17, ఫిబ్రవరి 2022, గురువారం

RBI Assistant Recruitment 2022: ఆర్బీఐలో 950 అసిస్టెంట్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల

RBI Assistant 2022 jobs: భారత ప్రభుత్వ రంగానికి చెందిన సెంట్రల్ బ్యాంక్‌, రెగ్యులేటరీ సంస్థ అయిన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (Reserve Bank of India) దేశ వ్యాప్తంగా అన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శాఖల్లో అసిస్టెంట్‌ పోస్టుల (Assistant Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం.

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 950

పోస్టుల వివరాలు: అసిస్టెంట్ పోస్టులు

హైదరాబాద్‌లో: 25

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు డిసెంబర్‌1, 2021నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.15,000ల నుంచి రూ.28,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఉత్తీర్ణత సాధిస్తే చాలు. పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు తమ స్థానిక భాషలో ప్రావీణ్యత కలిగి ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, లాంగ్వేజ్‌ ప్రొఫిషెన్సీ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:

  • ఓబీసీ/జనరల్‌ అభ్యర్ధులకు: రూ.450
  • ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు: రూ.50

ఆన్‌లైన్‌ పరీక్షలు: 2022, మార్చి 26, 27 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 8, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

click here for official notification Gemini Internet

16, ఫిబ్రవరి 2022, బుధవారం

ECIL Recruitment 2022: బీఈ/బీటెక్‌ అర్హతతో ఈసీఐఎల్‌ హైదరాబాద్‌ నోటిఫికేషన్‌.. రాత పరీక్షలేకుండానే ఉద్యోగాలు

ECIL Project Engineer Recruitment 2022: భారత ప్రభుత్వ రంగానికి చెందిన హైదరాబాద్‌ ప్రధానకేంద్రంగా ఉన్న ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ (ECIL) ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 12

విభాగాల వారీగా ఖాళీల వివరాలు:

  • టెక్నికల్‌ ఆఫీసర్లు: 3
  • టెక్నికల్‌ అసిస్టెంట్లు: 4
  • సైంటిఫిక్‌ అసిస్టెంట్లు: 4
  • జూనియర్‌ ఆర్టిజన్‌: 1

పే స్కేల్‌: నెలకు రూ.18,824ల నుంచి రూ.25,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

వయోపరిమితి: అభ్యర్దుల వయసు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత సబ్జెక్టుల్లో ఐఐటీ, ఇంజనీరింగ్‌ డిప్లొమా, బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధులకు టెక్నికల్‌ నాలెడ్జ్‌ అవసరం.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

ఇంటర్వ్యూ తేదీ: ఫిబ్రవరి 25, 2022.

అడ్రస్‌: నోటిఫికేషన్‌లో తెల్పిన విధంగా సంబంధిత రాష్ట్రాల్లోని ఈసీఐఎల్ జోనల్‌ కార్యాలయాల్లో ఇంటర్వ్యూలకు హాజరవ్వాలి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Gemini Internet

15, ఫిబ్రవరి 2022, మంగళవారం

అగ్రికల్చర్ విభాగంలో 8th పాస్ తో వ్రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు

ANGRAU వ్యవసాయ శాఖ పరిధిలోని ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటి నుండి కేవలం 8th అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా సెమి స్కిల్ల్డ్ లేబర్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు Gemini Internet

పోస్టులు సెమి స్కిల్ల్డ్ లేబర్, ల్యాబ్ టెక్నీషియన్
ఖాళీలు07
వయస్సు• 35 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు


విద్యార్హతలుసెమి స్కిల్ల్డ్ లేబర్ – 8వ తరగతి ఉత్తీర్ణత.
• బయో ఫర్టిలైజర్ విభాగంలో అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత కల్పిస్తారు.
ల్యాబ్ టెక్నీషియన్ – సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా బీటెక్ వుత్తీర్ణత
• బయో ఫర్టిలైజర్ విభాగంలో అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత కల్పిస్తారు.
నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు.
దరఖాస్తు విధానం • ఇంటర్వ్యూ కు హాజరయ్యే సందర్భంలో అప్లికేషన్ ఫామ్ తీసుకెళ్తే సరిపోతుంది.
• క్రింది అప్లికేషన్ ఫామ్ యొక్క లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోగలరు.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 00/-
ఇంటర్వ్యూ తేదీఫిబ్రవరి 17, 2022
ఎంపిక విధానంఇంటర్వ్యూ.

 ANGRAU Recruitment 2022 Application Form Links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్

IISC Bangalore Recruitment 2022: బీటెక్‌/ఎంటెక్‌ అర్హతతో బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూ్‌ట్‌ ఆఫ్‌ సైన్స్‌లో ఉద్యోగాలు.

IISC Bangalore Recruitment 2022: బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూ్‌ట్‌ ఆఫ్‌ సైన్స్‌ (IISc) తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ (Project Staff job) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 13

పోస్టుల వివరాలు:

  • ప్రిన్సిపల్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్ (సివిల్‌, ఎలక్ట్రికల్‌): 2
  • సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్ (సివిల్‌, ఎలక్ట్రికల్‌): 4
  • ప్రాజెక్ట్‌ అసోసియేట్ (సివిల్‌, ఎలక్ట్రికల్‌): 6
  • ప్రోగ్రాం అసిస్టెంట్‌: 1

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: పోస్టును బట్టి నెలకు రూ.28,000ల నుంచి 49,000లవరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో అనుభవం కూడా ఉండాలి. టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 3, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

 

Gemini Internet

TCS Recruitment 2022: రూ. 7 లక్షల ప్యాకేజీతో టీసీఎస్‌లో ఉద్యోగాలు

TCS Jobs: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) క్యాంపస్ డిజిటల్ హైరింగ్ 2022 పేరుతో ఓ రిక్రూట్ మెంట్ డ్రైవ్‌ నిర్వహిస్తోంది. ఇంజనీర్లు, ఎంసీఎ, ఎమ్మెస్సీ డిగ్రీ పూర్తియిన వారి నుంచి దరఖాస్తులను కోరుతోంది. మీ కెరీర్ అపరిమితమైన వృద్ధికి, అసాధారణమైన అవకాశాలకు టీసీఎస్ వారధిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. 2019, 2020, 2021 సంవత్సారల్లో ఇంజనీరింగ్ పూర్తయిన గ్రాడ్యుయేట్‌లు ఇందుకు అర్హులుగా పేర్కొంది. అలాగే 6 నుంచి 12 నెలల పాటు IT అనుభవం కూడా ఉండాలని పేర్కొంది.

ఎవరు అర్హులు: BE / B.Tech / ME / M.Tech / MCA/ M.Sc ఉత్తీర్ణత సాధించినవారు.

ఏ సంవత్సరంలో పాసైన వారు అర్హులు – 2019, 2020, 2021, 6 నుంచి 12 నెలల వరకు IT పని అనుభవం.

పదో తరగతి, ఇంటర్, డిప్లొమా (వర్తిస్తే), గ్రాడ్యుయేషన్, పోస్ట్-గ్రాడ్యుయేషన్ పరీక్షలో ప్రతిదానిలో 70 శాతం లేదా 7 CGPA ఉండాలి. (అన్ని సెమిస్టర్‌లలోని అన్ని సబ్జెక్టులు)

అలాగే అభ్యర్థి నిర్ణీత కోర్సు వ్యవధిలో కోర్సును పూర్తి చేసి ఉండాలి. అంటే గ్యాప్ ఉండకూడదు. అభ్యర్థికి ఎలాంటి బ్యాక్‌లాగ్‌లు కూడా ఉండకూడదు. అలాగే అభ్యర్థులు తప్పనిసరిగా 18 నుంచి 28 సంవత్సరాల వయసు వారై ఉండాలని టీసీఎస్ పేర్కొంది.

ఈ ఎంపిక విధానం రెండు రౌండ్లుగా నిర్వహిస్తున్నారు. మొదట రాత పరీక్ష ఉంటుంది. రాత పరీక్షలో ఎంపికైన వారు ఇంటర్వ్యూ రౌండ్‌కు ఎంపిక చేస్తారు.

అయితే రాత పరీక్ష మూడు విభాగాల్లో కండక్ట్ చేయనున్నారు. పార్ట్ 1లో అభ్యర్థుల అడ్వాన్స్‌డ్‌ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ స్కిల్స్‌పై ప్రశ్నలు ఉంటాయి. పార్ట్ 2, పార్ట్‌ 3లలో అభ్యర్థుల వెర్బల్ ఎబిలిటీ స్కిల్స్, అడ్వాన్స్‌డ్ కోడింగ్ స్కిల్స్‌పై ప్రశ్నలు ఉంటాయి.

జీతం: అండర్ గ్రాడ్యుయేట్లకు సంత్సరానికి రూ. 7 లక్షలు కాగా, పీజీ చేసిన వరాకి ఏడాదికి రూ. 7.3 లక్షలు అందించనున్నారు.

దరఖాస్తు ప్రక్రియ: TCS NextStep పోర్టల్‌లో దరఖాస్తులు చేసుకోవాలి. అందులో డిజిటల్ డ్రైవ్ కోసం అప్లై చేసుకోవాలి. దరఖాస్తులు పంపేందుకు చివరి తేదీ ఫిబ్రవరి 25, 2022గా ఉంది. ఈలోపే అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

రాత పరీక్ష ఎప్పుడనేది త్వరలో ప్రకటిస్తారు. టీసీఎస్ ఆఫ్ క్యాంపస్ డిజిటల్ హైరింగ్‌ 2022కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా టీసీఎస్‌ హెల్ప్‌డెస్క్‌కు ilp.support@tcs.com మెయిల్ పంపవచ్చు. అలాగే 18002093111 హెల్ప్‌లైన్ నంబర్‌‌కు కూడా కాల్ చేసి, సందేహాలు తీర్చుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం టీసీఎస్ వెబ్‌సైట్‌ను సందర్శించి తెలుసుకోవచ్చు.

 

Gemini Internet

14, ఫిబ్రవరి 2022, సోమవారం

Indian Coast Guard Jobs: ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షకుపైగా జీతం పొందే అవకాశం.

Indian Coast Guard Recruitment: ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వశాఖకి చెదిన ఈ సంస్థ నోయిడాలోని ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రిక్రూట్‌మెంట్‌ కార్యాలయంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 11 ఫోర్‌మెన్ (స్పోర్ట్స్‌) పోస్టులను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎకనామిక్స్‌/కామర్స్‌/స్టాటిస్టిక్స్‌/ బిజినెస్‌ స్టడీస్‌/ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. వీటితో పాటు సంబంధిత పనిలో ఏడాది అనుభవం ఉండాలి.

* అభ్యర్థుల వయసు 30 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తులను డైరెక్టర్‌ జనరల్‌, కోస్ట్‌ గార్డ్‌ హెడ్‌క్వార్టర్స్‌, డైరెక్టరేట్‌ ఆఫ్‌ రిక్రూట్‌మెంట్‌, ఫేజ్‌ 2, ఇండస్ట్రియల్‌ ఏరియా, సెక్టర్‌ 62, నోయిడా, యూనీ 201309 అడ్రస్‌కు పంపించాలి.

* అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్‌, రాత పరీక్ష, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 35,400 నుంచి రూ. 1,12,400 వరకు చెల్లిస్తారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

 

Gemini Internet

NMDC Recruitment 2022: ఎన్ఎండీసీలో భారీగా ఉద్యోగ ఖాళీలు.. నోటిఫికేషన్ విడుదల

NMDC Recruitment 2022: ఎన్ఎండీసీలో భారీగా ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఎన్ఎండీసీ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఎన్ఎండీసీ అధికారిక వెబ్‌సైట్ nmdc.co.in ని సందర్శించడం ద్వారా పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 2 మార్చి, 2022 గా ప్రకటించారు. ఈ ప్రకటన ద్వారా మొత్తం 200 పోస్టులు భర్తీ చేయనుననారు. నోటిఫికేషన్‌కు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

అర్హతలు.. వివిధ పోస్టులకు అర్హత ప్రమాణాలు భిన్నంగా ఉన్నాయి. వయోపరిమితి, విద్యార్హత వంటి వివరాలను తెలుసుకోవడానికి అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. Gemini Internet

అప్లికేషన్ ఫీజు.. అభ్యర్థులు రూ. 150 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. SC/ST/PwD/ex-servicemen కేటగిరీలకు చెందిన అభ్యర్థులు, డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది. Gemini Internet

పోస్టుల సమగ్ర వివరాల లింక్: పోస్టులకు సంబంధించిన సమగ్ర సమాచారం తెలుసుకోవాలనుకునే అభ్యర్థులు ఈ లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా తెలుసుకోండి. (పోస్టుల వివరాల లింక్)

ఎలా దరఖాస్తు చేయాలంటే.. 1: ఎన్ఎండీసీ పోస్ట్‌లకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు ఎన్ఎండీసీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. 2: హోమ్‌పేజీలో అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయండి 3: దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి. 4: అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి 5: ఆపై, అప్లికేషన్ ఫీజు చెల్లించండి. 6: ‘‘సబ్‌మిట్’’ ఆప్షన్‌ను క్లిక్ చేసి, అప్లికేషన్ ఫామ్‌ను ప్రింట్ అవుట్ తీసుకోవాలి.

Gemini Internet