధృవీకరించి, లోన్ జారీ ప్రక్రియను ప్రారంభిస్తుంది. ప్రక్రియ పూర్తయిన తర్వాత, లోన్ మొత్తం మీ బ్యాంక్ ఖాతాకు ఆన్‌లైన్‌లో బదిలీ చేస్తారు.
Gemini Internet
సురక్షిత పెట్టుబడికి చాలామంది బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్స్‌ను ఎంచుకుంటారు. రిస్క్‌ను ఇష్టపడని వారు ఫిక్స్డ్ డిపాజిట్స్ వైపు మొగ్గు చూపుతారు. ఫిక్స్డ్ డిపాజిట్స్‌తో పాటు పోస్టాఫీస్ పథకాలు కూడా సురక్షితమైనవి. అంతేకాదు, ఇక్కడ పలు పథకాల్లో ఫిక్స్డ్ డిపాజిట్స్ కంటే అధిక వడ్డీరేటు వస్తుంది. కరోనా కంటే ముందు బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్స్ (FD) పైన అధిక వడ్డీ రేటును ఇచ్చాయి. కరోనా నేపథ్యంలో ఆర్బీఐ వడ్డీ రేట్లను భారీగా తగ్గించడంతో బ్యాంకులు కూడా FD వడ్డీ రేటును కనిష్టాలకు తీసుకెళ్లాయి. ప్రస్తుతం బ్యాంకుల్లో 5 శాతం కంటే తక్కువ వడ్డీ రేటు వస్తోంది.
అదే సమయంలో పోస్టాఫీస్ పథకాల్లో 5.5 శాతం నుండి 6.7 శాతం వరకు ఉంది. పోస్టాఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ప్రభుత్వ గ్యారెంటీతో పాటు మంచి రిటర్న్స్ ఉంటాయి. వడ్డీ రేటు ప్రయోజనం త్రైమాసికం పరంగా ఉంటుంది.
పోస్టాఫీస్ FDలో ఇన్వెస్ట్ చేయడం చాలా సులభం. పోస్టాఫీస్ FDలో ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, అయిదేళ్ల కాలపరిమితి ఉంది.

పోస్టాఫీస్ FD ప్రయోజనాలు
- పోస్టాఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన ప్రభుత్వ హామీ ఉంటుంది.
- ఇందులో ఇన్వెస్టర్ మనీ పూర్తి సురక్షితం.
- ఆఫ్ లైన్(క్యాష్, చెక్కు రూపంలో) రూపంలోను ఇందులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయవచ్చు. లేదా ఆన్ లైన్(నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్) రూపంలోను ఇన్వెస్ట్ చేయవచ్చు.
- ఒక FDకి మించి మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు.
- జాయింట్ అకౌంట్ రూపంలోను FDని ఓపెన్ చేయవచ్చు.
- అయిదేళ్ల కాలపరిమితికి ఫిక్స్డ్ డిపాజడిట్ చేస్తే ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో పన్ను మినహాయింపు ఉంది.
- ఒక పోస్టాఫీస్ నుండి మరో పోస్టాఫీస్‌కు fdని ట్రాన్సుఫర్ చేసుకోవచ్చు.
- కనీసం రూ.1000 నుండి ప్రారంభించవచ్చు. గరిష్ట పరిమితి లేదు.
- సాధారణంగా వడ్డీ రేట్లు 7 రోజుల నుండి 10 రోజుల కాలపరిమితిపై 5.50 శాతం ఉంది. మూడేళ్ల నుండి అయిదేళ్ల కాలపరిమితిపై 6.70 శాతం వడ్డీ రేటు ఉంది.
Gemini Internet
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...